డాక్టర్‌ అవ్వాలనే కల.. ఎన్నో ఆశలు..! అంతలోనే అనంతలోకాలకు.. | Uttar Pradesh Muzaffarnagar MBBS Student Death Incident | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ అవ్వాలనే కల.. ఎన్నో ఆశలు..! అంతలోనే అనంతలోకాలకు..

Oct 20 2026 1:30 PM | Updated on Oct 20 2026 1:30 PM

Uttar Pradesh Muzaffarnagar MBBS Student Death Incident

ఉత్తరప్రదేశ్‌: డాక్టర్‌ కావాలనే కల.. ఎన్నో ఆశలు.. ఉజ్వల భవిష్యత్తుపై ఎన్నో ఆకాంక్షలు. కానీ ఇంతలోనే ఓ వైద్య విద్యార్థిని జీవితం విషాదాంతమైంది. ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న 24 ఏళ్ల శగున్‌ సైనీ హాస్టల్‌ గదిలో విగతజీవిగా కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ముజఫర్‌నగర్‌లోని బేగరాజ్‌పూర్‌ మెడికల్‌ కాలేజీలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

హర్యానాలోని కైతల్‌ జిల్లాకు చెందిన శగున్‌ సైనీ.. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఉన్న బేగరాజ్‌పూర్‌ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ 2023 బ్యాచ్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థినిగా చదువుతోంది. సోమవారం రాత్రి ఆమె గది తలుపు చాలాసేపటి నుంచి లోపలి వైపుగా మూసి ఉండటాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు హాస్టల్‌ భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది గది వెనుకవైపు ఉన్న కిటికీలో నుంచి చూడగా.. శగున్‌ ఆత్మహత్య చేసుకుని ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫోరెన్సిక్‌ బృందం కూడా గదిని పరిశీలించి ఆధారాలు సేకరించింది. ఈ ఘటనతో కాలేజీ ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది.

అయితే, వైద్య విద్యలో కీలక దశలో ఉన్న శగున్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీలో కలకలం .. వ్యాపారిపై ఐదు రౌండ్ల కాల్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement