
సింహాచలం: సింహగిరి కల్యాణ సిరిని సంతరించుకుంది. చైత్రశుద్ధ ఏకాదశి వేళ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి నయనానందకరంగా జరిగింది.

శ్రీ మహా విష్ణువు అవతారమైన వరాహ లక్ష్మీ నృసింహస్వామిని పెళ్లి కుమారుడిగా, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెళ్లి కుమార్తెలుగా దర్శించిన భక్తులు తన్మయులయ్యారు.









