PC: BCB X
బంగ్లాదేశ్ యువ బ్యాటర్ తౌహీద్ హృదోయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో ఇంతవరకు బంగ్లా క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రికార్డు సాధించాడు. రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది.
356 పరుగులు చేసి ఆలౌట్
ఇందులో భాగంగా ఢాకా వేదికగా తొలి టెస్టులో విండీస్ జట్టు ఆతిథ్య బంగ్లాను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం రెండో టెస్టు మొదలైంది. సైలెట్ వేదికగా టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఆమిర్ జాంగో శతక్కొట్టగా
వికెట్ కీపర్ బ్యాటర్ ఆమిర్ జాంగో శతక్కొట్టగా (133).. కెవిన్ విక్‌హామ్ (61), జస్టిన్ గ్రీవ్స్ (51) అర్ధ శతకాలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ ఆరు వికెట్లతో చెలరేగగా.. టస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
బంగ్లాదేశ్‌ను ఆదుకున్న హృదోయ్
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ 386 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నాలుగో స్థానంలో వచ్చిన తౌహీద్ హృదోయ్ అజేయ డబుల్ సెంచరీ కారణంగానే బంగ్లాకు ఈ స్కోరు సాధ్యమైంది. మొత్తంగా 359 బంతులు ఎదుర్కొన్న హృదోయ్.. 22 ఫోర్లు, 11 సిక్సర్లు బాది 242 పరుగులతో అజేయంగా నిలిచాడు.
మిగిలిన వారిలో సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం మాత్రమే చెప్పుకోగదగిన స్కోరు (34) చేశాడు. హృదోయ్ ఇన్నింగ్స్ కారణంగా బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించగలిగింది.
ఇదిలా ఉంటే.. విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా హృదోయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు (242 నాటౌట్) సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.
బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్లు
తౌహీద్ హృదోయ్- 2026లో వెస్టిండీస్‌పై సెలైట్ వేదికగా 242*
ముష్ఫికర్ రహీం- 2018లో జింబాబ్వేపై మిర్పూర్ వేదికగా 219*
షకీబ్ అల్ హసన్- 2017లో న్యూజిలాండ్‌పై వెల్లింగ్‌టన్ వేదికగా 217
తమీమ్ ఇక్బాల్- 2015లో పాకిస్తాన్‌పై ఖుల్నా వేదికగా 206
ముష్ఫికర్ రహీం- 2020లో జింబాబ్వేపై మిర్పూర్ వేదికగా 203*
ముష్ఫికర్ రహీం- 2013లో శ్రీలంకపై గాలె వేదికగా 200.
ఇవీ చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా పేసర్.. 23 ఏళ్ల జహీర్ ఖాన్ రికార్డ్ బ్రేక్
Power and precision on full display! Relive the massive sixes from Tawhid Hridoy's magnificent double-century innings against West Indies. https://t.co/PuyI4bMbhW
— Bangladesh Cricket (@BCBtigers) November 7, 2026


