కోల్‌కతా: దీపావళి, కాళీపూజ వేళ బాణసంచా కాల్చడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి వింత వ్యాఖ్యలు చేశారు. టపాసులు కాల్చడం వల్ల పలు వ్యాధులు నయమవుతాయని ఆమె పేర్కొన్నారు. కోల్‌కతాలోని టోలీగంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన పాపియా అధికారి.. తన నియోజకవర్గంలో నిర్వహించిన కాళీపూజ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మైక్ పట్టుకుని ప్రసంగిస్తుండగా ఆమె ముందే భారీ శబ్దంతో బాణసంచా పేలింది. అయినప్పటికీ తన ప్రసంగాన్ని కొనసాగించిన ఆమె.. బాణసంచా కాల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా టపాసులు కాల్చేందుకు అనుమతించినట్లు ఆమె పేర్కొన్నారు. బాణసంచా లేకుండా కాళీపూజ ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. అయితే పోలీసులు తెలిపిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, గతంలో పలు కాళీపూజ మండపాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి సువేందు అధికారి.. పండుగల సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని, శబ్ద కాలుష్య నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: దీపావళి వేళ.. వందేభారత్‌పై రాళ్ల దాడి!


