breaking news
quarry accident
-
పలకల క్వారీలో ఘోర ప్రమాదం
మార్కాపురం రూరల్: పలకల క్వారీలోని చెరియలు విరిగి పడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడికే మృతి చెందిన సంఘన మండలంలోని రాయవరం గ్రామ సమీపంలో అడ్డ కొండ వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన చిన్ని మంగమ్మ (35), బీమనబోయిన సీతమ్మ (30) మృతి చెందారు. సీతమ్మ భర్త కాశయ్యకు తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులు కథనం ప్రకారం.. రాయవరం సమీపంలోలి ప్రముఖ పారిశ్రామిక వేత్త పలకల క్వారీలో మంగమ్మ, సీతమ్మ పని నిమిత్తం క్వారీలోకి వెళ్లారు. అయితే క్వారీ కింది భాగంలో పని చేస్తుండగా తీస్తుండంగా ఒక్క సారిగా దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి పెద్ద పలకల రాయి వారిపై పడింది. దీంతో మంగమ్మ, సీతమ్మలు అక్కడికక్కడే మృతి చెందారు. సీతమ్మ భర్త బీమనబోయిన కాశయ్య మాత్రం ముందుగానే క్వారీ నుంచి బయటకి వస్తుండగా రాళ్లు పైన పడి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే గంట ముందు మృతురాలు మంగమ్మ భర్త గురునాథం పొలం కొలతలు కోసం సర్వేరర్ ఫోన్ చేయటంతో క్వారీ నుంచి వెళ్లి పోయాడు. దీంతో అతనికి ప్రమాదం తప్పింది. మృత దేహాలు వెలికి తీయటానికి పొక్లెయిన్‌తో దాదాపు 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మృత దేశాహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రం అయ్యాయి. మృతురాలు మంగమ్మకు ముగ్గురు పిల్లలు, సీతమ్మకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక్కసారి రెండు కుటుంబాల చిన్నారులు అనాథలుగా మారడంతోటి గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు. సీఐ భీమానాయక్, ఎస్ఐ మల్లికార్జునరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
క్వారీలో ప్రమాదం: ముగ్గురి మృతి
అద్దంకి: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఈర్ల కొండలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలో ఉన్న ఓ క్వారీలో రాయి మీదపడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. -
క్వారీలో ప్రమాదం: ఒకరి మృతి
చౌటుప్పల్: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద క్వారీలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. క్వారీ డ్రిల్లింగ్ కోసం బ్లాస్టింగ్ జరపగా బండరాళ్లు పడి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల గ్రామానికి చెందిన జగన్(43) దుర్మరణం చెందారు. కాగా, నష్టపరిహారం ఇచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని మృతుడి కుటుంబీకులు క్వారీ వద్ద ఆందోళనకు దిగారు. క్వారీ యాజమాన్యం బాధిత కుటుంబీకులతో చర్చలు జరుపుతోంది. -
‘అడవి’లో ఘోరం
క్వారీ బండరాయి పడి ఇద్దరి మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు పెనుమూరు మండలం అడవిపల్లిలో ఘటన మృతులు యాదమరి మండలం గొల్లపల్లివాసులు పత్తాలేని క్వారీ యాజమాన్యం సాక్షి, చిత్తూరు/సిటీ/పెనుమూరు/యాదమరి: క్వారీ ప్రమాదంలో యాదమరి మండలం పావుకూరు గొల్లపల్లికి చెందిన సురేష్(28), కన్నయ్య(38) మృతి చెందారు. కందన్, జీ సురేశ్‌బాబు(32) అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన పెనుమూరు మండలం అడవిపల్లి క్వారీలో బుధవారం చోటుచేసుకుంది. కూలీలు..గాయపడిన వ్యక్తులు తెలిపిన వివరాల మేరకు గొల్లపల్లి దళితవాడకు చెందిన వారు పనికోసం అడవిపల్లి క్వారీకి వెళుతుంటారు. వారం, పదిరోజులు భార్యాబిడ్డలకు దూరంగా అడవిలోనే ఉంటారు. అప్పుడప్పుడు సొంత ఊరికి వెళ్లి వస్తుంటారు. ఈ క్రమంలోనే 11 మంది సోమవారం పనికి వెళ్లారు. బుధవారం కూడా ఉదయం 6.30 గంటలకు క్వారీకి వెళ్లారు. ఉదయం 9.45-10 గంటల మధ్యలో 30 అడుగుల ఎత్తున్న చిట్టాబ్రౌన్ రకానికి చెందిన గ్రానైట్ గుండును బ్లాస్ట్ చేసేందుకు రంధ్రాలు వేశారు. గుండు కింద మట్టి అధికంగా ఉండడంతో బ్లాస్ట్ చేసినా గుండు కిందకు పడదని భావించి మట్టిని తవ్వేందుకు కూలీలు ప్రయత్నించారు. సురేష్, కన్నయ్య సమ్మెటతో మట్టిదిబ్బలు పగులగొడుతున్నారు. మిగిలిన వారు గుండు కింద మట్టిని తొలగించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో గుండు నై చీలి పగిలిపోయి ఒక్కసారిగా సురేష్, కన్నయ్యపై పడి కింద ఉన్న కూలీలపై పడింది. క్షణాల్లో సురేష్, కన్నయ్య ప్రాణాలు వదిలారు. మిగిలిన కూలీలు అరగంటపాటు మట్టిని తవ్వి హిటాచీ సాయంతో బండరాళ్లను తొలగించారు. టిప్పర్ రాకుండా యాజమాన్యం అడ్డు ఘటన జరిగిన తర్వాత మృతులను, గాయపడిన వారిని టిప్పర్‌లో వేసుకుని చిత్తూరు జనరల్ ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు క్వారీ నుంచి టిప్పర్ రాకుండా యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు అడ్డుకున్నారు. ‘జరిగిందేదో జరిగిపోయింది. సమస్యను ఇక్కడే పరిష్కరించుకుందాం’ అని చెప్పబోయారు. దీంతో సెల్వనాథన్ అనే కూలీతో పాటు తక్కిన కూలీలు గొడవచేసి టిప్పర్‌ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరిన మృతదేహాలను మధ్యాహ్నం 3 గంటల వరకు టిప్పర్‌లోనే ఉంచారు. గాయపడిన సురేష్‌బాబు, కందన్‌కు చికిత్స చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో మిన్నంటిన రోదనలు క్వారీ ప్రమాద ఘటనను తెలుసుకున్న గొల్లపల్లి వాసులు ఆస్పత్రికి చేరుకున్నారు. విగతజీవులైన సురేష్, కన్నయ్యను చూసి వారి బంధువులు, పిల్లలు గుండెలలిసేలా రోదించా రు. సురేష్ తల్లిదండ్రులు చిన్నబ్బులు, సింగారమ్మ ఆయన భార్య శైలజను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. ‘లే సురేశా,లెయ్ నాన్నా’ అంటూ సురేష్ తండ్రి అక్కడ కన్నీరుమున్నీరయ్యారు. సురేష్‌కు కుమారుడు నితీష్, కుమారై అర్చన ఉన్నారు. కన్నయ్య ప్రమాదవార్త తెలుసుకుని అతని భార్య బుజ్జి స్పృహ కోల్పోయింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేశారు. కన్నయ్య కుమారై మహేశ్వరి తండ్రి మృతదేహం వద్ద బోరున ఏడుస్తూ ఉండిపోయింది. కుమారుడు కిరణ్ బెంగళూరులో క్వారీ పనిచేస్తున్నాడు. రెండురోజుల కిందట అడవిపల్లి క్వారీకి వచ్చి ఒక రోజు తండ్రికి సాయంగా పనిచేశాడు. తండ్రి మరణవార్తను తె లుసుకుని స్వగ్రామానికి బయలు దేరాడు. ఆ చిన్నారికేం తెలుసు...నాన్న ఇక రాడని..! కొడుకు చనిపోయాడని సురేష్ తల్లి సింగారమ్మ, భర్త దూరమయ్యాడని శైలజ, కొడుకు లేడనే నిజాన్ని జీర్ణించుకోలేక సురేష్ తండ్రి చిన్నబ్బులు గొల్లుమన్నారు. నాన్నమ్మ ఒడిలో కూర్చున్న సురేష్ కుమాైరె అర్చన మాత్రం వారు ఎందుకు ఏడుస్తున్నారో! ‘నాన్న పనికి పోయాడు...పండ్లు, మిఠాయిలు తీసుకుని ఇంటికి మళ్లీ వస్తాడు’ అనేలా అలా ఉండిపోయింది. రోదనల మధ్యలోనే నాన్నమ్మ ఒడిలో నిదురపోయింది. ఎంటెక్ చేశాడు...రాళ్లు కొట్టే పనికి పోతున్నాడు గాయపడిన సురేష్‌బాబు హైదరాబాద్‌లో బీటెక్ చేశాడు. సెయింట్‌మెరీస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేరాడు. కొన్ని కారణాల వల్ల మధ్యలోనే చదువు ఆపేశాడు. బతుకుదెరువు కోసం క్వారీ పనికి వెళుతున్నాడు. ఈ ప్రమాదంలో త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నా నడుము, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయి. కనీస జాగ్రత్తలు ఏవీ? క్వారీ వద్ద యాజమాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కూలీలకు హెల్మెట్లు, చేతులకు గ్లౌజులు ఇవ్వలేదు. అంత పెద్దరాళ్లను పగులగొట్టే ముందు ఇంజినీర్లు పర్యవేక్షణ తప్పనిసరి. కూలీలు మినహా అక్కడ మరో వ్యక్తి ఉండరు. ఏదైనా ప్రమాదం జరిగితే చిత్తూరుకు వచ్చేంత వరకు ప్రథమ చికిత్స కూడా ఉండదు. ప్రమాదం నుంచి బయటపడిన కూలీల్లో వినోద్, లాజర్, సంపత్, ప్రభు, సెల్వనాథన్, దుర్గయ్య, రాజ ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పాకాల సీఐ రాఘవన్, పెనుమూరు ఎస్ఐ ప్రతాపరెడ్డి, ఆర్ఐ మహేశ్వరి, వీఆర్వో కోదండరెడ్డి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. -
క్వారీలో పడి ముగ్గురు చిన్నారుల మృతి