పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు! | CBSE 12th exam 2027 on holi studets fire | Sakshi
Sakshi News home page

పండుగ పూట పరీక్షేంటి?.. ‘బోర్డు’ను నిలదీస్తున్న విద్యార్థులు!

Nov 9 2026 9:22 AM | Updated on Nov 9 2026 9:27 AM

CBSE 12th exam 2027 on holi studets fire

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌(2027)పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మార్చి 22న హోలీ పండుగ ఉండగా, అదే రోజు కొన్ని సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించనున్నట్లు టైమ్‌టేబుల్‌లో పేర్కొన్నారు. నాలెడ్జ్ ట్రెడిషన్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఇండియా, బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ తదితర పరీక్షలు ఆ రోజున జరగనున్నాయి. దీంతో పండుగ రోజున పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థులు ‘బోర్డు’ను నిలదీస్తున్నారు.

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు 2027 ఫిబ్రవరి 16 నుంచి ఏప్రిల్ 9 వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 16న ఫిజిక్స్, ఫిబ్రవరి 23న అకౌంటెన్సీ, ఫిబ్రవరి 25న జాగ్రఫీ, ఫిబ్రవరి 27న కెమిస్ట్రీ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 2న సైకాలజీ, మార్చి 5న ఇంగ్లిష్, మార్చి 9న మ్యాథ్స్, మార్చి 13న హిందీ, మార్చి 16న ఎకనామిక్స్, మార్చి 19న పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరగనున్నాయి.

మార్చి 20న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్చి 25న బయాలజీ, మార్చి 27న హిస్టరీ, మార్చి 30న సోషియాలజీ, మార్చి 31న కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్షలు ఉంటాయి. ఏప్రిల్ 1న బిజినెస్ స్టడీస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.

విద్యార్థులు సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల టైమ్‌టేబుల్, మార్కుల విభజన వివరాలను తెలుసుకోవచ్చు. ఇందుకోసం వెబ్‌సైట్‌లో సంబంధిత పీడీఎఫ్‌ లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. మార్చి 22(హోలీ)న పరీక్షల నిర్వహణపై బోర్డు అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. 

ఇదీ చదవండి: ‘టపాసుల పొగతో వ్యాధులు నయం’ బీజేపీ ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement