కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం! | 6 Hisar residents burnt alive as car catches fire in UPs Muzaffarnagar | Sakshi
Sakshi News home page

కారులో మంటలు.. ఆరుగురి సజీవదహనం!

Nov 9 2026 11:11 AM | Updated on Nov 9 2026 11:11 AM

6 Hisar residents burnt alive as car catches fire in UPs Muzaffarnagar

ముజఫర్‌నగర్‌: ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. షామ్లీ హైవేపై విద్యుత్‌ స్తంభాన్ని కారు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు సజీవదహనమయ్యారు. హర్యానాలోని హిసార్‌ నుంచి హరిద్వార్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని, వారి గుర్తింపుతో పాటు కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. కారు మంటల్లో చిక్కుకోవడంతో అందులోని ప్రయాణికులు బయటకు రాలేకపోయారని స్థానికులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పండక్కి ‘పీఎల్‌’ కూడా ఇవ్వరా?.. సోషల్‌ మీడియాలో రచ్చ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement