తిల‌క్ వ‌ర్మ ఖాతాలో అరుదైన రికార్డు | Tilak Varma Joins Elite List-Most catches As-Fielder-For-India-In-T20Is | Sakshi
Sakshi News home page

తిల‌క్ వ‌ర్మ ఖాతాలో అరుదైన రికార్డు

Oct 12 2026 7:55 AM | Updated on Oct 12 2026 8:20 AM

Tilak Varma Joins Elite List-Most catches As-Fielder-For-India-In-T20Is

Photo Credit: BCCI Twitter

వెస్టిండీస్‌తో జ‌రిగిన మూడో టీ20లో టీమిండియా వైస్ కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ మ‌రో అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20ల్లో టీమిండియా త‌ర‌ఫున అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయ‌ర్ల జాబితాలో తిల‌క్ వ‌ర్మ చోటు సంపాదించాడు. నిన్న‌టి మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ 50 క్యాచ్‌ల మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. 

ఈ నేప‌థ్యంలో టీ20ల్లో 50కి పైగా క్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఐదో భార‌త ఆట‌గాడిగా తిల‌క్ వ‌ర్మ నిలిచాడు. టీ20ల్లో టీమిండియా త‌ర‌ఫున అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డు రోహిత్ శ‌ర్మ పేరిట ఉంది. అతడు 65 క్యాచ్‌లు తీసుకున్నాడు. రోహిత్ త‌ర్వాత వ‌రుస‌గా హార్దిక్ పాండ్యా (64), సూర్య‌కుమార్ యాద‌వ్ (58), విరాట్ కోహ్లి (54) ఉన్నారు. తాజాగా తిల‌క్ వ‌ర్మ వీరి స‌ర‌స‌న చేరాడు.

ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ పురుషుల‌ టీ20 క్రికెట్‌లో 34 మంది ప్లేయ‌ర్లు 50 లేదా అంత‌కంటే ఎక్కువ క్యాచ్‌లు తీసుకున్నారు. అయితే తిలక్ వర్మ ప్రతి ఇన్నింగ్స్‌లో 0.757 డిస్మిసల్స్ నిష్పత్తిలో క్యాచ్‌లు తీసుకొని మొద‌టి స్థానంలో నిలవ‌డం విశేషం. యూఏఈకి చెందిన మహమ్మద్ వసీమ్ (0.767 - 99 మ్యాచ్‌లలో 76 క్యాచ్‌లు) తిల‌క్ వ‌ర్మ త‌ర్వాతి స్థానంలో ఉన‌ర్నాడు.

మ్యాచ్ విష‌యానికొస్తే.. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత జట్టు... వెస్టిండీస్‌తో మూడో టి20లో విజయం సాధించింది. ఆదివారం జరిగిన పోరులో శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని టీమిండియా 14 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2–1తో ముందంజ వేసింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. అభిషేక్‌ శర్మ (30 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 

ఇషాన్‌ కిషన్‌ (37; 6 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (28; 4 ఫోర్లు) రాణించారు. విండీస్‌ బౌలర్లలో చేజ్, షమార్‌ జోసెఫ్, స్ప్రింగర్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో విండీస్‌ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 209 పరుగులు చేసి విజయానికి దూరంగా నిలిచింది. కమిల్‌ పూరన్‌ (42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెట్‌మైర్‌ (43; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అర్ష్ దీప్ 3, నమన్‌ ధీర్‌ 2 వికెట్లు పడగొట్టారు.

ఇదీ చ‌దవండి: Shreyas Iyer: 'ఆ అమ్మాయికి మాటిస్తున్నా.. బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement