సాక్షి, తాడేపల్లి: భక్త కనకదాసుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. దేవుడి ఎదుట అందరూ సమానమేననీ.. సమాజంలో అది వెల్లివిరియాలని తన కీర్తనల ద్వారా.. చాటి చెప్పిన మహనీయుడు శ్రీ భక్త కనకదాసు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
శ్రీకృష్ణుడిపై తనకున్న అపారమైన భక్తిని.. సామాన్యులకు అర్థమయ్యే భాషలో కీర్తనలుగా మలిచి, ప్రజల హృదయాలకు చేరువ చేశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్యుడైన శ్రీ భక్త కనకదాసు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
దేవుడి ఎదుట అందరూ సమానమేనని, అది సమాజంలో వెల్లివిరియాలని తన కీర్తనల ద్వారా చాటి చెప్పిన మహనీయుడు శ్రీ భక్త కనకదాసు గారు. శ్రీకృష్ణుడిపై తనకున్న అపారమైన భక్తిని సామాన్యులకు అర్థమయ్యే భాషలో కీర్తనలుగా మలిచి, ప్రజల హృదయాలకు చేరువ చేశారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్యుడైన శ్రీ భక్త కనకదాసు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 27, 2026


