breaking news
sri varaha lakshmi narasimha swamy
-
అశోక్ గజపతికి బాధ్యత లేదా?
సింహాచలం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని దుర్ఘటన చోటుచేసుకుంది. చందనోత్సవం రోజున షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నాసిరకంగా నిర్మించిన గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా, దేవస్థానం వంశపార ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు మాత్రం ఇంతవరకు సంఘటనా స్థలాన్ని సందర్శించక పోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. చందనోత్సవం రోజున స్వామివారి తొలి దర్శనం చేసుకునేది వంశపార ధర్మకర్తలే. ఆనవాయితీ ప్రకారం.. అశోక్‌గజపతిరాజు మే 29న రాత్రి సింహగిరిపై బస చేసి, 30న తెల్లవారుజామున కుటుంబసమేతంగా తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన అక్కడే ఉన్న సమయంలో గోడ కూలి ప్రమాదం జరిగింది. భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగినా, అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్లు మారుమోగినా అశోక్‌గజపతిరాజు ప్రమాద స్థలానికి రాలేదు. మూడు రోజులు గడిచినా ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడం, మృతుల కుటుంబాలను పరామర్శించకపోవ డంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో దేవస్థానంలో జరిగిన చిన్న చిన్న విషయాలపై సైతం మీడియా ముందుకు వచ్చి విమర్శలు గుప్పించిన అశోక్‌గజపతిరాజు, ఇప్పుడు ఇంతటి ఘోర ప్రమాదం జరిగినా స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. భక్తుల సౌకర్యాలే ముఖ్యమని నీతులు చెప్పే ఆయన, వారి మరణం పట్ల వ్యవహరించిన తీరు బాధాకరమని అంటున్నారు. మృతుల కుటుంబాలకు దేవస్థానం తరఫున నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఎంపీదీ అదే దారి.. సింహగిరిపై చందనోత్సవంరోజు గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘోర ప్రమాదంలో ఎంపీ భరత్ ఇప్పటివరకు మృతుల కుటుంబాలను పరామర్శించలేదు. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
Simhachalam Kalyanam Photos: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం (ఫొటోలు)
-
పాయసాన్ని పడేస్తే ఇంత మంచి జరుగుతుందా?
-
అప్పన్న హుండీ ఆదాయం రూ.2.23 కోట్లు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 32 రోజులకు గాను 2కోట్ల 23లక్షల 32వేల 228 రూపాయలు వచ్చినట్టు ఈవో డి.భ్రమరాంబ తెలిపారు. సింహగిరిపై స్వామివారి ఆలయ బేడా మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 206 గ్రాముల బంగారం, 16.732 కిలోల వెండి లభించినట్టు ఈవో పేర్కొన్నారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. అలాగే దేవస్థానం అనుబంధ దేవాలయం పైడితల్లి ఆలయ హుండీ ఆదాయం 8 లక్షల 8వేల 740 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. -
షూటింగ్‌లకు విశాఖ అనువైన ప్రదేశం
సింహాచలం: సినిమా షూటింగ్‌లకు విశాఖ ఎంతో చక్కనైన ప్రదేశమని, రానున్న రెండు మూడేళ్లలో ఇక్కడ నిరంతరం సినిమా షూటింగ్‌లు జరుగుతాయని, ఆ విధంగా పరిశ్రమని అభివృద్ధి చేయబోతున్నామని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం ఆయన దర్శించుకున్నారు. కప్ప స్తంభానికి మొక్కుకుని స్వామికి అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బాలకృష్ణ హీరోగా తాను నిర్మిస్తున్న జై సింహా సినిమా విశేషాలను తెలిపారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీస్‌కి ఫైవ్‌స్టార్ ఫెసిలిటీస్‌తో వృద్ధాశ్రమాలు ఉండాలని భావిస్తున్నానన్నారు. -
అప్పన్న సన్నిధిలో ప్రముఖులు
సింహాచలం : శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈస్టు కోస్టు రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్‌సింగ్ దంపతులు, ఎల్.పాణిగ్రహి స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. వీరంతా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. -
చందన స్వామిని దర్శిద్దాం రండి
