మృత గ్రహమేమీ కాదట
శిలాద్రపు ఆనవాళ్లు వెలుగులోకి
జీవపు ఉనికిపైనా కొత్త ఆశలు
సైంటిస్టులు ఇంతకాలంగా భావిస్తున్నట్టుగా కుజ గ్రహం మృతప్రాయమేమీ కాదట! దానిలో వేడిమి ఛాయలింకా ఇంకిపోలేదట. మార్స్ గర్భంలో శిలాద్రవం (మాగ్మా) ఇంకా చురుగ్గానే ఉన్నట్టు తాజా పరిశోధన ఒకటి చెబుతోంది. దాని ఉపరితలం మీది అగ్నిపర్వతాలనే గాక, వాటి తాలూకు పగుళ్ల గుండా వేడి వాయువులు వెలువడటాన్ని అది గుర్తించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ), ఎక్సోమార్స్ ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ (టీజీఓ) సంయుక్తంగా జరిపిన ఈ పరిశోధన తేల్చింది. అగ్నిపర్వత కార్యకలాపాలకు అవసరమైన అంతర్గత వేడిమిని మార్స్ అట్టిపెట్టుకునే ఉన్నట్టు వెల్లడించింది. మార్స్ ఉపరితలం మీది అతి పెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటైన అల్బా మోన్స్ వద్ద అసాధారణ పరిమాణంలో హైడ్రోజన్ క్లోరైడ్ (హెచ్‌సీఓ) ఉన్నట్టు తేల్చింది.
మార్స్ వాతావరణంలో హెచ్‌సీఓ ఉనికిని ట్రేస్ గ్యాస్ ఆర్బిటార్ (టీజీఓ) 2021లో గుర్తించింది. ఇది భూమిపై సాధారణంగా అగ్నిపర్వతాల నుంచే వెలువడుతుంది. ఆ లెక్కన మార్స్‌పై కూడా అది అగ్నిపర్వతాల నుంచే వెలువడుతున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని పరిశోధన సారథి అలెగ్జాండర్ త్రొక్షిమోవ్‌స్కీ అభిప్రాయపడ్డారు. స్టీరియో సర్ఫేసింగ్ ఇమేజింగ్ సిస్టమ్ సాయంతో చేసిన అధ్యయనంలో అల్బా మోన్స్‌లో వందలాది మీటర్ల దాకా పొడవైన తాజా పగుళ్ల ఉనికి బయటపడింది. మార్స్ శిలాద్రవం తాలూకు వాయువులు వీటి గుండానే బయటికి పెల్లుబుకుతున్నట్టు అధ్యయన బృంద సహ సారథి డేనియల్ మెగె వెల్లడించారు. దీని వివరాలు జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమయ్యాయి.
Mars may not be geologically dead after all. 🔴 Our ExoMars Trace Gas Orbiter has detected hydrogen chloride above volcanic fissures in the Alba Mons region, which scientists suggest could be linked to dormant volcanic activity beneath the surface. Read more: https://t.co/VEJRtcff8V
— European Space Agency (@esa) November 5, 2026
ఇదీ చదవండి: ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశా : ఎన్‌ఆర్‌ఐ భర్త
అత్యధిక అగ్నిపర్వతాలు
సౌరవ్యవస్థలోకెల్లా అత్యంత భారీ అగ్నిపర్వతాలకు అంగారక (కుజ) గ్రహమే ఆలవాలం. వాటిలో పలు పర్వతాలు గత కొన్ని లక్షల ఏళ్ల క్రితం దాకా కూడా చురుగ్గానే ఉన్నట్టు పలు అధ్యయనాలు తేల్చాయి. శిలాద్రవపు ఉనికిని తాజా అధ్యయనం దాదాపుగా ధ్రువీకరించిన నేపథ్యంలో కుజునిపై జీవపు ఆనవాళ్ల విషయంలోనూ శాస్త్రవేత్తల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
ఇదీ చదవండి: రొనాల్డో రిటైర్‌మెంట్‌పై తొలి స్పందన.. భార్య భావోద్వేగం


