హైదరాబాద్‌లో కారు బీభత్సం | Car Hits Water Pipeline In Nagole Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కారు బీభత్సం

Oct 20 2026 10:23 AM | Updated on Oct 20 2026 10:37 AM

Car Hits Water Pipeline In Nagole Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నాగోల్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో కారు బీభత్సం సృష్టించింది. హయత్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి.. కారుతో వాటర్‌ పైపు లైన్‌ను ఢీకొట్టాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు ఢీకొనడంతో జల మండలి  ప్రధాన పైపు లైను పగిలిపోగా.. రోడ్డును నీరు ముంచెత్తింది. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. కొంతసేపు నీటి సరఫరా ఆగిపోయింది. జలమండలి సిబ్బంది పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టారు.

మరో ఘటనలో..
దురుగా వేగంగా వచ్చిన బొలేరో వాహనం కారును ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన కావలి రాజేష్‌ (30) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు.  రాజేష్‌  తన స్నేహితుడు పాల్నాటి రాకేష్‌తో కలిసి ఈ నెల 18న  కారులో గండిమైసమ్మకు వెళ్లారు.   రాత్రి 11 గంటల సమయంలో గండిమైసమ్మ నుంచి అన్నారం వైపు వస్తున్నారు. గాగిల్లాపూర్‌ చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం కారును ఢీకొట్టింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన రాకే‹Ùను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి మల్లేష్‌ ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా బొలేరో వాహనం డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: మాజీ ఐపీఎస్‌ భార్య హత్య కేసులో కీలక పరిణామం
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement