Photo Credit: Twitter
ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్, ఇయాన్ బిషప్ మధ్య ఆసక్తికర సంభాషణ నడిచింది. ఇయాన్ బిషప్ అడిగిన ప్రశ్నకు అయ్యర్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు.
తొలి టీ20లో సెంచరీతో జట్టును గెలిపించిన శ్రేయస్ అయ్యర్.. రెండో టీ20 మ్యాచ్‌లోనూ 40 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మూడో టీ20లో మాత్రం ఒక్క పరుగు మాత్రమే చేసి రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో అయ్యర్ ఆటను చూసేందుకు వచ్చిన ఒక వీరాభిమాని తన ఫెవరెట్ ప్లేయర్ ఔటవ్వడంతో బోరుమని ఏడ్చింది. ఆమె ఏడుస్తున్న దృష్ట్యాలు కెమెరాల్లో రికార్డయ్యియి.
ఇది గమనించిన ఇయాన్ బిషప్ మ్యాచ్ అనంతరం శ్రేయస్‌తో మాట్లాడుతూ ఫ్యాన్ గర్ల్ ఏడ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. ''శ్రేయాస్ నువ్వు తొందరగా ఔటవ్వడంతో, ఈరోజు మ్యాచ్‌కు వచ్చిన వారిలో మీ వీరాభిమాని ఒకరు స్టాండ్ష్‌లో బోరున ఏడ్వడం గమనించాను. నాకు తెలిసి ఆ అమ్మాయి నీకు పెద్ద ఫ్యాన్ అనుకుంటా. ఈ విషయంపై నీ స్పందన ఏంటి'' అని అడిగాడు.
దీనికి అయ్యర్ నవ్వుతూ.. ''నేను ఎప్పుడు టీమ్‌కు బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. కానీ దురదృష్టవశాత్తూ ఇవాళ తొందరగా ఔటయ్యాను. నా ఆటను చూసేందుకు వచ్చిన వీరాభిమానిని పూర్తిగా నిరాశపరిచాను. పెద్ద స్కోరు చేయకపోవడంపై క్షమాపణ అడుగుతున్నా. ఆ అమ్మాయికి మాటిస్తున్నా.. కచ్చితంగా తర్వాతి మ్యాచ్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఆమె మొహంలో సంతోషాన్ని తిరిగి తెస్తాను'' అని పేర్కొన్నాడు.
అయ్యర్ వ్యాఖ్యలు విన్న సదరు ఫ్యాన్ గర్ల్ స్టాండ్స్‌లోనే ఎగిరి గంతేయడం విశేషం. ప్రస్తుతం బిషప్, అయ్యర్ మధ్య సంభాషణ వైరల్‌గా మారింది. టీమిండియా కెప్టెన్‌గానే గాక తన అభిమాని మొహంలో సంతోషం చూడడం కోసం మాట్లాడిన అయ్యర్ ఒక మెట్టు పైకి ఎక్కేశాడు అని చెవులు కొరుక్కుంటున్నారు.
🚨 INDIAN GIRL BREAKS DOWN IN TEARS AFTER SHREYAS IYER'S EARLY DISMISSAL! 💔 A young Indian girl couldn't control her emotions after her favourite cricketer, Shreyas Iyer, was dismissed for just 1 run. She started crying in the stands, and despite her boyfriend's repeated attempts to console her, she couldn't stop her tears. Even legendary Sunil Gavaskar praised the young fan for her emotional attachment and unconditional love for Shreyas Iyer. This is what being a true fan looks like! ❤️🥹
— Central Cricket (@arshdeep3444) October 11, 2026
ఇదీ చదవండి:


