ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో బెంబేలెత్తిపోతున్న వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం నిన్న (గురువారం) జరిగిన గ్రామ పంచాయతీ, కొన్ని మున్సిపల్ స్థానాల ఎన్నికల్లోనూ బరితెగించి రిగ్గింగ్‌కు పాల్పడింది. మొదటి విడత మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులకు తెగబడ్డారు. పలు చోట్ల పోలీసులు కూడా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, ఏజెంట్లను అక్రమంగా అరెస్టు చేసి పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా నిర్బంధించి కూటమి నేతలకు సహకరించారు.
అనకాపల్లి జిల్లా:
- చోడవరం పంచాయతీ ఎన్నికల ఫలితం తారుమారు
- వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గునూరు రామచంద్ర నాయుడు 37 ఓట్లతో గెలిచినట్టు అధికారులు ప్రకటన
- ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు కౌంటింగ్ కేంద్రానికి రావడంతో ఫలితాన్ని తారుమారు చేసిన అధికారులు
- ఒక కట్ట ఓట్లు లెక్కింపు జరగలేదని చెప్పి ఎనిమిది ఓట్లతో టీడీపీ అభ్యర్థి పెదబాబు గెలిచినట్టు ప్రకటన
- కౌంటింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ ఆందోళన
పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: గుడివాడ అమర్నాథ్
- ఎమ్మెల్యే కేఎస్‌ఎన్ రాజు ఒత్తిడితో ఫలితాన్ని తారుమారు చేశారు
- రీకౌంటింగ్ నిర్వహించాలని అధికారులను అడిగిన అంగీకరించలేదు
- చోడవరం ఎన్నికల ఫలితంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాము
- రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదు
- రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది.
శ్రీ సత్యసాయి జిల్లా:
- రాప్తాడు టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం లో హైడ్రామా
- పేరూరు మేజర్ పంచాయతీ లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు మోహన్ బాబు 10 ఓట్లతో గెలుపు
- పదే పదే రీ-కౌంటింగ్ పేరుతో 300 నుంచి మెజారిటీ తగ్గిస్తూ వస్తున్న ఎన్నికల అధికారులు
- డిక్లరేషన్ ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నేతలు కార్యకర్తల ధర్నా
- టీడీపీ గెలిచే దాకా రీకౌంటింగ్ చేయాలని పరిటాల సునీత ఒత్తిడి
- వైఎస్సార్ సీపీ మద్దతుదారు కు డిక్లరేషన్ ఇవ్వని అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
ఎన్టీఆర్ జిల్లా:
పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ కుట్రలు
అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫలితాలు తారుమారు
మైలవరం మండలం చంద్రగూడెం గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్తత
ముందుగా 69 ఓట్లతో వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించిన ఆర్వో
ఆర్వోతో మంతనాలు జరిపిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పీఏ నారాయణ
ఎమ్మెల్యే పీఏ నారాయణ వచ్చి వెళ్లిన అనంతరం 34 ఓట్లతో టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించిన ఆర్వో
ఫలితాలు మార్చేయడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణుల తీవ్ర ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన మాజీ మంత్రి జోగి రమేష్
రీ కౌంటింగ్ జరపాలని డిమాండ్
వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆందోళన పట్టించుకోకుండా టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించి వెళ్లిపోయిన ఆర్వో
గెలిచినా ఓడినట్లు ప్రకటించి మోసం చేశారంటూ కన్నీరు పెట్టుకున్న వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శీలం కామేశ్వరి