రేపు అప్పన్న చందనోత్సవం తెల్లవారుజాము 4 నుంచే సాధారణ భక్తులకు దర్శనాలు రాత్రి 7 గంటల వరకే క్యూల్లోకి ప్రవేశం విస్తృత ఏర్పాట్లు చేపట్టిన ఆలయ వర్గాలు సింహాచలం, న్యూస్‌లైన్ : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం శుక్రవారం అంగరం వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. వరాహ, నృసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని 12 మణుగులు (500 కిలోలు) చందనంతో ఏడాదంతా నిత్య రూపంతో దర్శనమిచ్చే స్వామి, ఏటా వైశాఖ శుద్ధ తదితయనాడు మాత్రమే నిజరూప దర్శనమిస్తారు. నాలుగు విడతలు చందనం సమర్పణ ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల (120 కిలోలు) చొప్పున చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు విడతలుగా మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. అర్ధరాత్రి నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 నుంచే వైదిక కార్యక్రమాలను అర్చకులు ప్రారంభిస్తారు. శుక్రవారం తెల్లవారుజాము 3.30 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు తొలి దర్శనం చేస్తారు. అనంతరం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు అందజే స్తారు. రాత్రి 8.30 గంటల నుంచి శ్రీ వైష్ణవస్వాములు సహస్రఘట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. సింహగిరిపై ఉన్న గంగధార వద్ద నుంచి వెయ్యి కలశాలతో నీటిని తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామికి తొలివిడత చందనాన్ని (125 కిలోలు) సమర్పించి మరల నిత్య రూపభరితుడ్ని చేస్తారు. విస్తృ ఏర్పాట్లు చందనోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. లక్షమందికి పైగానే భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ఉచిత, రూ.200, రూ.500ల క్యూలను పక్కాగా ఏర్పాటు చేశారు. 17వేల మంది భక్తులు ఒకేసారి వేచి ఉండేలా క్యూలు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఫ్రీ పాస్‌లు జారీచేయకుండా ప్రోటోకాల్ వీఐపీలు, వీఐపీలకు కూడా రూ.1000 ప్రత్యేక టికెట్టు పెట్టారు. వీరికి కోసం ప్రత్యేక సమయాలను కూడా కేటాయించారు. ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. మిగతా సమయాల్లో అనుమతించరు. ప్రోటోకాల్ వీఐపీలకు రాజగోపురం ద్వారా ప్రవేశం కల్పిస్తుండగా, వీఐపీకు ప్రత్యేకంగా రూ.1000 క్యూ ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆలయంలోంచి బయటకు వచ్చే భక్తులందరినీ దక్షిణ మార్గంలో కొత్తగా నిర్మిస్తున్న రాజగోపురంలోంచి పంపిస్తారు. 35 స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, మంచినీరు అందించనున్నాయి. రెండు ఫైర్ ఇంజిన్లు, రెండు 108లు అందుబాటులో ఉంటాయి. సింహగిరిపైకి భక్తుల వాహనాలను అనుమతించరు. హనుమంతవాక మీదగా సింహాచలం వచ్చే భక్తులు అడవివరం కూడలి, నగరంలోంచి గోపాలపట్నం మీదగా వచ్చే భక్తులు గోశాల కూడలి వద్ద వాహనాలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. గోశాల, అడవివరం జంక్షన్ల నుంచి సింహగిరికి భక్తులను చేరవేసేందుకు దేవస్థానం 40 బస్సులను ఉచితంగా నడుపుతోంది. ఈ ప్రాంతాల నుంచి భక్తులు ఈ బస్సుల్లోనే సింహగిరికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. 3న ఉదయం 10 నుంచి దర్శనాలు స్వామి దర్శనాలు శనివారం ఉదయం 10 గంటల నుంచి లభిస్తాయని దేవస్థానం ప్రధాన పురోహితులు సీతారామాచార్యులు తెలిపారు. శుక్రవారం చందనోత్సవం సందర్భంగా ఆ రోజు రాత్రి సహస్ర ఘటాభిషేకం నిర్వహణ, మూడో తేదీ ఉదయం తొలివిడత చందనం సమర్పణ జరుగుతుండటంతో ఉదయం 10 గంటల నుంచి దర్శనాలు లభిస్తాయన్నారు. అంతకుముందు దర్శనాలు లభించవని పేర్కొన్నారు. ప్రసాదాలు సిద్ధం భక్తుల కోసం లక్షా 25 వేల లడ్డూలను విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. దర్శనానంతరం ఆలయ దక్షిణ మార్గం నుంచి బయటకి వచ్చే దారిలో ప్రసాదాల విక్రయశాల ఉంది. 50వేల మందికి దేవస్థానం పులిహోర, దద్ధోజనం ప్రసాదం అందజేసేందుక ఏర్పాట్లు చేసింది. టికెట్ల విక్రయ కేంద్రాలు నగరంలోని పలు స్టేట్ బ్యాంకు బ్రాంచిలు, ఆంధ్రా బ్యాంకులు, గ్రామీణ వికాస బ్యాంకుల్లో రూ.200, రూ.500 టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. గోపాలపట్నంలోని దేవస్థానం పెట్రోల్ బంక్, సింహగిరిపై విచారణ కార్యాలయంలో కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. చందనోత్సవం రోజు సింహగిరిపై క్యూల ప్రవేశ ద్వారాల వద్ద కూడా టికెట్ల విక్రయాలు జరుగుతాయి. క్యూలైన్లు ఏర్పాటు రాత్రి ఏడు గంటల వరకే క్యూలలోకి భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూలలో ఉన్నవారికి మాత్రం దర్శనం కల్పిస్తారు. రాత్రి 8.30 గంటలకు సహస్ర ఘటాభిషేకం ప్రారంభమైనా 7 గంటలలోపు క్యూలలోకి ప్రవేశించేవారికి మాత్రం దర్శనం లభిస్తుంది. ఒకవైపు సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు, అదే సమయంలో క్యూలలో ఉన్న భక్తులకు దర్శనం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు.