సాక్షి, చెన్నై: టీవీకే నేత తమిళనాడు మంత్రి ఆధవ్ అర్జున విడాకుల వార్త ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పరస్పర అంగీకారంతో 14 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్టు ఆధవ్ భార్య డైసీ మార్టిన్ సోమవారం ప్రకటించారు.
"14 ఏళ్ల పాటు ఒకరి జీవితంలో ఒకరు భాగమైన తర్వాత, ప్రేమ, అవగాహనతో కూడిన ఈ ప్రయాణంలో స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా, తల్లిదండ్రులుగా జీవితంలోని వివిధ దశలను కలిసి దాటాము. నేడు, ఆధవ్ అర్జున ,నేను భార్యాభర్తలుగా విడిపోయి వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలని పరస్పర అంగీకారంతో నిర్ణయించుకున్నాము" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే, విడాకుల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైందా లేదా పూర్తయిందా అనే దానిపై ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.అలాగే తమ ఇద్దరి జీవితాల్లో ఇదొక కొత్త అధ్యాయమే అయినప్పటికీ, పరస్పర సహకారంతో బిడ్డ పెంపకం, సంక్షేమానికి తమ తొలి ప్రాధాన్యత అని ప్రకటించారు.

ఆధవ్ అర్జునపై గౌరవం ఎప్పుడూ ఉంటుంది. ఆయన ఎంచుకునే ప్రతి రంగంలోనూ సంతోషం, సక్సెస్ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభిమానుల ప్రేమతో పాటు, ప్రైవసీని కూడా కోరుకుంటున్నామని వేడుకున్నారు. కోరుతున్నామన్నారు.
ఇదీ చదవండి: ఒక యమున, రెండు చిత్రాలు : బీజేపీ, ఆప్ మాటల యుద్ధం
వీసీకే పార్టీకి చెందిన ఆధవ్ అర్జున గతంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు. కాగా డైసీ మార్టిన్ లాటరీ వ్యాపార దిగ్గజం శాంటియాగో మార్టిన్ కుమార్తె .


