ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశా : ఎన్‌ఆర్‌ఐ భర్త | Indian Origin Man Chopped Wife Body In Pieces After Her Death By self-destruction | Sakshi
Sakshi News home page

ముక్కలుగా నరికి చెత్తబుట్టలో పడేశా : ఎన్‌ఆర్‌ఐ భర్త

Nov 6 2026 1:27 PM | Updated on Nov 6 2026 1:31 PM

Indian Origin Man Chopped Wife Body In Pieces After Her Death By self-destruction

భార్యను హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలోని వర్జీనియా కోర్టులో సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తన భార్య మరణించిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసినట్లు ఒప్పుకున్న ఘటన కలకలం రేపింది. ఆమె కనిపించకుండా పోయిన రెండేళ్ల తర్వాత, విచారణ ప్రారంభమైన ఐదు వారాలకు ఈ సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి.  

2024లో 28 ఏళ్ల మమతా కఫ్లే భట్ అదృశ్యమైంది.  చివరిసారిగా జూలై 29న  వీడియో కాల్‌లో కనిపించింది. ఆ తర్వాత కనిపించకుండా పోయిన మమత హత్య, మృతదేహాన్ని దాచిపెట్టడం లాంటి ఆరోపణ లెదుర్కొంటున్నాడు భర్త నరేష్ భట్. అయితే ఈ ఆరోపణలను తొలుత అంగీకరించలేదు, తన భార్య మమతా కఫ్లే భట్ ఆత్మహత్య చేసుకుందని అందర్నీ నమ్మించాడు. చివరికి కోర్టు విచారణలో  భార్య మృతదేహాన్ని ముక్కలు చేసి మాయం చేశానని కోర్టులో అంగీకరించాడు.  

ఇదీ చదవండి : దారుణం : భార్యను కుర్చీకి కట్టేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు!
 

కోర్టులో సాక్ష్యం
మమత 2024 ఆగస్టు 5న విధులకు హాజరు కాకపోవడంతో అనుమానాలు మొదలైనాయి.  ఆ తర్వాత భర్త్‌ నరేష్‌  మిస్సింగ్ కేసు నమోదు చేశాడు.ఈ విచారణలో భాగంగా వారి ఇంటి బెడ్‌రూమ్, బాత్రూమ్‌లలో రక్తం మరకలను గుర్తించిన పోలీసులు, ఆగస్టు 22న అతడిని అరెస్ట్ చేశారు. తనిఖీల్లో వెండ్రుకలున్న పవర్ రంపాన్ని  కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోర్టులో నరేష్‌ సాక్ష్యం ప్రకారం జూలై 29న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో తన చిన్నారి కూతురితో కలిసి నిద్రపోవడానికి వెళ్లానని, అయితే తన భార్య పైకి రాలేదని చెప్పారు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు టాయిలెట్‌కు వెళ్లేందుకు లేవగా, మంచం కింద మమత వెల్లకిలా పడి ఉండి, చుట్టూ వాంతులున్నాయని తెలిపాడు. ఆమె పక్కనే 'సెల్ఫోస్' (Celphos - అత్యంత విషపూరితమైన పురుగుల మందు) ప్యాకెట్ పడి ఉందన్నారు. ఈ సమయంలో ఆమెను కాపాడేందుకు సీపీఆర్ (CPR) చేసి ప్రయత్నించానని, ఇక ఆమె మరణించిందని నిర్ధారించుకున్నాక బాత్రూమ్‌లోకి తీసుకెళ్లానని భట్ వాంగ్మూలంలో పేర్కొన్నాడు.  మొదట మృతదేహాన్ని పోటోమాక్ నదిలో పడేయాలని భావించాననీ, ఆ తరువాత శవాన్ని దాచడానికి ఏదైనా దొరుకుతుందేమోనని 'హోమ్ డిపో'కి వెళ్లినట్లు తెలిపాడు.  చెత్తబుట్టలో ఆమె  బాడీ సరిపోదని భావించి, రంపం సాయంతో మృతదేహాన్ని  ముక్కలు ముక్కలుగా నరికి, ఆపై వాటిని ప్లాస్టిక్ కవర్లలో ఉంచి చెత్తలో పడేసానని తెలిపాడు. 

ఇదీ చదవండి: పండగవేళ పతంజలికి భారీ షాక్‌ : తుకారం ముండే దెబ్బ

అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాననీ, ఉరివేసుకునేందుకు కేబుల్స్ తెచ్చుకున్న ప్పటికీ, ఆ పని చేయలేకపోయానని అన్నాడు. మరి అంతటి క్లిష్ట పరిస్థితిలో  పోలీసులకు (911) ఎందుకు ఫోన్ చేయలేదని అడిగినపుడు. ఫోన్ చేయడానికి ప్రయత్నించాను, కానీ  భయందోళనకు గురయ్యాను. ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదంటూ చెప్పుకొచ్చాడు.

అయితే హత్య కేసులో  భట్‌కు జీవిత ఖైదు పడుడుతంది. ఇక మృతదేహాన్ని దాచిపెట్టడం లాంటి ఆరోపణల కింద కేవలం ఐదేళ్ల  జైలు శిక్ష  పడే అవకాశం ఉంది  క్రమంలోనే, నేరాన్ని ఒప్పుకోవడం ద్వారా తనకు పడే శిక్ష కాలాన్ని తగ్గించుకోవడానికి భట్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement