లిప్ కిస్ కోరుతూ యూట్యూబర్‌కు వేధింపులు.. వీడియో వైరల్! | Justketh thai French Origin Rajasthan Udaipur on the lips | Sakshi
Sakshi News home page

లిప్ కిస్ కోరుతూ యూట్యూబర్‌కు వేధింపులు.. వీడియో వైరల్!

Nov 16 2026 12:46 PM | Updated on Nov 16 2026 1:07 PM

Justketh thai French Origin Rajasthan Udaipur on the lips

ఉదయ్‌పూర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ విదేశీ మహిళా యూట్యూబర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాత్రివేళ ఆమె లైవ్‌స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి చేసిన అసభ్యకర డిమాండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థాయ్‌–ఫ్రెంచ్ మూలాలున్న యూట్యూబర్ జస్ట్‌కెత్ (JustKeth) ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయ్‌పూర్‌లోని ఓ రద్దీ ప్రాంతంలో ఆమె లైవ్‌స్ట్రీమింగ్ చేస్తుండగా ఓ వ్యక్తి దగ్గరకు వచ్చాడు.

ఆమెను పలకరించిన అతడు.. ‘ప్లీజ్.. ఒక్క కిస్ ఇవ్వండి. పెదవులపై ఒక్క ముద్దు పెట్టండి’ అంటూ పదేపదే అడిగాడు. అయితే ఆమె వెంటనే నిరాకరించారు. తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ అతడు మొండితనంతో వ్యవహరించడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆమె ముఖంలోనూ ఆ ఇబ్బంది స్పష్టంగా కనిపించింది.
 

చివరకు కిస్ అడగడం ఆపి తనతో ఫొటో దిగాలని ఆ వ్యక్తి కోరాడు. అందుకు ఆమె అంగీకరించి ఫొటో దిగారు. అనంతరం అతడు కరచాలనం చేసేందుకు చేయి ముందుకు చాచగా.. ఆమె మాత్రం ‘ఫిస్ట్‌బంప్’ ఇచ్చారు. ఈ మొత్తం ఘటన లైవ్‌స్ట్రీమింగ్‌లో రికార్డైంది. ఈ వీడియోను జస్ట్‌కెత్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ క్లిప్‌ను 50 లక్షల మందికి పైగా జనం వీక్షించారు.

వీడియో చూసిన నెటిజన్లు ఆ వ్యక్తి ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకరు వద్దని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా పదేపదే ఒత్తిడి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు పర్యాటక ప్రాంతాల్లో మహిళలతో అపరిచితులు మర్యాదగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: ‘భారత్‌కు ప్రజాస్వామ్య పాఠాలా?’.. మెలోనీ మిత్రపక్షం ఫైర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement