అరిజోనా నుంచి కాంగ్రెస్‌కు
డెమోక్రాట్లకు మరో స్థానం
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మరో భారతీయ అమెరికన్ విజయం సాధించారు. అరిజోనా రాష్ట్రం నుంచి అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్‌గా 48 ఏళ్ల వైద్యుడు అమిష్ షా రికార్డు సృష్టించారు. అరిజోనాలోని ఒకటవ కాంగ్రెషనల్ నియోజక వర్గం నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన అమిష్ షా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎన్‌ఎఫ్‌ఎల్ క్రీడాకారుడు జే ఫీలీని ఓడించారు. రిపబ్లికన్ల స్థానాన్ని డెమోక్రాట్ల ఖాతాలో వేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో అమిష్ షా 52.49 శాతం ఓట్లు సాధించారు. ఫీలీ ఫీలీ 45.45 శాతం ఓట్లకు పరిమితమయ్యారు.
రాజకీయ కాలుష్యాన్ని అంతం చేద్దాం
కలుషిత రాజకీయ వాతావరణానికి స్వస్తి చెప్పాలని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని విజయానంతరం అమిష్ షా పిలుపునిచ్చారు. విజయం సాధించిన తరువాత సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక పోస్టు చేస్తూ.. అరిజోనా ప్రజల ప్రతినిధిగా కాంగ్రెస్‌లో అడుగుపెట్టడం జీవితంలో దక్కిన అతిపెద్ద గౌరవం. నాకు ఓటేసినా, వేయకపోయినా ప్రతి పౌరుడికి బాధ్యతా యుతమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తానని హామీ ఇస్తున్నాను.’’అని వ్యాఖ్యానించారు. అమిష్ షా తల్లిదండ్రులు గుజరాత్‌కు చెందిన వారు. 1960లలో అమెరికాకు వలస వెళ్లారు. షికాగోలో జని్మంచిన అమిష్ షా.. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో వైద్య విద్యను, యూసీ బెర్కిలీలో పబ్లిక్ హెల్త్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఎమర్జెన్సీ రూమ్ డాక్టర్‌గా సేవలు అందించిన ఆయన, 2018, 2020, 2022లలో అరిజోనా స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు వరుసగా ఎన్నికయ్యారు. వైద్యుడిగా అమిష్ షా న్యూయార్క్ ఎన్‌ఎఫ్‌ఎల్ జట్టుకూ సేవలందించారు ఆ సమయంలో జే ఫీలీ జట్టు కికర్.


