సాక్షి,తాడేపల్లి: బీఎస్‌ఎఫ్ జవాన్ కదిమి వేణు మృతిపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
‘అసోంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, కొత్తపల్లికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ కదిమి వేణు మరణం నన్ను కలచివేసింది. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వేణుకు నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
అసోంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ అసువులు బాసిన తూర్పుగోదావరి జిల్లా, గోకవరం మండలం, కొత్తపల్లికి చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్ కదిమి వేణు మరణం నన్ను కలచివేసింది. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వేణుకు నివాళులర్పిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 27, 2026


