సాక్షి,కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలోని కీలక నేతలకు ఎదురుదెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు కూటమి నేతల సొంత ఇలాకాల్లో ఓటమి పాలైన అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో ఉన్నారు.
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుతం కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు ఊహించని షాక్ తగిలింది. తన స్వగ్రామం అచ్చంపేటలో వైఎస్సార్‌సీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి వీరంరెడ్డి పరిమళ విజయం సాధించారు. టీడీపీ మద్దతు ఉన్న అభ్యర్థిపై 46 ఓట్ల మెజార్టీతో పరిమళ గెలిచారు.
రీకౌంటింగ్ పేరుతో ఫలితాన్ని ప్రకటించకుండా జాప్యం చేయడంతో కౌంటింగ్ సెంటర్ వద్ద బైఠాయించి గ్రామస్తులు ధర్నా చేశారు. చివరకు కౌంటింగ్ అధికారులు ఫలితాల్ని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారు గెలిచినట్లు డిక్లరేషన్ ఫారమ్ ఇచ్చారు.


