yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం! | 19 Indian seafarers stranded in Yemen evacuated | Sakshi
Sakshi News home page

yemen: 19 మంది భారతీయులకు విముక్తి.. స్వదేశానికి పయనం!

Nov 9 2026 8:35 AM | Updated on Nov 9 2026 8:35 AM

19 Indian seafarers stranded in Yemen evacuated

ననా: యుద్ధ ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న యెమెన్‌లో చిక్కుకుపోయిన 19 మంది భారతీయ నావికులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. గత రెండు వారాలుగా హొదైదా, సనా ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని భారత అధికారులు సురక్షితంగా తరలించారు. ప్రస్తుతం వారంతా క్షేమంగా ఉండటంతోపాటు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారని యెమెన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. వారి తరలింపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది.

ఈ తరలింపు పరిణామం వెలుగులోకి రావడానికి కొద్ది రోజుల ముందే యెమెన్ తీరంలో జరిగిన ఓ ఘటనలో 14 మంది భారతీయులు చిక్కుకున్న విషయం బయటపడింది. అక్టోబర్ 23న హొదైదా సమీపంలోని ఓ పడవలో ఉన్న 14 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. .

మరోవైపు, యెమెన్‌కు చెందిన హౌతీ ప్రతినిధి యాహ్యా సరియా చేసిన ప్రకటనను కొన్ని అరబ్ మీడియా సంస్థలు ప్రచురించాయి. ఎర్ర సముద్రంలోని యూకర్ ద్వీపం సమీపంలో సౌదీ బలగాలు భారతీయులు ప్రయాణిస్తున్న పడవపై దాడి చేశాయని ఆయన ఆరోపించారు. అందులో 14 మంది భారతీయులు ఉన్నారని, వారిని హౌతీ బలగాలు రక్షిస్తున్నాయని పేర్కొన్నారు.

ఇటీవల సౌదీ అరేబియా, యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. హౌతీలు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను సౌదీ అడ్డుకోగా.. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యెమెన్‌పై వైమానిక దాడులు నిర్వహించాయి. దీంతో 2022లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఏర్పడిన ప్రశాంతతకు మళ్లీ విఘాతం కలిగే ప్రమాదం ఏర్పడింది. ఈ ఘర్షణల ప్రభావం పౌర, ఇంధన మౌలిక సదుపాయాలపైనా పడుతోంది. అంతర్జాతీయ నౌకాయానానికి అత్యంత కీలకమైన ఎర్ర సముద్రం, బాబ్ అల్ మందబ్ జలసంధి భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఇదీ చదవండి: ఆమ్‌స్టర్‌డామ్‌ వీధుల్లో ఇజ్రాయెల్‌ వ్యతిరేక నిరసనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement