తిన్న ప్లేట్లను కడిగేందుకు వెళ్లి... విషాదం! | Hyderabad Quarry Accident Two Students Death Jawahar Nagar | Sakshi
Sakshi News home page

తిన్న ప్లేట్లను కడిగేందుకు వెళ్లి... విషాదం!

Nov 2 2026 10:58 AM | Updated on Nov 2 2026 11:08 AM

Hyderabad Quarry Accident Two Students Death Jawahar Nagar

దుర్ఘటనకు ముందు క్వారీ వద్ద రోహిత్, సియాన్‌

హైదరాబాద్‌, జవహర్‌నగర్‌: అప్పటివరకూ స్నేహితులంతా కలిసి ఆహ్లాదంగా గడిపారు. అక్కడే వంట చేసుకొని తిని ప్లేట్లు కడిగేందుకు క్వారీ గుంతలో దిగగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఇద్దరు మృత్యువాత పడిన దుర్ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన ఐదుగురు స్నేహితులు రోహిత్‌ (18), సియాన్‌ (18), రక్షిత్, మురారి, పీయూష్‌ ఈత కోసం మల్కారం క్వారీ వద్దకు వెళ్లారు. క్వారీ గుంత సమీపంలోనే వంట చేసుకొని తిన్నారు. ఈ క్రమంలో తిన్న ప్లేట్లను క్వారీ నీటిలో కడుక్కునే క్రమంలో అవి నీటిలోకి జారిపోయాయి. వాటి కోసం సియాన్, రోహిత్‌ క్వారీలోకి దిగగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు.

తోటి స్నేహితులు ఎంత ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న జవహర్‌నగర్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డీఆర్‌ఎఫ్‌ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి సియాన్, రోహిత్‌ మృతదేహాలను నీటిలోంచి వెలికితీశారు. కాగా.. రోహిత్‌ సీవీఆర్‌, సియాన్‌ సీఎంఆర్ కళాశాలల్లో బీటెక్‌ చదువుతున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: పతకం అందుకున్న కొద్దిసేపటికే.. మారథాన్‌లో విషాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement