Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య! | Pakistani TV anchorperson shot dead at home | Sakshi
Sakshi News home page

Pakistan: ప్రముఖ టీవీ యాంకర్ దారుణ హత్య!

Nov 9 2026 11:24 AM | Updated on Nov 9 2026 11:24 AM

Pakistani TV anchorperson shot dead at home

రావల్పిండి: పాకిస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. రావల్పిండిలో ప్రముఖ టీవీ యాంకర్ రబియా అహ్సాన్ తన ఇంట్లోనే తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఆదివారం గుల్షన్‌ఆబాద్ ప్రాంతంలోని నివాసంలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రబియా భర్తను అదుపులోకి తీసుకుని, అనుమానిత తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ ప్రమాదవశాత్తూ పేలిందని ఆమె భర్త పోలీసులకు చెప్పినట్లు సమచారం. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పాక్ ప్రథమ మహిళ ఆసిఫా భుట్టో జర్దారీ ఈ హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే రావల్పిండిలో గత ఆగస్టులో డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ హీనా జావేద్ కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని, ఆ కేసు దర్యాప్తు ఇంకా తేలలేదని ఆమె గుర్తుచేశారు. 

ఇదీ చదవండి: కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement