ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, 'మిస్టర్ క్రికెట్'గా పేరుగాంచిన మైఖేల్ హస్సీకి క్రికెట్ ఆస్ట్రేలియా కీలక బాధ్యతలు అప్పగించింది. జట్టు కన్సల్టెంట్ కోచ్‌తో పాటు T20 సలహాదారుడిగా ఆయనను నియమిస్తున్నట్లు బోర్డు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది.
వచ్చే ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్, వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నుంచి మైక్ హస్సీ తన నూతన బాధ్యతలను స్వీకరించనున్నాడు.
ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా 1-2 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హస్సీని కోచింగ్ సెటప్‌లోకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు సహకారంగా హస్సీ కోచింగ్ సేవలందించనున్నాడు.
తన నియామకంపై మైక్ హస్సీ సంతోషం వ్యక్తం చేస్తూ .. "ఆస్ట్రేలియా జట్టులో కీలకమైన పాత్ర పోషించబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇటీవలి కాలంలో మా జట్టు అద్భుతమైన విజయాలు సాధించింది. రాబోయే సవాళ్లతో కూడిన సిరీస్‌లలో ఆటగాళ్లకు, కోచింగ్ సిబ్బందికి నా వంతు సహాయపడతానని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
కాగా హస్సీ మొన్నటివరకు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్‌గా సేవలిందించాడు. అయితే ఐపీఎల్-2027కు ముందు తన బాధ్యతలను నుంచి హస్సీ తప్పుకొన్నాడు. ఇదే సమయంలో హస్సీకి ఇంగ్లండ్ టెస్టు కోచింగ్ బృందంలో చేరాలని హెడ్ కోచ్ స్టీపెన్ ఫ్లెమింగ్ నుండి ఆఫర్ వచ్చింది. కానీ ఆస్ట్రేలియా క్రికెట్‌కే సేవలు అందించాలనే ఉద్దేశంతో హస్సీ దానిని తిరస్కరించాడు.
చదవండి: మీ అమ్మ చచ్చిపోతుంది!.. వాళ్లంతా మూర్ఖులు, టాక్సిక్!


