చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ పేసర్‌ | Record-breaking Hasan Mahmud savours a special milestone | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ పేసర్‌

Nov 6 2026 8:26 PM | Updated on Nov 6 2026 8:52 PM

Record-breaking Hasan Mahmud savours a special milestone

సిల్హెట్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ పేస‌ర్ హ‌స‌న్ మ‌హ‌మూద్ నిప్పులు చెరిగాడు. 27 ఏళ్ల హసన్‌ మ‌హ‌మూద్ తన సంచలన బౌలింగ్‌తో బంగ్లా టాపార్డర్‌ను దెబ్బతీశాడు.మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో హసన్‌ 6 వికెట్లతో సత్తాచాటాడు.

ఈ క్రమం‍లో అతడు ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో అత్యధికసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ నమోదు చేసిన తొలి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్‌గా హసన్ చరిత్ర సృష్టించాడు. హసన్ టెస్టు కెరీర్‌లో ఇది ఐదో ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. 

ఇంతకుముందు ఈ రికార్డు మాజీ పేసర్ షాహాదత్ హొసేన్ పేరిట ఉండేది. అతడు నాలుగు సార్లు టెస్టుల్లో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో అతడి ఆల్‌టైమ్ రికార్డును హసన్ బ్రేక్ చేశాడు. కాగా హసన్ మహమూద్‌ స్వదేశంలో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది. విండీస్ అమీర్ జంగూ (133) భారీ సెంచరీతో కదం తొక్కగా.. కెవిన్ విక్‌హామ్(61) హాఫ్‌ సెంచరీ రాణించాడు. బంగ్లా బౌలర్లలో హసన్‌తో పాటు టాస్కిన్‌ అహ్మద్‌, మెహాది హసన్‌ మిరాజ్‌ తలా రెండు వికెట్లు చొప్పున పడగొట్టారు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా దేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో తౌహిద్ హ్రిదోయ్(29), ముష్ఫికర్ రహీమ్(19) ఉన్నారు.
చదవండి: అఫ్గాన్‌ బౌలర్లకు చుక్కలు.. జింబాబ్వే 504 పరుగుల భారీ స్కోర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement