West Bengal: మరో ఎన్‌కౌంటర్.. 6 నెలల్లో ఐదో ఘటన! | Man accused of firing at cop shot dead 5th encounter in 6 months | Sakshi
Sakshi News home page

West Bengal: మరో ఎన్‌కౌంటర్.. 6 నెలల్లో ఐదో ఘటన!

Nov 16 2026 10:31 AM | Updated on Nov 16 2026 10:35 AM

Man accused of firing at cop shot dead 5th encounter in 6 months

బీర్భూమ్: పశ్చిమ బెంగాల్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసులపై కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రతన్ షేక్ పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతిచెందాడు. బీర్భూమ్ జిల్లా నానూర్‌లో నవంబర్ 15న ఈ ఘటన జరిగింది. రతన్ షేక్‌పై మొత్తం 36 క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో గత ఆరు నెలల్లో బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ల సంఖ్య ఐదుకు చేరింది.

శాంతినికేతన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు శుక్రవారం రాత్రి రతన్ షేక్‌ను అరెస్టు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అతడు పోలీసులపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో కానిస్టేబుల్ బిశ్వజిత్ దాస్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను బుర్ద్వాన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటన దరిమిలా ముఖ్యమంత్రి సువేందు అధికారి శనివారం ఆసుపత్రికి వెళ్లి గాయపడిన కానిస్టేబుల్‌ను పరామర్శించారు. నిందితుడిపై 36 కేసులు ఉన్నాయని, 2026లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీర్భూమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారని తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ మద్దతున్న వ్యక్తులుగా నిందితులను అభివర్ణిస్తూ, అతడికి బెయిల్ ఎలా వచ్చిందనే అంశంపై విచారణ జరిపిస్తామని చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రపైనా పరిశీలన ఉంటుందని వెల్లడించారు.

ఆదివారం నిందితుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై రతన్ షేక్ కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో అతడు గాయపడ్డాడు. బోల్పూర్‌లోని సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై మంత్రి శరద్వత్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ పోలీసులు తమ రక్షణ కోసం ఆయుధాలు వినియోగించారని, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: బతికుండగానే సొంత పెద్దకర్మ.. 900 మందికి విందు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement