సోషల్‌ మీడియాలో జనసేన సైకోల మాటల ఉగ్రవాదం | Womens groups express anger at Janasena | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో జనసేన సైకోల మాటల ఉగ్రవాదం

Nov 15 2026 5:37 AM | Updated on Nov 15 2026 5:37 AM

Womens groups express anger at Janasena

సమావేశంలో మాట్లాడుతున్న సామాజికవేత్త వసుంధర

‘ఎక్స్‌’ స్పేస్‌ వేదికగా బరితెగింపు భాష జుగుప్సాకరం

తల్లి గర్భం నుంచి పుట్టిన ఏ ఒక్కరూ అలా మాట్లాడరు

చంద్రబాబు భార్య, లోకేశ్‌ భార్య ఆ వ్యాఖ్యలు విని సమర్థించగలరా?  

గతంలో చంద్రబాబు తన భార్యను ఏదో అన్నారని కన్నీరు పెట్టుకున్నారు 

ఘటన జరిగి మూడు రోజులైనా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ స్పందించలేదు 

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.. మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్‌

గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌):  ‘రాష్ట్రంలో సోషల్‌ మీడియాలో మాటల ఉగ్రవాదం నడుస్తోంది. జనసేన పార్టీ కార్యకర్తలమంటూ కొందరు టెర్రరిస్టుల్లా వ్యవహరిస్తున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తన మూడో భార్యకు విడాకులు ఇచ్చిన సందర్భంలో జనసేన పార్టీకి చెందిన 350 మంది కార్యకర్తలు ఎక్స్‌ స్పేస్‌లో ఇష్టారీతిన మహిళలపై అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. వారు వాడిన భాష తల్లి గర్భం నుంచి పుట్టిన ఏ ఒక్కరూ వాడరు. 

జెనిటికల్లీ మాడిఫైడ్‌ జంతువులకు పుట్టిన వికృత మృగాళ్లే ఇటువంటి భాష మాట్లాడుతారు’ అంటూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సామాజికవేత్త డాక్టర్‌ వసుంధర ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఐక్యవేదిక శనివారం మీడియా సమావేశం నిర్వహించింది. మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘ఎక్స్‌’ స్పేస్‌ వేదికగా మహిళలపై అవాంఛనీయమైన మాటలు, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటువంటి బరితెగించిన భాష వాడారని విమర్శించారు.

ప్రతిపక్ష నేత సతీమణి, చెల్లెలు, తల్లిని టార్గెట్‌ చేశారని, మరోవైపు సినీహీరో అల్లు అర్జున్‌ భార్య, జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్యను లక్ష్యంగా చేసుకుని దుర్భాషలాడారని వివరించారు. ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే కుట్ర ఇందులో దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్న వారిని, కేవలం ఇంటికే పరిమితమైన మహిళల వ్యక్తిత్వ హననం చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మహిళా సంఘ నేతలు ఖుర్షీదా బేగం, దుర్గాభవాని, అమల, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే..  

చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు నోరు విప్పడం లేదు?
మహిళలను అసభ్యకరంగా, కించపరిచే విధంగా మాట్లాడడం యావత్‌ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ భాష వింటే వాళ్లు మనుషులా? పశువులా అన్న అనుమానం కలుగుతోంది. ఓ వైపు మహిళలను గౌరవిస్తామని చెబుతూనే ఎందుకింత దిగజారుడుతనంగా వ్యవహరించారు. చంద్రబాబు వయసు 75ఏళ్లు. ఇంత దుర్మార్గంగా మహిళలను మాట్లాడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? ఘటన జరిగి మూడు రోజులు కావొస్తున్నా వారిద్దరూ నోరు మెదపకపోవడం దుర్మార్గం. ఇటువంటి పెడ ధోరణులను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.   – సావిత్రి, రాష్ట్ర కార్యదర్శి, ఐద్వా 

తిరోగమనం వైపు వెళుతున్నాం 
మహిళలు రాజకీయంలో ఉన్నా, ఇళ్లలో ఉన్నా వారి గౌరవానికి భంగం కలుగుతూనే ఉంది. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మన రాష్ట్రంలో ఇదివరకటి కన్నా ఎక్కువైంది. పవన్‌కళ్యాణ్‌ విడాకులు వ్యక్తిగతం కాదు. సనాతనం అని చెప్పుకుంటూ పవన్‌ ఎవరికి ఆదర్శంగా ఉన్నారు? మహిళల గౌరవానికి భంగం కలిగించడం, అవమానకరమైన కామెంట్లు పెట్టించడం ఏమిటి? నాగరికత పెరుగుతుంటే మనం మాత్రం తిరోగమనం వైపు వెళుతున్నాం. కార్యకర్తలు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండించకపోవడం కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. – పద్మ, కార్యదర్శి, ప్రగతిశీల మహిళా సంఘం 

చట్టపరమైన చర్యలు తీసుకోవాలి 
ఎక్స్‌ స్పేస్‌లో చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. దీనిపై పవన్‌ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదు? ఆయనే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది. మాజీ సీఎం సతీమణి ఏనాడైనా రాజకీయ వేదికల మీద మాట్లాడారా? మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే, అసభ్యకర భాష వాడుతుంటే మహిళా కమిషన్‌ ఏం చేస్తోంది? ఈ ఘటనపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలి.     – దుర్గాభవాని, జాతీయ మహిళా సంఘం నేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement