ప్రధాని మోదీతో సూర్య కుటుంబం.. కూతురి ఫేస్‌ రివీల్‌ | PM Modi Meets Indian Ex T20I Captain Suryakumar His Daughter Pic viral | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో సూర్య కుటుంబం.. కూతురి ఫేస్‌ రివీల్‌

Nov 6 2026 4:43 PM | Updated on Nov 6 2026 5:03 PM

PM Modi Meets Indian Ex T20I Captain Suryakumar His Daughter Pic viral

ప్రధాని మోదీతో సూర్య కుటుంబం (PC: X)

టీమిండియా మాజీ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశాడు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబంతో కలిసి ఈ ముంబైకర్‌ ఢిల్లీకి వెళ్లి పీఎం మోదీతో భేటీ అయ్యాడు.

రిద్ధిమ ఫేస్‌ రివీల్‌
ఈ సందర్భంగా ప్రధాని మోదీ సూర్య కుటుంబానికి చెందిన చిన్నారులతో సరదాగా సమయం గడిపారు. అంతేకాదు.. సూర్య-దేవిశాల చిన్నారి కూతురు రిద్ధిమను ఎత్తుకుని ముద్దుచేశారు. ఈ సందర్భంగా రిద్ధిమ ఫేస్‌ తొలిసారి రివీల్‌ చేసినట్లయింది.

ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘దీపావళితో పాటు రామ్‌, సరయూ కూడా వచ్చేశారు. ఈ దీపావళి ఈసారి వాతావరణాన్ని మరింత పవిత్రంగా, దైవికంగా మార్చింది’’ అని మోదీ పేర్కొన్నారు. ఇక మోదీతో సూర్య కుటుంబం ఆహ్లాదంగా గడిపిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

విజయవంతమైన కెప్టెన్‌
కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రోహిత్‌ శర్మ.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీ20 జట్టు పగ్గాలు చేపట్టిన సూర్య.. అద్భుత విజయాలు అందించాడు. అతడి సారథ్యంలో టీమిండియా ఒక్క ద్వైపాక్షిక సిరీస్‌ కూడా ఓడిపోలేదు.

అంతేకాదు.. 2025లో ఆసియా టీ20 కప్‌ అందించిన సూర్య.. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. అయితే, ఒకప్పుడు ఐసీసీ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా వెలుగొందిన సూర్య.. కెప్టెన్‌ అయిన తర్వాత వ్యక్తిగత ప్రదర్శనలో వైఫల్యాలతో విమర్శల పాలయ్యాడు.

అనూహ్య రీతిలో వేటు
ఈ క్రమంలో వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత టీమిండియా ఆడిన మరుసటి సిరీస్‌ నుంచే సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. జట్టులోనూ అతడికి స్థానం లేకుండా చేసింది. ప్రస్తుతం దేశీ క్రికెట్‌పై దృష్టి సారించాడు. 

పదేళ్ల కలల పంట
ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీని కలిసిన సందర్భంగా టీ20 ప్రపంచకప్‌-2026 మెడల్‌ను ఆయనకు చూపించి మురిసిపోయాడు సూర్య. క దేవిశాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సూర్య. వీరికి వివాహమైన దాదాపు పదేళ్ల తర్వాత తొలి సంతానంగా.. ఈ ఏడాది మే 7న కుమార్తె రిద్ధిమ జన్మించింది.  

ఇదీ చదవండి: Asia Cup: సెహ్వాగ్‌ ధనాధన్‌, లక్ష్య మెరుపులు.. బోణీ కొట్టిన భారత్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement