ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. తద్వారా లక్నో తరఫున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన తొలి క్రికెటర్‌గా మిచెల్ మార్ష్ అరుదైన ఘనత సాధించాడు. రొమారియో షెపర్డ్ వేసిన యార్కర్ బంతిని బౌండరీ తరలించడం ద్వారా ఐపీఎల్‌లో రెండో సెంచరీ సాధించాడు.
49 బంతుల్లోనే సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. అయితే గతంలో లక్నో తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రిషబ్ పంత్ పేరిట ఉంది. గతేడాది ఇదే స్టేడియంలో ఆర్సీబీపైనే పంత్ 54 బంతుల్లో శతకం సాధించాడు. తాజాగా పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్ ఫాస్టెస్ట్ సెంచరీతో ఆ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఓవరాల్‌గా మార్ష్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో సెంచరీ. తొలి సెంచరీ కూడా లక్నో తరఫునే సాధించాడు. గతేడాది సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించిన మార్ష్ 64 బంతుల్లో 117 పరుగులు సాధించాడు. ఇక లక్నో తరఫున రెండు సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా మార్ష్ నిలిచాడు. గతంలో కేఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించాడు. డికాక్, స్టోయినిస్, పంత్‌లు తలా ఒక సెంచరీ బాదారు.
Crunched, clobbered, Celebrations 💯
🎥 Mitchell Marsh brings up a 𝘀𝗶𝘇𝘇𝗹𝗶𝗻𝗴 𝗰𝗲𝗻𝘁𝘂𝗿𝘆 in some style 🔥🫡
Updates ▶️ https://t.co/W0eDq9aWb7#TATAIPL | #KhelBindaas | #LSGvRCB | @LucknowIPL pic.twitter.com/xQxi3buH6j— IndianPremierLeague (@IPL) May 7, 2026
చదవండి: ‘రగులుతున్న అసంతృప్తి’.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు!


