కంగ్రాట్స్‌ సూర్యా భాయ్‌.. తండ్రిగా ‍ప్రమోషన్‌! | Suryakumar Yadav and wife Devisha Shetty welcome baby girl | Sakshi
Sakshi News home page

కంగ్రాట్స్‌ సూర్యా భాయ్‌.. తండ్రిగా ‍ప్రమోషన్‌!

May 7 2026 11:16 PM | Updated on May 7 2026 11:30 PM

Suryakumar Yadav and wife Devisha Shetty welcome baby girl

టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తండ్రయ్యాడు. అతడి భార్య దేవీషా షెట్టీ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో ఈ శుభవార్త తెలియడంతో, కుటుంబంతో సమయం గడిపేందుకు సూర్య జట్టుకు దూరమయ్యాడు. 

దీంతో మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగాల్సిన కీలక మ్యాచ్‌కు అతడి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. బిడ్డ పుట్టిన కారణంగా, కుటుంబ బాగోగులు చూసుకోవడానికి సూర్య ఈ వారం జట్టుతో కలిసి రాయ్‌పూర్‌కు ప్రయాణించలేదు. 2016లో వివాహం చేసుకున్న సూర్య-దేవీషా జంట, తమ కుమార్తె రాకతో ఆనందంలో మునిగిపోయారు.  ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో సూర్యకుమార్‌ దంపతులకు అభిమానులు కంగ్రాట్స్‌ తెలిపారు. ‘ కంగ్రాట్స్‌ సూర్యా భాయ్‌’ అని కామెంట్లు పెడుతున్నారు.

సూర్య క్రికెట్ ప్రయాణంలో దేవీషా నిరంతరం మద్దతుగా నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ శుభ సందర్భంలో క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ను కెప్టెన్సీ సమస్య వెంటాడుతోంది. 

రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటంతో గత మ్యాచ్‌లో (లక్నో సూపర్‌జెయింట్స్‌పై) సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు. హార్దిక్ ఇంకా కోలుకోకపోవడం, సూర్య కుటుంబ కారణాలతో అందుబాటులో లేకపోవడంతో ఆర్‌సీబీతో మ్యాచ్‌కు బుమ్రా స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశ‌ముంది.

 చదవండి: తొలి క్రికెట‌ర్‌గా మిచెల్ మార్ష్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement