breaking news
devisha shetty
-
ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారా?: సూర్య భార్య పోస్ట్ వైరల్
ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమంపై టీమిండియా స్టార్లు ఇంతవరకు స్పందించలేదు. అయితే, భారత టీ20 జట్టు మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి, టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ మాత్రం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.దేవిశా, సంజనా వైఖరి పట్ల నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కాగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు మరింత ఉధృతం చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేపట్టిన ‘చలో సంసద్’ ర్యాలీ హింసాత్మకంగా మారింది. విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సంజన ఇలా...ఈ నేపథ్యంలో సంజనా గణేషన్ స్పందిస్తూ.. ‘‘నిరసనకు దూరంగా ఉన్న ఆరేళ్ల పసి ప్రాణానికి టియర్ గ్యాస్ వల్ల ఇబ్బంది కలిగినప్పుడు.. ఎవరికైనా సరే ఇది ఇబ్బందిని కలిగిస్తుంది కదా!..చిన్నారులు టియర్ గ్యాస్ బారిన పడటాన్ని ప్రజాస్వామ్యంలో సాధారణ విషయంగా మార్చకండి. తమను రక్షించడం కోసమని రక్షణ పేరుతో భయపెట్టడాన్ని ఏ పౌరుడు కూడా కోరుకోడు’’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంజనకు పలువురు నెటిజన్లు మద్దతుగా నిలుస్తూ పోలీసుల వైఖరిని ప్రశ్నిస్తున్నారు.పోరాటాలు చేయండి అంటూనే...ఇక దేవిశా శెట్టి మాత్రం మరింత తీవ్రంగా, కాస్త భిన్నంగా స్పందించింది. ‘‘ఇది స్పాన్సర్ చేసిందే అనుకోండి. రాజకీయ ఉద్దేశాలు ఉన్న పోస్టు అనుకోండి. మీరు దీనికి ఏ పేరు పెట్టినా నిజం మాత్రం మారదు. భారతీయ యువత అగ్నిపంథాను ఎంచుకుంది. సవాళ్లకు ఎదురు నిల్చుంది.పోలీసులు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చక్కదిద్దాలి. ప్రభుత్వం కూడా వారి సమస్యకు గల కారణం ఏమిటో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రభుత్వాన్ని విమర్శించండి. ప్రధానిని ప్రశ్నించండి.రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తండి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉద్యమాలు నడపండి. ఓటుతో సమాధానం చెప్పండి. దానినే ప్రజాస్వామ్యం అంటారు. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ప్రభుత్వ ఆస్తులు కావు.ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తారా?మీరు ధ్వంసం చేసిన ప్రతీ బస్సు, విరగొట్టిన ప్రతీ బారికేడ్, తగలబెట్టిన ప్రతీ వాహనం, మీరు నాశనం చేసిన రోడ్డు.. ఇలా ప్రతీదీ భారత పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన డబ్బు ద్వారా నిర్మితమైనవి. ఇందులో మీరు కూడా ఉంటారు.ఏదేమైనా హింస అనేది ఎప్పుడూ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మీరు రాళ్లు విసిరినపుడు, పోలీసులపై దాడి చేసినపుడు.. బారికేడ్లను తోసుకుని వెళ్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉంటే దీనిని ఎవరూ నిరసన అనరు. మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నారు’’ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు దేవిశాను విమర్శిస్తున్నారు.ఆస్తుల కంటే ప్రాణాలు విలువైనవి కాదా?‘ఓవైపు విద్యార్థులు ప్రాణాలకు తెగించి న్యాయం కోసం పోరాడుతుంటే.. మీరేమో మీ భర్తను తిరిగి టీమిండియాలోకి చేర్చాలనే ఉద్దేశంతో రాజ్యానికి వంతపాడుతున్నారు. మీరన్నది నిజమే. ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరిచే హక్కు ఎవరికీ లేదు.మరి ఆస్తుల కంటే ప్రాణాలు మరింత విలువైనవి కదా! పేపర్ లీకేజీ వ్యవహారంతో బలవన్మరణాలకు పాల్పడిన విద్యార్థులకు మద్దతుగా మీరు ఏనాడైనా రాజ్యాన్ని ప్రశ్నించారా? ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మన వరకూ వస్తేనే ఏదైనా అర్థమవుతుంది’ అని విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో దేవిశా సరిగ్గా చెప్పిందంటూ సమర్థిస్తున్నారు.చదవండి: వైఫల్యాలపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ -
సీమంతం ఫొటోలు షేర్ చేసిన దేవిశా శెట్టి (ఫొటోలు)
-
కంగ్రాట్స్ సూర్యా భాయ్.. తండ్రిగా ప్రమోషన్!
టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి భార్య దేవీషా షెట్టీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త తెలియడంతో, కుటుంబంతో సమయం గడిపేందుకు సూర్య జట్టుకు దూరమయ్యాడు. దీంతో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన కీలక మ్యాచ్‌కు అతడి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. బిడ్డ పుట్టిన కారణంగా, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి సూర్య ఈ వారం జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు ప్రయాణించలేదు. 2016లో వివాహం చేసుకున్న సూర్య-దేవీషా జంట, తమ కుమార్తె రాకతో ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సూర్యకుమార్ దంపతులకు అభిమానులు కంగ్రాట్స్ తెలిపారు. ‘ కంగ్రాట్స్ సూర్యా భాయ్’ అని కామెంట్లు పెడుతున్నారు.సూర్య క్రికెట్ ప్రయాణంలో దేవీషా నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభ సందర్భంలో క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్సీ సమస్య వెంటాడుతోంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో గత మ్యాచ్‌లో (లక్నో సూపర్‌జెయింట్స్‌పై) సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడం, సూర్య కుటుంబ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ఆర్సీబీతో మ్యాచ్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశముంది. View this post on Instagram A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar) చదవండి: తొలి క్రికెటర్‌గా మిచెల్ మార్ష్! -
హ్యాట్సాఫ్: రోహిత్ భార్య రితికా అలా.. సూర్య సతీమణి దేవిశా ఇలా
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి (Devisha Shetty)ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత స్పిన్నర్ యజువేంద్ర చహల్ (Yuzuvendra Chahal) మాజీ భార్య ధనశ్రీ వర్మకు మద్దతు తెలుపుతూ ఓ షార్ట్ వీడియోను దేవిశా షేర్ చేసింది. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.ఈ ఏడాది విడాకులు మంజూరుఅసలేం జరిగిందంటే.. కొరియోగ్రాఫర్, నటి అయిన ధనశ్రీ వర్మను ప్రేమించిన చహల్ 2020లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే వైవాహిక బంధంలో పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో దాదాపు రెండేళ్లుగా దూరంగా ఉంటున్న ఈ జంటకు.. ఈ ఏడాది మార్చిలో అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి.చహల్ స్పందన ఇదిఈ విషయం గురించి చహల్ స్పందిస్తూ.. తన జీవిత భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించినా.. విడిపోక తప్పలేదంటూ ధనశ్రీని పరోక్షంగా విమర్శించాడు. ఇక విడాకులకు ముందే ఆర్జే మహ్వశ్తో కలిసి ట్రిప్పులకు వెళ్లిన చహల్.. ఆమె తనకు స్నేహితురాలు మాత్రమేనని.. తమ మధ్య ప్రేమ లేదని చెప్పాడు.ఇదిలా ఉంటే.. బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల తీర్పు కోసం వెళ్లిన సమయంలో చహల్.. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే కొటేషన్ ఉన్న కస్టమైజ్డ్ టీ షర్టు వేసుకున్నాడు. దీనర్థం.. ‘ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి.. మీ బాగోగులు మీరే చూసుకోండి.. ఆర్థిక సాయం, బహుమతుల కోసం ఇతరులపై ఆధారపడకండి’. దీనిని బట్టి ధనశ్రీ భరణం అడుగుతున్న కారణంగానే చహల్ ఇలా చేశాడని నెటిజన్లు కామెంట్లు చేశారు.‘గోల్డ్ డిగ్గర్’ పోస్టుకు లైక్ కొట్టిన రితికామరోవైపు.. చహల్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న ఆర్జే మహ్వశ్ సైతం.. ధనశ్రీని నిందించేలా ఆర్థిక స్వాతంత్ర్యం గురించి అదే సమయంలో పోస్ట్ పెట్టింది. ఇంకోవైపు.. జర్నలిస్టు శుభంకర్ మిశ్రా ధనశ్రీని ‘గోల్డ్ డిగ్గర్ (డబ్బు కోసం సంబంధం పెట్టుకునే మహిళ)’ అంటూ అసభ్యకర రీతిలో విమర్శించాడు.ఇందుకు.. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే లైక్ కొట్టి.. పరోక్షంగా ధనశ్రీపై ఆ జర్నలిస్టులాగే నిందలు వేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధనశ్రీ వర్మ తన విడాకుల గురించి తొలిసారిగా మాట్లాడింది.గట్టిగా ఏడ్చేశాతన జీవిత భాగస్వామి కోసం చేయాల్సినవన్నీ చేశానని.. అయితే, అతడే ముందుగా వైవాహిక బంధం నుంచి వైదొలిగాడని ధనశ్రీ తెలిపింది. అంతేకాదు.. తనపై నిందలు మోపేలా చహల్ అలాంటి టీ షర్టు ధరిస్తాడని ముందుగానే తనకు తెలుసునంది. తన పార్ట్నర్ను ఎంతో ప్రేమించానని.. అందుకే విడాకుల తీర్పు వినగానే కోర్టులోనే గట్టిగా ఏడ్చేశానంటూ ఆవేదనను పంచుకుంది.విడాకుల నేపథ్యంలో తనపై విపరీతమైన నెగటివిటీ వచ్చిందని.. అయితే, తన తల్లిదండ్రుల కోసం స్ట్రాంగ్‌గా ఉన్నట్లు నటిస్తున్నానని ధనశ్రీ చెప్పుకొచ్చింది. సున్నితమైన ఈ అంశంలో తన గోప్యతకు భంగం కలిగించేలా ఎంతో మంది ఎన్నో విధాలుగా పిచ్చి కూతలు కూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అత్యంత గౌరవం, ప్రేమ.. హ్యాట్సాఫ్ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసిన దేవిశా శెట్టి.. ‘‘నీ పట్ల అత్యంత గౌరవం, ప్రేమ ఉన్నాయి’’ అంటూ ధనశ్రీ వర్మకు మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో ధనశ్రీ పట్ల టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌ల సతీమణులు.. రితికా సజ్దే, దేవిశా శెట్టి వైఖరిని పోలుస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తొలుత తప్పంతా ధనశ్రీ వర్మదే అని భావించినా.. కొత్త మహిళ రాక (మహ్వశ్)తో అంతా అర్థమైపోయిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తుండగా.. మరి కొందరు మాత్రం ఎప్పటిలాగే ధనశ్రీనే నిందిస్తున్నారు.ఇదిలా ఉంటే.. సూర్యకుమార్ యాదవ్ తదుపరి ఆసియా కప్-2025 టోర్నీతో బిజీ కానున్నాడు. మరోవైపు.. టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పిన రోహిత్ శర్మ వన్డే రీఎంట్రీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక చహల్ చాలా కాలంగా టీమిండియాకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: అక్కకు బెస్ట్ ఫ్రెండ్.. అర్జున్ టెండుల్కర్- సానియా చందోక్ ఏజ్ గ్యాప్ ఎంతంటే?


