స్టార్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచ్చర్‌పై మైదానం బ‌య‌ట‌కు! | Bangladeshs Shadman Islam carried off on stretcher after horrific ankle injury | Sakshi
Sakshi News home page

BAN vs WI: స్టార్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచ్చర్‌పై మైదానం బ‌య‌ట‌కు!

Nov 6 2026 2:51 PM | Updated on Nov 6 2026 3:29 PM

Bangladeshs Shadman Islam carried off on stretcher after horrific ankle injury

సిల్హెట్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ రెండో రోజు ఆటలో భాగంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి ఎడమ కాలి మడమ మడతపడటంతో (యాంకిల్ ట్విస్ట్) తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు. కనీసం నడవలేని పరిస్థితి నెలకొనడంతో వైద్య సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తీసుకువెళ్లారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్ 78వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. 

ఏమి జరిగిందంటే?
మెహిదీ హసన్ మిరాజ్ వేసిన బంతిని విండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్ షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. బంతిని ఆపేందుకు వేగంగా పరుగెత్తిన షాద్మాన్ ఇస్లామ్ యాంకిల్ ట్విస్ట్ కావ‌డంతో అత‌డు కింద ప‌డిపోయాడు. వెంటనే స్పందించిన బంగ్లాదేశ్ ఫిజియో మైదానంలోనే ప్రథమ చికిత్స అందించినప్పటికీ నొప్పి తీవ్రత తగ్గలేదు. కాలు కదిపేందుకు కూడా ఇబ్బంది పడుతుండటంతో ఫిజియో సాయంతో స్ట్రెచర్‌పై మైదానం బయటకు తరలించారు.

నయీమ్ హసన్‌కు ఓపెనింగ్ బాధ్యతలు
అతడి గాయం తీవ్రత తెలుసుకునేందుకు వెంటనే ఆసుపత్రికి తరలించి స్కాన్లు నిర్వహించనున్నారు. స్కాన్ రిపోర్టులు వచ్చిన తర్వాతే షాద్మాన్ గాయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. షాద్మాన్ ఇస్లామ్ గాయం కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగలేకపోవడంతో, అతడి స్థానంలో నయీమ్ హసన్ ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement