PC: BCCI/ipl
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును బరోడా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఎంపికయ్యాడు. అతడి డిప్యూటీగా అతీత్ షేత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కృనాల్ పాండ్యా బరోడా జట్టుకు నాయకత్వం వహించడం ఇది నాలుగోసారి.
కానీ ఈ ఐపీఎల్ స్టార్ బరోడాకు ఇప్పటివరకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించలేకపోయాడు. 2023లో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లినప్పటికీ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఓవరాల్‌గా మాత్రం బరోడా రెండుసార్లు (2011, 2013) ఈ టీ20 ట్రోఫీని గెలుచుకుంది.
ఇక ఈ 15 మంది సభ్యుల జట్టులో సీనియర్ ఆటగాళ్లు దీపక్ హుడా, జీతేష్ శర్మలతో పాటు పేసర్ రసిక్ దార్ కూడా చోటు దక్కింది. ప్రియాన్షు మోలియా, చింతల్ గాంధీని స్టాంబ్ బై ప్లేయర్లగా ఎంపిక చేశారు. అయితే వెన్ను గాయంతో బాధపడుతున్న హార్దిక్‌కు చోటు దక్కలేదు. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 19వ ఎడిషన్ నవంబర్ 14 నుంచి ప్రారంభం కానుంది. బరోడా జట్టు తన తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో తలపడనుంది.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 కోసం బరోడా జట్టు
కృనాల్ పాండ్యా (కెప్టెన్), అతీత్ షేత్ (వైస్ కెప్టెన్), దీపక్ హుడా, శివాలిక్ శర్మ, శాశ్వత్ రావత్, అమిత్ పాస్సీ (వికెట్ కీపర్), జీతేష్ శర్మ (వికెట్ కీపర్), భాను పానియా, మహేష్ పిథియా, పరిక్షిత్ పటీదార్, హేమంత్ పుండే, రాజ్ లింబానీ, రసిక్ దార్, ధ్రువ్ బి. పటేల్, సఫ్వాన్ పటేల్.
స్టాండ్‌బై ఆటగాళ్లు: ప్రియాన్షు మోలియా, చింతల్ గాంధీ.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా పేసర్.. 23 ఏళ్ల జహీర్ ఖాన్ రికార్డ్ బ్రేక్


