స్వర్ణకాంతులతో ధ్వజస్తంభం పీఠం | Simhachalam Temple Dhwajasthambham Gold Plating | Sakshi
Sakshi News home page

స్వర్ణకాంతులతో ధ్వజస్తంభం పీఠం

Nov 27 2026 2:09 PM | Updated on Nov 27 2026 2:09 PM

Simhachalam Temple Dhwajasthambham Gold Plating

ధ్వజస్తంభం పీఠానికి చేయించిన స్వర్ణ తాపడంతో సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ

రూ.1.20 కోట్లతో సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ సేవ

సింహాచలం (విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణకాంతులు చేకూరాయి. రూ.1.20 కోట్ల వ్యయంతో 509.600 గ్రాముల బంగారు తాపడాన్ని సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ చేయించారు. ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణతాపడం పనుల­ను గురువారం రాత్రి అలంకరించారు.

ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూ­జ­లు నిర్వహించారు. దేవస్థానం తరఫున ఈవో జల్లేపల్లి వెంకటరావు.. మావూరి వెంకటరమణకు ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో చెన్నైకి చెందిన స్మార్ట్‌ క్రియేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ కె.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. 2023లో రూ.1.80 కోట్ల వ్యయంతో ధ్వజస్తంభా­నికి స్వర్ణతాపడం (రాగిరేకులపై బంగారం పూ­త) పనులను కూడా మావూరి వెంకటరమణే చే­యించారు. తాజాగా ధ్వజస్తంభం పీఠానికీ స్వర్ణతాపడం చేయించి తన భక్తిని చాటుకున్నారు.

ఇదీ చదవండి: కుప్పంలో ఫ్యాన్‌ సునామీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement