చ‌రిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్‌.. గావ‌స్క‌ర్‌, కోహ్లి స‌ర‌స‌న! | Brian-Bennet-1st-Test Century-Zimbabwe-Captain Vs AFG-Joins Elite List | Sakshi
Sakshi News home page

చ‌రిత్ర సృష్టించిన జింబాబ్వే కెప్టెన్‌.. గావ‌స్క‌ర్‌, కోహ్లి స‌ర‌స‌న!

Nov 6 2026 1:38 PM | Updated on Nov 6 2026 2:14 PM

Brian-Bennet-1st-Test Century-Zimbabwe-Captain Vs AFG-Joins Elite List

Photo Credit: Twitter

అఫ్గానిస్తాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే బ్యాట‌ర్లు శ‌త‌కాల‌తో చెల‌రేగుతున్నారు. ఇప్ప‌టికే బ్రెండ‌న్ టేల‌ర్ (168 బంతుల్లో 131) సెంచ‌రీ చేయ‌గా, తాజాగా కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ కూడా అజేయ శ‌త‌కంతో చెల‌రేగాడు. త‌ద్వారా జింబాబ్వే 400 ప‌రుగుల మార్క్‌ను దాటి భారీ స్కోరు దిశ‌గా ప‌రిగెడుతోంది. 105 ఓవర్లు ముగిసేస‌రికి జింబాబ్వే 6 వికెట్ల న‌ష్టానికి 407 ప‌రుగులు చేసింది. క్రీజులో బ్రియాన్ బెన్నెట్ (115 బ్యాటింగ్‌), తఫాద్జ్వా త్సిగా (7) ఉన్నారు. 

అంత‌క‌ముందు వెస్లే మ‌దెవెరె (54) అర్థ‌శ‌త‌కం సాధించాడు. బ్రియాన్ బెన్నెట్‌, మదెవెరె క‌లిసి ఆరో వికెట్‌కు 94 ప‌రుగులు జోడించి జింబాబ్వే స్కోరు పెర‌గ‌డంలో కీల‌క‌పాత్ర పోషించారు.  ఈ నేప‌థ్యంలో కెప్టెన్‌గా టెస్టుల్లో తొలి సెంచ‌రీ సాధించిన బ్రియాన్ బెన్నెట్‌కు ఓవ‌రాల్‌గా టెస్టుల్లో ఇది మూడో శ‌త‌కం. 

వ‌న్డే, టీ20ల్లోనూ బ్రియాన్ బెన్నెట్ ఖాతాలో ఒక్కో సెంచ‌రీ ఉండ‌డం విశేషం. అఫ్గానిస్తాన్ బౌల‌ర్ల‌లో జియా ఉర్ అక్బ‌ర్‌ రెండు వికెట్లు తీయ‌గా, మొహ‌మ్మ‌ద్ స‌లీమ్‌, జియావుర్ రెహ్మాన్‌, ఖ‌యాస్ అహ్మ‌ద్‌, హ‌ష్మ‌తుల్లా త‌లా ఒక వికెట్ ప‌డ‌గొట్టారు.


Photo Credit: Twitter

గావ‌స్క‌ర్‌, కోహ్లి స‌ర‌స‌న..
టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ బాదిన ఆట‌గాళ్ల జాబితాలో బ్రియాన్ బెన్నెట్ చోటు సంపాదించాడు. ఇప్ప‌టివ‌ర‌కు 35 మంది ప్లేయ‌ర్లు ఈ రికార్డు సాధించారు. కోహ్లి, విజ‌య్ హ‌జారే, గావ‌స్క‌ర్‌, గిల్ వంటి దిగ్గ‌జాల స‌ర‌స‌న బ్రియాన్ బెన్నెట్ నిలిచాడు.

ఇందులో కోహ్లి, గ్రెగ్ చాపెల్ మాత్రం డెబ్యూ కెప్టెన్‌గా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచ‌రీలు బాదిన క్రికెట‌ర్లుగా రికార్డుల‌కెక్కారు. అయితే జింబాబ్వే త‌ర‌ఫున కెప్టెన్‌గా డెబ్యూ సెంచ‌రీ బాదిన నాలుగో ప్లేయ‌ర్‌గా బ్రియాన్ బెన్నెట్ నిలిచాడు. గ‌తంలో 1992లో డీఎల్ హూగ్‌ట‌న్ (121 ప‌రుగులు వ‌ర్సెస్ టీమిండియా), 2011లో బ్రెండ‌న్ టేల‌ర్ (105 నాటౌట్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్‌), 2020లో బంగ్లాదేశ్‌తో టెస్టులో క్రెయిగ్ ఎర్విన్ (107) సెంచ‌రీలు బాదారు.

ఇదీ చదవండి: విండీస్‌తో టెస్టు.. బొక్కబోర్లా పడిన బంగ్లా బౌలర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement