శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన పాకిస్తాన్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. దేశవాళీ క్రికెట్‌లో అద్బుతంగా రాణించిన నలుగురు ప్లేయర్లును ఈ జట్టులోకి పాక్ సెలక్షన్ కమిటీ చేర్చింది. ఆల్‌రౌండర్ ఆమిర్ జమాల్‌తో పాటు అలీ షబ్బీర్, మహ్మద్ తయాబ్, సకీబ్ ఖాన్‌లకు సెలక్టర్లు పిలుపునిచ్చారు. జమాల్ మినహా మిగితా ముగ్గురు ఇంకా పాక్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయలేదు. ఈ క్రమంలో తొలుత ఎంపికైన అబ్దుల్ ఫజల్, అలీ ఉస్మాన్ తమ స్ధానాలను కోల్పోయారు.
అమీర్ జమాల్ ఇప్పటికే పాక్ తరపున 9 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతడు తన ఫామ్‌ను కోల్పోవడంతో జట్టు నుంచి పక్కన పెట్టారు. కానీ ఇటీవల ప్రెసిడెంట్స్ ట్రోఫీ గ్రేడ్-I ఫైనల్లో మార్ఖోర్ ఐటీ సొల్యూషన్స్ జట్టు తరపున అతడు సంచలన ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో కేవలం 32 పరుగులిచ్చి 7 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 55 పరుగులు చేశాడు. ముహమ్మద్ తయ్యబ్ ఆరిఫ్ కూడా డొమాస్టిక్ క్రికెట్‌లో దుమ్మురేపాడు.
డిపార్ట్‌మెంటల్ ఫస్ట్-క్లాస్ టోర్నీలో కింగ్స్‌మెన్ అకాడమీకి ప్రాతినిధ్యం వహించిన తయ్యబ్.. 7 మ్యాచ్‌ల్లో 66.09 సగటుతో 727 పరుగులు సాధించి తొలిసారి పిలుపు అందుకున్నాడు. మరోవైపు 19 ఏళ్ల అలీ షబ్బీర్ తన ఫాస్ట్ బౌలింగ్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 22 వికెట్లు పడగొట్టి జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. కాగా పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ నవంబర్ 9 నుంచి రావల్పిండిలో జరగనుంది.
పాక్ అప్‌డేటడ్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అమీర్ జమాల్, అలీ షబ్బీర్, అరాఫత్ మిన్హాస్, అజాన్ అవాయిస్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ ఘాజీ ఘోరీ (వికెట్), మహ్మద్ సులేమాన్, మహ్మద్ తాహా, ముహమ్మద్ తయ్యబ్ ఆరిఫ్, రజావుల్లా, సాద్ బేగ్ , సామీబ్ ఖాన్, సామీబ్ ఖాన్, సమీబ్ ఖాన్, సమీబ్ ఖాన్, సమీబ్ ఖాన్.


