Photo Credit: Twitter
న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే కివీస్ పిచ్‌లపై అక్షర్ పటేల్ పూర్తిగా తేలిపోతున్నాడు. తొలి వన్డేలో డకౌట్ అయిన అక్షర్ పటేల్ రెండో వన్డేలోనూ 7 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు.
దీంతో అక్షర్ పటేల్‌పై విమర్శలు వస్తున్నాయి. వన్డేల్లో భారత్ తరఫున ఐదో స్థానంలో రెగ్యులర్‌గా బ్యాటింగ్‌కు వచ్చే కేఎల్ రాహుల్‌ను కాదని, అక్షర్ పటేల్‌కు ప్రమోషన్ ఇచ్చి బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపడంపై భారత మాజీ క్రికెటర్ దొడ్డ గణేశ్ తప్పుబట్టాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘అక్షర్ పటేల్ వన్డేల్లో ఐదో స్థానంలో స్వదేశంలో బ్యాటింగ్ చేయగలడు. కానీ సేనా దేశాల్లో (SENA-సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) బ్యాటింగ్ చేయలేడు. ఐదో స్థానానికి అక్షర్ అన్‌ఫిట్. అతడు అప్పుడప్పుడు మెరవగలడే తప్ప సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడలేడు. వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతుండడంతో ఇప్పటికైనా ప్రయోగాలకు సెలవిచ్చి కేఎల్ రాహుల్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపితే బాగుంటుంది’’ అని అభిప్రాయపడ్డాడు.
అక్షర్ హిట్.. రాహుల్ సూపర్‌హిట్
ఇక టీమిండియా తరఫున వన్డే క్రికెట్‌లో అక్షర్ పటేల్ ఐదో స్థానంలో 13 సార్లు బ్యాటింగ్‌కు వచ్చి హిట్‌గా మాత్రమే నిలిచాడు. అతను 87.11 స్ట్రైక్ రేట్‌తో, 30.41 సగటుతో 365 పరుగులు చేశాడు. ఇందులో గంభీర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే 11సార్లు అక్షర్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు.
మరోవైపు, కేఎల్ రాహుల్ మాత్రం ఐదో స్థానంలో సూపర్ హిట్ అయ్యాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్ నాలుగు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేయడంతో పాటు 68.58 సగటుతో 1646 పరుగులు సాధించాడు. అయితే, గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాహుల్ వన్డేల్లో ఎక్కువగా ఆరో స్థానంలోనే బ్యాటింగ్‌కు వస్తున్నాడు. రాహుల్ గత 17 ఇన్నింగ్స్‌లలో 37.10 సగటుతో 371 పరుగులు చేశాడు.
I say it again: Axar Patel can’t be your no 5 in SENA countries. He could play a cameo here and there but he’s definitely not a long term solution. You are denying KL Rahul the game time #NZvIND
— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) November 7, 2026
ఇదీ చదవండి:


