ఆధారాలన్నీ ఎస్‌ఈసీకి ఇచ్చాం: కన్నబాబు | We Have Given All The Evidence To The SEC: Kurasala Kannababu | Sakshi
Sakshi News home page

ఆధారాలన్నీ ఎస్‌ఈసీకి ఇచ్చాం: కన్నబాబు

Oct 13 2026 1:43 PM | Updated on Oct 13 2026 2:14 PM

We Have Given All The Evidence To The SEC: Kurasala Kannababu

సాక్షి, విజయవాడ: ఎస్ఈసీ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నుంచి మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్‌ బాబు, కాసు మహేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత నారాయణమూర్తి హాజరయ్యారు. సమావేశం అనంతరం కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. రేపు నోటిఫికేషన్ రాబోతుంటే.. నేడు మీటింగ్ పెట్టారు. ఈ రోజు అభ్యంతరాలు చెప్పమని చెపుతున్నారు.దీన్ని బట్టే ఎంత పారదర్శంగా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఎన్‌వోసీలు కుల ధ్రువ పత్రాలు ఇవ్వడం లేదు. కుల ధ్రువ పత్రాలు తప్పుల తడకగా ఉన్నాయి. మా దగ్గర ఆధారాలన్నీ ఎస్‌ఈసీకి ఇచ్చాం.. ఆన్‌లైన్‌ కాకుండా మ్యానువల్‌గా కుల ధ్రువపత్రాలు ఇవ్వాలని కోరాం. అభ్యర్థి నో డ్యూ సర్టిఫికెట్ తీసుకుంటే సరిపోతుంది.. కానీ మొత్తం తీసుకోవాలని నిబంధన పెడుతున్నారు.. నామినేషన్ వేయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు’’ అంటూ కన్నబాబు మండిపడ్డారు.

‘‘ఆన్‌లైన్‌లో సభలకు పర్మిషన్ ఇచ్చేవిధంగా అవకాశం ఇవ్వాలి. కౌంటింగ్, పోలింగ్ ప్రాంతాల్లో పారా మిలిటరీ సిబ్బందిని ఉపయోగించాలి. సమస్యత్మక ప్రాంతాల్లో పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌లను దూరంగా మార్చేశారు. పారదర్శకమైన ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి మద్యంపై చర్యలు తీసుకొనే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరాం’’ అని కన్నబాబు తెలిపారు.

విజయవాడలో ముగిసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశం

ఇదీ చదవండి: పీఠాలపై పేచీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement