Simhachalam
-
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
సింహాచలం రైల్వే స్టేషన్లో రైలు ప్రమాద మాక్‌డ్రిల్ (ఫొటోలు)
-
రుషికొండలో గుడివాడ అమర్నాథ్, వరుదు కల్యాణి ప్రత్యేక పూజలు..
-
వీడియో: పవన్ ఫ్యాన్ వీరంగం.. పెట్రోల్ బంక్ పేల్చేస్తానంటూ..
సాక్షి, విశాఖపట్నం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్త ఓ పెట్రోల్ బంక్ వద్ద హల్చల్ చేశాడు. తన సమస్యను పరిష్కరించాలని లేదంటే.. గ్యాస్ సిలిండర్‌తో బంక్‌ను పేల్చేస్తానని బెదిరింపులకు దిగాడు. అనంతరం, అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.వివరాల ప్రకారం.. విశాఖకు చెందిన జనసేన కార్యకర్త సింహాచలం స్థానికంగా ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ సిలిండర్‌తో హల్చల్ చేశాడు. తన సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరికి చేర్చాలంటూ పెట్రోల్ బంక్ దగ్గర హంగామా క్రియేట్ చేశాడు. తాను పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేన కార్యకర్తను అంటూ అక్కడున్న వారిని బెదిరింపులకు గురిచేశాడు. Chaos at a petrol pump in Simhachalam as a Pawan Kalyan fan and Jana Sena worker demands to take his issue to Deputy CM Pawan Kalyan. He threatens to set a tanker on fire with a cylinder and lighter if not addressed. #Simhachalam #PawanKalyan #JanaSenapic.twitter.com/GJXOWB6vIz— The Munsif Daily (@munsifdigital) August 1, 2024తన సమస్యను వెంటనే పరిష్కరించాలని లేదంటే ట్యాంకర్‌కి నిప్పు పెడుతానంటూ సిలిండర్, లైటర్‌తో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎంతో కష్టం మీద బంక్ సిబ్బంది సింహచలాన్ని అడ్డుకున్నారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. అనంతరం, బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్ని అతడిని అరెస్ట్ చేశారు. -
విశాఖ సింహాచల గిరి ప్రదక్షిణకు తరలి వచ్చిన భక్తజనం (ఫొటోలు)
-
Simhachalam Temple: సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భక్తుల రద్దీ (ఫొటోలు)
-
Simhachalam: దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.దేవస్థానం అర్చకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజయనగరానికి చెందిన భక్తురాలు తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.టెక్కలికి చెందిన భక్తులను ప్రశి్నస్తున్న స్థానాచార్యులు ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్‌కుమార్‌లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు. వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
దర్శనానికి వచ్చి ఉంగరం దొంగిలిస్తారా..?
సింహాచలం: ‘శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి దర్శనానికి వచ్చి ఆయన ఉంగరాన్నే దొంగిలిస్తారా? మర్యాదగా దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి.. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం..’అని సింహాచలం కొండకి వచ్చిన పలువురు భక్తులను దేవస్థానం స్థానాచార్యులు ప్రశ్నించే సరికి వారంతా కంగుతిన్నారు. ‘మేం దొంగల్లా కనిపిస్తున్నామా.! స్వామి దర్శనానికి వస్తే ఉంగరాన్ని దొంగతనం చేశారంటారేంటి? పైగా తాళ్లతో బంధించి తీసుకొస్తారా..’అంటూ భక్తులు ఆవేశంతో స్థానాచార్యులపై గర్జించారు. ‘చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. పోలీసులు తీసుకెళ్లకముందే దొంగిలించిన ఉంగరాన్ని మర్యాదగా ఇచ్చేయండి.’ అంటూ స్థానాచార్యులు మరింత గర్జించి అడగటంతో భక్తుల కళ్లంట నీళ్లు గిర్రున తిరిగాయి.తాము ఉంగరం తీయలేదని ఎంత చెబుతున్నా వినకుండా మీరే దొంగ అంటూ పదే పదే ప్రశ్నించడంతో వారంతా ఆగ్రహంతో చిందులు వేశారు. పైగా చేతికున్న ఉంగరాలను చూపెట్టమని.. దొంగిలించిన ఉంగరంలా ఇవి ఉన్నాయంటూ స్థానాచార్యులు అడగటంతో భక్తుల నోటి మాట రాలేదు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టమని తెలుసుకుని భక్తులంతా సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తమకు మాత్రమే దక్కిన భాగ్యంగా భావించి ఆనందభరితులయ్యారు. ఇదీ సింహగిరిపై బుధవారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి వినోదోత్సవం. స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన ఉంగరం వెతికే ఘట్టాన్ని బుధవారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు.ఏడు పరదాల్లో దాగి ఉన్న స్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లకీలో అధిష్టింపజేశారు. స్వామి దూతగా పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు కర్ర, తాడు పట్టుకుని దర్శనానికి వచ్చిన పలువురు భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి రాజగోపురం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.ఉత్సవం గురించి తెలియని వాళ్లు కన్నీటిపర్యవంతం చెందారు. ఉత్స వం గురించి తెలిసిన వాళ్లు నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ తరుణంలోనే స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాను తొలగించారు. చివరికి స్వామి చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. ఎస్.కోట మండలం బొద్దాంకి చెందిన నూతన దంపతులు ఈశ్వరరావు, మాధవి, ఆరిలోవ ప్రాంతానికి చెందిన మౌళీ, గౌతమి, ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యారి్థనులు హిమజ, ప్రత్యూష, లావణ్య, శ్వేత అశ్విని, టెక్కలికి చెందిన అక్కాతమ్ముళ్లు జీవిత, నవీన్‌కుమార్‌లను పురోహిత్ అలంకారి కరి సీతారామాచార్యులు తాళ్లతో బంధించి తీసుకురాగా వారిని స్థానాచార్యులు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా దాసన్నపేటకి చెందిన రోజా అనే మహిళ తన కుమార్తె మిక్కి, అల్లుడు కిశోర్, మనవలతో కలిసి సింహగిరికి రాగా వారిని తాళ్లతో బంధించారు.వాళ్ల చేతికి ఉన్న ఉంగరం.. దొంగిలించిన ఉంగరంగానే ఉందని స్థానాచార్యులు, అర్చకులు అనుమా నం వ్యక్తం చేయడంతో వారంతా వాదనకు దిగారు. నా కూతురుకు, అల్లుడికి నిశి్చతార్థం రోజు పెట్టిన ఉంగరాలు ఇవని, దొంగిలించినవి కాదని స్థానాచార్యులతో రోజా వాదించారు. ఇదిలా ఉండగా దేవస్థానం ఈవో ఎస్.శ్రీనివాసమూర్తి, ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఇరగవరపు రమణాచార్యులు, ఆలయ కొత్వాల్ నాయక్ లంక సూరిబాబు, ఆలయ ఎస్పీఎఫ్ కానిస్టేబుళ్లు, సూపరింటెండెంట్ వెంకటరమణ, ట్రస్ట్‌బోర్డు మాజీ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు సైతం దొంగలుగా పట్టుపట్టారు. తొలుత స్థానాచార్యులను కూడా తాళ్లతోనే బంధించి తీసుకురావడం విశేషం. అదే సమయంలో సింహగిరి వచ్చిన భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు వినోదోత్సవంలో పాల్గొని.. స్వామిని దర్శించుకున్నారు. -
Simhachalam Kalyanam Photos: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం (ఫొటోలు)
-
సింహాచలం భూ సమస్యలపై ప్రజలకు అవంతి హామీ
-
సింహాచలం స్టేషన్‌కు ‘అమృత’ భాగ్యం!
సాక్షి,విశాఖపట్నం : సింహాచలం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టింది. అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ విజయనగరం జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందన్నారు. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోందని చెప్పారు. ‘త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్ళు పట్టాలెక్కనున్నాయి. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడొద్దు. ఏపీలో రైల్వేల అభివృద్ధి కోసం 8వేల 406కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. భూ కేటాయింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. దేశంలో 5జీ మొబైల్ సర్వీసుల విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. నాలుగువేల నూతన సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే నిర్మాణం జరుగుతున్నాయి’అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదీచదవండి..విశాఖలో అమెరికా దిగ్గజ ఐటీ అనుబంధ సంస్థ -
తిరుమల శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
-
సింహాచలంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి
-
మాధవ స్వామి ఆలయంలో- శివరాత్రి సంబరాలు
-
ఘనంగా సింహాద్రి అప్పన్న డోలోత్సవం
-
భక్తజన సంద్రంగా సింహాచలం..గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. (ఫొటోలు)
-
సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం ఘనంగా నిర్వహించాం
-
నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తున్న అప్పన్న స్వామి
-
టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించిన వైవీ సుబ్బారెడ్డి
-
సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
సాక్షి, సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(స్వామి వారి నిజరూప దర్శనం) వైభవంగా మొదలైంది. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమైంది. భక్తులకు నిజ రూపంలో అప్పన్న స్వామి దర్శనమిస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ తరఫున ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి తెల్లవారుజామున ఒంటి గంట నుంచి దేవస్థానం అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. భక్తులకు ఉదయం 4 గంటల నుంచి దర్శనాలు ప్రారంభించారు. రాత్రి 8.30 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి తొలివిడతగా మూడు మణుగుల చందనం (120 కిలోలు) సమర్పిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: దేవుడి సేవలన్నింటికీ ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ -
సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవం
-
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై మరోసారి రోడ్డెక్కిన ఉద్యోగులు
-
సింహాచలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం (ఫొటోలు)
-
ఆటో నుంచి రూ.500 నోట్ల వర్షం
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లాలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం నోట్ల వర్షం కురిసింది. రోడ్డుపై వెళ్తున్న ఆటో నుంచి రూ.500 నోట్లు ఎగిరాయి. రోడ్డు మీద జలజలా రాలిపడ్డాయి. రోడ్డు మీద ఉన్న వారు కేకలు వేసినా ఆటోడ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. మడపాం టోల్గేట్ వద్ద ఒక ఆటోలో నుంచి రూ.500 నోట్లు కిందకు పడ్డాయి. గమనించిన టోల్గేట్ సిబ్బంది ఆటోడ్రైవర్‌ను కేకలు వేశారు. అయినా అతడు వినిపించుకోకుండా వెళ్లిపోవడంతో టోల్గేట్ సిబ్బంది రోడ్డుపై పడిన నోట్లను తీసుకున్నారు. పోలీసులకు విషయం తెలియడంతో నరసన్నపేట ఎస్ఐ సింహాచలం టోల్గేట్ వద్ద సీసీ పుటేజీని పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వస్తున్న పసుపురంగు ఆటోలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో పురుషులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. కరజాడ వద్ద నుంచే వీరు నోట్లు విసురుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. టోల్గేట్ వద్దకు వచ్చే సరికి నోట్ల వర్షం పెరిగింది. ఈ నోట్లు ఎవరివి, ఆ ఆటో ఎవరిది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ పుటేజీలో ఆటో నంబరును గుర్తించారు. ఇవి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోట్లు అనే ప్రచారం జరుగుతోంది. ఒక్క టోల్‌గేటు వద్దే రూ.88 వేలు లభిస్తే.. కరజాడ నుంచి లెక్కిస్తే లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రూ.88 వేలను స్వాధీనం చేసుకున్నామని, సోమవారం తహసీల్దార్ కోర్టుకు పంపుతామని, ఎవరైనా క్లెయిమ్ చేయడానికి వస్తే ఆధారాలు చూసి విచారిస్తామని ఎస్ఐ తెలిపారు. -
అప్పన్నను దర్శించుకున్న సింగర్ సునీత
సాక్షి, విశాఖపట్నం(సింహాచలం): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం ప్రముఖ సినీ గాయని సునీత దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆమె పేరిట అర్చకులు స్వామికి పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో రాజు ఆమెకు అందజేశారు. చదవండి: ('హైదరాబాద్‌తో ఎన్నో జ్ఞాపకాలు.. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తా') -
దివ్య మంగళరూపం నిజరూప దర్శనం
అణువణువూ అనంత భక్తితత్వంతో నిండిన ప్రకృతి రమణీయతలో భువిపై కొలువుదీరిన లక్ష్మీనారాయణుడు.. భూలోక వైకుంఠం.. సింహగిరిపై వెలసిన వరాహనరసింహుడు. ఏడాదిపొడవునా చందనలేపిత సుగంధ ద్రవ్యాల్లో చల్లబడుతూ వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే మంగళకర నిజరూప దర్శనమిచ్చే భక్తవరదుడు.. నిండైన చందనంలో నిత్యం కొలువుండే నరహరి నిజరూపాన్ని కనులారా తిలకించి మనసారా తరించేందుకు సమయం ఆసన్నమైంది.. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం 4 గంటల నుంచి ఆ భాగ్యం భక్తులకు లభించనుంది. సింహాచలం: సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనానికి వేళాయింది. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆ భాగ్యం భక్తులకు లభించనుంది. ఉదయం నాలుగు గంటల నుంచి స్వామి నిజరూప దర్శనం ప్రారంభం కానుంది. చందనోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఆలయ అర్చకులు, వైదిక కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు నిర్వహించిన అనంతరం వెండి బొరుగులతో చందనం వలుపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నిజరూపభరితుడ్ని చేస్తారు. అనంతరం ఆరాధన నిర్వహించి తొలి దర్శనాన్ని ఉదయం 3గంటల సమయంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుకు అందిస్తారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి స్వామికి పట్టువస్త్రాలు అందించే దేవాదాయశాఖ మంత్రి, ఉన్నతాధికారులు, టీటీడీ తరఫున పట్టువస్త్రాలు అందించే అధికారులకు దర్శనం అందిస్తారు. అనంతరం ఉదయం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తారు. రాత్రి 7గంటల వరకే క్యూలో అనుమతి స్వామివారి నిజరూపదర్శనానికి విచ్చేసే భక్తులను రాత్రి 7 గంటలలోపు క్యూల్లోకి అనుమతిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటివరకు క్యూల్లో వేచిఉన్న భక్తులకు స్వామివారి దర్శనాలు అందజేస్తారు. దర్శన సమయాలు ఉచిత, రూ.300 టిక్కెట్లు కలిగిన భక్తులందరికీ ఉదయం 4 గంటల నుంచి రాత్రి వరకు దర్శనం అందజేస్తారు. రూ.1500 టిక్కెట్టుపై వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 4నుంచి 6 గంటలు తిరిగి 7 గంటల నుంచి 9 గంటల వరకు రెండు స్లాట్లు పెట్టారు. అలాగే రూ.1200 టిక్కెట్టుపై వచ్చే వీవీఐపీలకు కూడా ఉదయం 4గంటల నుంచి 6గంటల వరకు, తిరిగి 7గంటల నుంచి 9గంటల వరకు దర్శనాల సమయం కేటాయించారు. దివ్యాంగుల కోసం.. దివ్యాంగులకు సాయంత్రం 5గంటల నుంచి 6 గంటలలోపు దర్శన సమయాన్ని కేటాయించారు. ఉచిత, రూ.300,రూ.1000,రూ.1200,రూ.1500 టిక్కెట్ల క్యూలను, క్యూలపై షామియానాలు, టెంట్ల్ ఏర్పాటు చేశారు. 25వేల మంది భక్తులు మొత్తం క్యూల్లో పట్టేలా ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మజ్జిగ, ఇతర శీతలపానియాలు క్యూల్లో అందించే ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల నుంచి సహస్రఘటాభిషేకం రాత్రి 9 గంటల నుంచి సహస్రఘటాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఇందుకోసం వెండి కలశాలను, మట్టి కలశలను సిద్ధం చేశారు. అలాగే ఆలయ దక్షిణ రాజగోపురం వద్ద బ్రిడ్జిపై నుంచి సహస్రఘటాభిషేకం నిర్వహణలో పాల్గొనే శ్రీవైష్ణవస్వాములు వెళ్లేలా, దుగువ నుంచి దర్శనం అనంతరం వెళ్లే భక్తులు వెళ్లేలా వంతెన ఏర్పాటు చేశారు. ఒక పక్క ఏడు గంటలలోపు క్యూలో ఉన్న భక్తులకు దర్శనాలు అందిస్తూనే, మరో వైపు సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వíస్తారు. విధుల్లో పోలీసులు చందనోత్సవం సందర్భంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు సోమవారం ఉదయానికే చేరుకున్నారు. కొండదిగువ ట్రాఫిక్ పోలీసులకు, సింహగిరిపై లా అండ్ ఆర్డర్ పోలీసులకు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసి పోలీస్ అధికారులు ఏయే ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాలో డ్యూటీ చార్ట్‌లు వేశారు. విద్యుత్ కాంతులతో సింహగిరి చందనోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరి విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. అలాగే ఆలయాన్ని పెద్ద ఎత్తున పుష్పాలంకరణ చేశారు. -
నాన్న మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా.. ఇప్పుడు మంత్రినై వచ్చా..
సాక్షి, సింహాచలం(పెందుర్తి): 30 ఏళ్ల క్రితం నాన్న రాష్ట్ర మంత్రిగా తొలిసారి శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఆయన చిటికిన వేలు పట్టుకొని సింహగిరిపై నడిచాను.. ఇప్పుడు తాను మంత్రిగా స్వామి దర్శనానికి రావడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని గురువారం సాయంత్రం ఆయన దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు, దేవస్థానం ఈవో సూర్యకళ పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఆయన పేరిట అర్చకులు స్వామికి అష్టోత్తరంపూజ నిర్వహించారు. దేవస్థానం తరపున శేషవస్త్రాలు, జ్ఞాపికను, ప్రసాదాన్ని ఈవో అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంతో తమ కుటుంబానికి ఎంతో దగ్గర అనుబంధం ఉందన్నారు. ఆ స్వామిని ఆరాధ్యదైవంగా పూజిస్తామన్నారు. ఆ సింహాద్రినాథుడి ఆశీస్సులు, ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దయ వల్లే నాకు మంత్రిగా అవకాశం లభించిందన్నారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారానికి ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీ వేసిందని, సమస్య పరిష్కారానికి తన వంతు కృషి కూడా చేస్తానని తెలిపారు. రాజగోపురం వద్ద దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సభ్యులు సువ్వాడ శ్రీదేవి, దొడ్డి రమణ, పెనుమత్స శ్రీదేవి వర్మ, ప్రత్యేక ఆహ్వానితుడు దొడ్డి రమణ తదితరులు స్వాగతం పలికారు. -
అరసవల్లిలో వైభవంగా రథసప్తమి
అరసవల్లి/తిరుమల: శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. సుమారు 60 వేల మంది వరకు భక్తులు ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆదిత్యుడిని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అరసవల్లి ఆలయానికి మాస్టర్ ప్లాన్ అమలుకు త్వరలోనే చర్యలు చేపడతానని మంత్రి వెలంపల్లి చెప్పారు. ఆలయ వివరాలను ఆర్జేసీ సురేష్‌బాబు, ఈవో వి.హరిసూర్యప్రకాష్‌ను అడిగి తెలుసుకున్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. సప్తవాహనాలపై శ్రీనివాసుడి కటాక్షం.. తిరుమల శ్రీవారు సప్తవాహనాలను అధిరోహించి మంగళవారం భక్తులను కటాక్షించారు. తిరుమల ఆలయంలో రథసప్తమి మహోత్సవం వైభవంగా సాగింది. కోవిడ్ నేపథ్యంలో దీన్ని ఏకాంతంగా నిర్వహించారు. కార్యక్రమాలను ఎస్వీబీసీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఉషోదయాన సూర్యప్రభ వాహనంతో సప్తవాహన సేవోత్సవం ప్రారంభమైంది. అనంతరం శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీమలయప్పస్వామి చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై కొలువుదీరారు. మధ్యాహ్నం శ్రీసుదర్శన చక్రత్తాళ్వారులకు అభ్యంగనం ఆచరించారు. రాత్రి చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు పరిసమాప్తమయ్యాయి. సింహగిరిపై విశేషంగా రథసప్తమి సింహాచలం: విశాఖ జిల్లా సింహాచలంలో వేంచేసిన శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో రథసప్తమి పూజలను మంగళవారం విశేషంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ ప్రాంగణంలో హంసమూలన ఉన్న పురాతన రాతిరథంపై వేంజేపచేసి ఉదయం పంచామృతాభిషేకం, అరుణపారాయణ పఠనం నిర్వహించారు. అనంతరం రాతిరథంపైనే స్వామికి నిత్య కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై వేంజేపచేసి తిరువీధిని నిర్వహించారు. -
సీఎం వైఎస్ జగన్ కు స్వామివారి ఆశీస్సులు ఉండేలా చూడాలని కోరుకున్నా: తమ్మినేని సీతారాం
-
అఖండ సినిమాతో పరిశ్రమకు ధైర్యం వచ్చింది: బాలకృష్ణ
సాక్షి, విశాఖపట్నం: అఖండ సినిమా ఘన విజయంతో ఫుల్లు ఖుషీలో ఉన్నారు హీరో బాలకృష్ణ. అఖండ భారీ విజయం నేపథ్యంలో గురువారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నాడు బాలకృష్ణ. ఆయనతో పాటు దర్శకుడు బోయపాటి కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘అఖండ సినిమా అఖండ విజయం సాధించిన సందర్భంగా విశాఖలో విజయోత్సవ సభను ఏర్పాటు చేశాం. ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని కృతజ్ఞతలు తెలియ చేసుకునేందుకు వచ్చాము. సంవత్సరం తొమ్మిది నెలల తర్వాత విడుదలైన సినిమాకు మంచి ఆదరణ చూపించారు.ఘన విజయం అందించారు. ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. ఇది మా విజయం కాదు....చిత్ర పరిశ్రమ విజయం’’ అన్నారు. (చదవండి: ‘అఖండ’ ఫైట్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు) అంతేకాక ‘‘ఈ సినిమాతో చలనచిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చింది. మంచి సినిమాలను ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు సినిమాను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు’’ అన్నారు బాలకృష్ణ. చదవండి: అన్‌స్టాపబుల్ షోలో సూపర్ స్టార్ సందడి.. ఫొటోలు వైరల్ -
సింహాచలం ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు
-
భూముల అక్రమాల పై 12 చోట్ల క్షేత్రస్థాయి లో విచారణ
-
Simhachalam Temple: అప్పన్నకే శఠగోపం
సాక్షి, అమరావతి: సెంటు స్థలం అటు ఇటు అయితే గొడవలు పడటం.. కోర్టులకు వెళ్తుండటం చూస్తున్నాం. అలాంటిది ఒక ఎకరా కాదు.. రెండెకరాలు కాదు.. ఏకంగా రూ.10 వేల కోట్లకు పైబడి విలువ చేసే 748 ఎకరాల భూములు మావి కాదంటూ దేవదాయ శాఖ పరులకు వదిలేసింది. ఇవి విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూములు. స్వామి వారి భూములను జాగ్రత్తగా కాపాడాల్సింది పోయి.. ఎవరూ అడక్కపోయినా, ఇవి మావి కావంటూ ఇతరులకు ధారాదత్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016లో ఈ బాగోతం చోటుచేసుకుంది. అప్పటి ప్రభుత్వ పెద్దలు తెర వెనుక వ్యవహారం నడపడంతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన దేవాలయ భూముల, ఆస్తుల పరిరక్షణలో భాగంగా దేవుడి భూములకు జియో ఫెన్సింగ్ (ఆన్లైన్ మ్యాప్‌లో సరిహద్దుల గుర్తింపు) చర్యలకు ఉపక్రమించిన క్రమంలో ఈ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒక్క రోజులో ఒక్క కలం పోటుతో.. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పేరిట 11,282.26 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను అప్పటి విజయనగరం మహారాజులు రాసిచ్చారు. ప్రస్తుత విశాఖపట్నం నగరానికి సమీపంలో ఉండే అడవి వరం, వెంకటాపురం, వేపగుంట, చీమాలపల్లి, పురుషోత్తపురం గ్రామాల పరిధిలో ఈ భూములు ఉన్నాయి. 1967–68లో ఈ భూముల వ్యవహారంలో ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ వివాదం కొనసాగినప్పటికీ, 1977, 78లో అప్పటి ఇనామ్ తహాసీల్దార్ ఈ భూములన్నీ స్వామి వారికే చెందుతాయని డిక్లరేషన్ జారీ చేశారు. ఎస్టేట్ ఎబాలిష్ యాక్ట్ ప్రకారం అందులో కొంత భూమిని మాత్రం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 9,069.22 ఎకరాలకు రెవిన్యూ అధికారులు దేవుడి పేరుతో రైతు వారీ పట్టా జారీ చేశారు. ఈ క్రమంలో 2016లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దల చూపు ఈ భూములపై పడింది. ఎలాగైనా సరే కొంత భూమిని అయిన వాళ్లకు కట్టబెట్టాలని తెరవెనుక మంత్రాంగం నడిపారు. ఇందుకు దేవదాయ శాఖను పావుగా వినియోగించుకున్నారు. ఏ ఒక్కరి నుంచి వినతి కానీ, ఫిర్యాదు కానీ లేకుండానే విశాఖపట్నం నగరానికి అనుకొని ఉండే 748.07 ఎకరాల దేవుడి భూములను ఒకే రోజు దేవదాయ శాఖ ఆస్తుల జాబితాల నుంచి తొలగించేశారు. ఈ భూములు స్వామి వారివి కావని, వేరే ఎవరివోనంటూ ప్రభుత్వం 2016 డిసెంబరు 14వ తేదీన అధికారికంగా ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో సింహాచలం ఆలయ ఆస్తుల జాబితా నుంచి పలు భూములను తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వు ఎవరూ అడగక్క పోయినా.. అడవివరం, వేపగంట్ల, చీమాలపల్లి రెవిన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 291 సర్వే నంబర్లకు సంబంధించి కొన్నింటిలో మొత్తం భూమిని, మరికొన్నింటిలో కొంత భాగం భూమిని స్వామి వారి ఆస్తుల జాబితాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వం తొలగించింది. ఇందులో 306 ఎకరాల భూమికి సంబంధించి కుంభకోణం జరిగిందని ఇప్పటికే అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలిసింది. లోతైన విచారణ జరిగితే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి రాష్ట్రంలో పలు చోట్ల సామాన్య ప్రజల వ్యవసాయ భూములు తప్పుగా నమోదు కావడంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ తరహా బాధిత రైతులు అధికారులకు అర్జీల మీద అర్జీలు పెట్టుకుంటూ ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం ఉండేది కాదు. అలాంటిది సింహాచలం శ్రీ వరహా లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల విషయంలో బాధితులమంటూ ఎవరూ స్వయంగా ప్రభుత్వానికి ఎలాంటి వినతులు పెట్టుకోలేదు. అయినప్పటికీ అప్పటి ప్రభుత్వం తనంతట తానుగా ఆ భూములను ఆలయ రికార్డుల నుంచి తొలగించేసింది. ఈ పరిణామంతో కుంభకోణం చోటుచేసుకుందని ప్రత్యేకించి చెప్పక్కరలేదని స్థానికులు అంటున్నారు. ఏకపక్ష నిర్ణయం.. నిబంధనలు బేఖాతరు ఒకే విడత ఇంత పెద్ద మొత్తంలో భూములను ఆలయ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ జరిగిన సమయంలో విశాఖపట్నం జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టులో ఉన్న ముగ్గురు అధికారులు ఒక్క ఏడాదిలోనే వెంట వెంటనే బదిలీ అవ్వడం గమనార్హం. తద్వారా ఈ తతంగం మొత్తంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత పుష్పవర్ధన్‌ను బదిలీ చేశారు. ఆ తర్వాత ఎన్వీఎస్ఎన్ మూర్తిని నియమించారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయనను కూడా బదిలీ చేసి సుజాత అనే మరో అధికారిని జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా నియమించారు. ఓ ఆలయ ఆస్తుల జాబితా నుంచి నిర్ణీత కారణాలతో ఏవైనా భూములను తొలగించాలంటే దేవదాయ శాఖ చట్టంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఆలయ ఆస్తుల జాబితాలో పేర్కొన్న భూములపై ఎవరన్నా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినతిపత్రం పెట్టుకుంటే ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మొదట ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)కు పంపాల్సి ఉంటుంది. ఆ ప్రతిపాదనలపై ఏసీ సంతృప్తి చెందిన పక్షంలో ఆ వివరాలతో పబ్లిక్ నోటీసు జారీ చేస్తారు. సంబంధిత ఆలయ ప్రాగంణం, సంబంధిత భూముల గ్రామ కార్యాలయం, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం సహా మొత్తం ఐదు బహిరంగ ప్రదేశాల్లో ఆ పబ్లిక్ నోటీసును ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశమివ్వాలి. ఆ తర్వాత అంతా సక్రమంగా ఉందని నిర్ధారించుకుని ఆ భూములను ఆలయ ఆస్తుల జాబితా నుంచి తొలగించాలి. ఆస్తుల జాబితా రిజస్టర్‌లో తొలగించిన భూముల వివరాల వద్ద సంబంధిత జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంతకం కూడా చేయాల్సి ఉంటుంది. 2010 ఆస్తుల రిజిస్టర్‌ను సాకుగా చూపి.. ఆలయ ఆస్తుల జాబితా నుంచి భూముల తొలగింపునకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చూపిన కారణం ఏమిటంటే.. ఆ భూములను తప్పుగా నమోదు చేశారని చెప్పారు. సర్వే నంబర్ల వారీగా ‘ఇనాం బి. రిజిస్టర్ నందు పట్టా నెం.2లో ఇతర ఇనాం భూమిగా నమోదు చేయబడి దేవస్థానం టైటిల్‌డీడ్ నంబరు 3145 నందు నమోదు కాలేదు’ అని పేర్కొన్నారు. మరికొన్ని భూములను గతంలో వేరే వారికి కేటాయించారని, విక్రయించారని చూపుతూ ఈ 748 ఎకరాలను జాబితా నుంచి తొలగించారు. 2004కు ముందు వివిధ ప్రభుత్వ, ప్రజా అవసరాలకు విశాఖపట్నం జిల్లాలో సింహాచలం శ్రీవరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ భూములను చాలా సందర్భాలలో అప్పటి ప్రభుత్వాలు కేటాయింపులు చేశాయి. మధ్య తరగతి ప్రజల ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డుకు కొంత భూమిని నిర్ణీత ధరకు బదలాయించారు. ప్రస్తుత ఎల్జీ పాలిమర్స్ వంటి సంస్థలు రావడానికి పూర్వమే భూములను కేటాయించారు. 2000–03 మధ్యలో ఆలయ భూములను అక్రమించుకున్న వారికి నిర్ణీత ధర ప్రకారం అక్రమణల క్రమబద్దీకరణ చేసి ఎల్‌ఆర్‌సీ సర్టిఫికెట్లను జారీ చేశారు. అవన్నీ 2004కు ముందు జరిగిన పరిణామాలు. ఆలయ భూములపై హైకోర్టు తీర్పు తర్వాత ఆ భూముల అమ్మకం, కేటాయింపులపై ఆంక్షలు అమలులో ఉన్నాయి. కాగా, 2010లో సింహాచలం ఆలయ ఆస్తుల రిజస్టర్‌లో అప్పటి వరకు ఆలయానికి ఉండే ఆస్తులను నమోదు చేసి, మిగిలినవి తొలగిస్తూ మార్పులు చేర్పులు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ 2016లో టీడీపీ ప్రభుత్వం ఆలయ ఆస్తుల జాబితా నుంచి 748 ఎకరాలను తొలగిస్తున్నట్టు రికార్డులో పేర్కొంది. ఆలయ ఆస్తుల కోసం ప్రత్యేక రిజిస్టర్ ప్రతి ఆలయానికి ఆ ఆలయం పేరిట ఉన్న భూములు, స్వామి వారి నగలు, నగదు రూపంలో బ్యాంకులో ఉండే డిపాజిట్ వంటి వివరాలతో ప్రత్యేక రిజిస్టర్ ఉంటుంది. 1966 దేవదాయ శాఖ చట్టం ప్రకారం దీనిని 25వ నంబరు రిజస్టర్గా పిలిచేవారు. 1966–88 మధ్య ఈ రిజస్టర్‌ను 38వ నంబరుగా మార్చారు. 1987 తర్వాత 43వ నంబరు రిజస్టర్గా పిలుస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు ఒకసారి స్వామి వారి ఆస్తుల వివరాల్లో చోటు చేసుకునే మార్పు చేర్పులను ఆ రిజస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. సమగ్రంగా విచారణ సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ ఆస్తుల జాబితా నుంచి 2016లో ఒకేసారి 748 ఎకరాలు తొలగించిన విషయం మా పరిశీలనకు కూడా వచ్చింది. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఈ అంశంపై శాఖ కార్యదర్శి వాణీమోహన్ ఆధ్వర్యంలో కమిషనర్ కార్యాలయంలో ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాం. సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించేందుకు తగిన చర్యలు చేపట్టాం. – అర్జునరావు, దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్. -
అప్పన్న బంగారం కేసులో కీలక మలుపు
సాక్షి, నెల్లూరు: అప్పన్న బంగారం పేరిట మహిళను మోసగించిన ఘటనలో ప్రధాన నిందితురాలు కె.హైమావతి పోలీసు కస్టడీ సోమవారంతో ముగిసింది. పోలీసులు ఆమె వద్ద నుంచి రూ.30 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సీసీఎస్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్‌సైదా కేసు పూర్వాపరాలను వెల్లడించారు. విశాఖపట్నం పెందుర్తి ప్రాంతానికి చెందిన కె.హైమావతి అలియాస్ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. సూళ్లూరుపేటకు చెందిన ఎం.శ్రావణితో పరిచయం ఏర్పడింది. ఆలయంలో బంగారం వేలం వేస్తున్నారంటూ మాయమాటలు చెప్పి హైమావతి ఆమెను నమ్మించి రూ. 38 లక్షలు ఖాతాలో జమ చేయించుకుంది. శ్రావణి బిల్లులు కోరగా నిందితురాలు సింహాచలం ఆలయ ఈవో ఫోర్జరీ సంతకాలతో బిల్లులను పంపింది. నగదు తీసుకున్న నిందితురాలు బంగారం ఇవ్వకుండా ఆమెను మోసగించడంతో బాధితురాలు సూళ్లూరుపేట పోలీసులకు, సింహాచలం ఆలయ అధికారులకు ఈ–మెయిల్ ద్వారానూ ఫిర్యాదు చేసింది. మెయిల్లో పంపిన బిల్లులు నకిలీవని ఆలయ అధికారులు గుర్తించి గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు విచారించిన పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరిని ఇటీవల అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితురాలు విశాఖపట్నం జైలులో ఉంది. నగదు స్వాధీనం : పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. హైమావతిని పిటీ వారెంట్‌పై నెల్లూరుకు తీసుకువచ్చారు. సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ విధించడంతో జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. ఆమె వద్ద నుంచి రూ.11.35 లక్షల నగదు, 280 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసు కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను కోర్టులో హాజరుపరిచినట్లు ఇన్స్పెక్టర్ బాజీజాన్‌సైదా తెలిపారు. -
‘అప్పన్న బంగారం’కేసు: తెరపైకి కొత్త ముఖాలు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): సింహాద్రి అప్పన్న బంగారం విక్రయం పేరిట టోకరా చేసిన కేసులో కొత్త ముఖాలు వెలుగుచూశాయి. నెల్లూరు వాసి శ్రావణిని మోసం చేసిన ఈ వ్యవహారంలో ఇంత వరకు కోన హైమావతి, ఆమె తమ్ముళ్లే నిందితులని అంతా భావించారు. అయితే ఈ కేసులో కొత్తగా మరో ఇద్దరు తెరపైకి వచ్చారు. వీరిలో హైమావతి కుమారుడు నాగేంద్ర తేజ కాగా.. మరో వ్యక్తి నకిలీ బిల్లులు తయారు చేసిన రాంభుక్త వాసు. ముగ్గరు నిందితులను గోపాలపట్నం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో డీసీపీ సురేష్‌బాబు ఈ కేసు వివరాలు వెల్లడించారు. (చదవండి: విశాఖలో విషాదం, కుటుంబం ఆత్మహత్య) నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు చెందిన మద్దూరి శ్రావణి.. రూ1.44 కోట్లకు వేలంలో బంగారాన్ని కొనుగోలు చేశానని, కానీ ఇంతవరకు పంపలేదంటూ సింహాచలం దేవస్థానానికి ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా రూ.1.30 కోట్లు, రూ.14 లక్షలతో ఉన్న బిల్లులను కూడా జత చేసి పంపింది. దీంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. దేవస్థానం అధికారులు ఈ బిల్లులు నకిలీవని, అప్పటి ఈవో భ్రమరాంబ సంతకాన్ని ఫోర్జరీ చేశారని గుర్తించి గోపాలపట్నం పోలీస్ సేŠట్షన్లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో శ్రావణి కూడా తనకు జరిగిన మోసంపై సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు మోసం చేసే విధానాన్ని బయటపెట్టారు. ఈ వ్యవహారంలో రూ.38,20,800 చేతులు మారినట్టు పోలీసులు గుర్తించారు. (చదవండి: అప్పన్న బంగారం పేరిట రూ.1.44 కోట్లకు టోకరా) ఇదీ అసలు కథ ఈ కేసులో ప్రధాన నిందితురాలు కోన హైమావతి అలియాస్ డెక్క హైమావతి సింహాచలంలో అల్లిక దారాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ సింహాచలం క్షేత్రానికి వచ్చే సమయంలో శ్రావణికి హైమావతి పరిచయమైంది. దీంతో ఇటీవల దేవస్థానంలో బంగారం వేలం వేస్తారని, అయితే కరోనా నేపథ్యంలో ఓపెన్ ఆంక్షన్ వేయడం లేదని, తనకు తెలిసిన బంధువులు ఇక్కడ ఉద్యోగులుగా ఉన్నారని, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని హైమావతి నమ్మబలికింది. దాని విలువ రూ.1.44 కోట్లు ఉంటుందని చెప్పింది. ఈ మేరకు బిల్లులు కావాలని శ్రావణి కోరగా.. రామభుక్త వాసు సహకారంతో దొంగ బిల్లులు సృష్టించి.. అప్పటి ఈవో భ్రమరాంబ సంతాకాన్ని ఫోర్జరీ చేసి వాట్సప్‌లో పంపారు. అది నమ్మిన శ్రావణి.. హైమావతి కుమారుడు డెక్క నాగేంద్ర తేజ అకౌంట్‌కు రూ.7.6 లక్షలు, హైమావతి బ్యాంకు ఖాతాకు రూ.30,60,800 బదిలీ చేసింది. ఈ నగదుతో హైమావతి తనకున్న రూ.15లక్షల అప్పులు తీర్చింది. ఓ డ్యూక్ బైక్ కొన్నారు. దుకాణం ఏర్పాటు కోసం అడ్వాన్స్ కింద సుమారు రూ.2 లక్షలు నగదు చెల్లించినట్టు గుర్తించామని డీసీపీ తెలిపారు. అంతే కాకుండా బంగారం, వెండి ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు కొనుగోలు చేశారన్నారు. ఈ మొత్తాన్ని సూళ్లూరుపేట పోలీసులు రికవరీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. రామభుక్త వాసు నకిలీ నగదు బిల్లులు తయారు చేసి, వాట్సప్ ద్వారా పంపించడం వంటి పనులు చేశాడు. ఫోర్జరీ చేసిన ఈవో సంతకాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామని డీసీపీ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపించామని, తరువాత జ్యూడీషియల్ కస్టడీకి తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంలో దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న హైమావతి తమ్ముళ్లు గోపా మధు, గోపా శేఖర్ల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే అరెస్ట్ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఏసీపీ శ్రావన్‌కుమార్, సీఐ మళ్ల అప్పారావు, క్రైమ్ సీఐ వెంకునాయుడు, ఎస్ఐలు రఘురామ్, సునీత, కంచరపాలెం క్రైమ్ ఎస్ఐ సూరిబాబు, ఎంవీపీ క్రైమ్ ఎస్ఐ విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు. -
సింహాచలంపై పచ్చకుట్ర
-
విషాదం: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆపై..
అన్యోన్యంగా ఉన్న జంటను చూసి విధికి కన్నుకుట్టిందేమో.. పగబట్టి మృత్యుపాశం విసిరింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల్లోనే ఆ మాతృమూర్తిని దూరం చేసింది. తనకు తోడునీడగా ఉంటుందనుకున్న భార్య అర్ధంతరంగా తనువు చాలించడంతో మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన కుటుంబసభ్యులు, బంధువులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. తమ బిడ్డల భవిష్యత్ బంగారుమయం కావాలని ఆశపడితే ఇలా జరగడం తట్టుకోలేకపోతున్నామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అన్యోన్యంగా సాగిన వారి ప్రేమకు, దాంపత్య జీవితానికి ప్రతిరూపంగా ఒక బిడ్డ కూడా పుట్టాడు. ఇక్కడే ఆ దంపతుల సంతోషంపై విధి కన్నెర్ర చేసింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రెండు రోజుల్లోనే ఆ మాతృమూర్తి ఈ లోకాన్ని వీడిపోయింది. తనకు తోడునీడగా ఉంటుందనుకున్న భార్య అర్ధంతరంగా తనువు చాలించడంతో మనస్తాపానికి గురైన భర్త కూడా ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు. ఈ వరుస ఘటనలతో ఎనిమిది రోజుల పసికందు తల్లిదండ్రులు లేని అనాథగా మిగిలాడు. హృదయ విదారకరమైన ఈ సంఘటన సింహగిరిపై ఉన్న గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది. ఇటీవల జన్మించిన శిశువుతో శ్రావణ్‌కుమార్ (ఫైల్) మృతుడు శ్రావణ్‌కుమార్ సోదరుడు వరహానరసింహం గోపాలపట్నం పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం... సింహగిరిపై ఉన్న గిరిజన గ్రామంలో ఇరుగుపొరుగు ఇళ్లళ్లో ఉంటున్న జలుమూరి శ్రావణ్‌కుమార్, అంబిక (ఇద్దరి వయస్సు ఇరవై ఏళ్లు) ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వీరిరువురూ వివాహం చేసుకున్నారు. అంబికకి అప్పటికే ఫిట్స్ వ్యాధి ఉంది. అనంతరం గర్భం దాల్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న ఫిట్స్ రావడంతో 9 నెలల గర్భిణి అయిన అంబికను నగరంలోని కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకి శస్త్రచికిత్స చేయగా పండంటి మగబిడ్డని ప్రసవించింది. ప్రసవ సమయంలో కూడా తీవ్రంగా ఫిట్స్ వచ్చింది. దీంతో రెండు రోజుల తర్వాత ఈ నెల 8న బుధవారం ఆమె మృతిచెందింది. (చెత్తకుప్ప పక్కనే అందమైన అమ్మాయిని చూసి.. ) భార్య మృతిని తట్టుకోలేని శ్రావణ్‌కుమర్ అప్పటి నుంచి మనస్తాపానికి గురయ్యాడు. ఈ తరుణంలోనే ఆదివారం సాయంత్రం సింహగిరిపై గిరిజన కాలనీకి సమీపంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రావణ్‌కుమార్ మృతి విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు గోపాలపట్నం సీఐ మళ్ల అప్పారావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కళ్ల ఎదుటే అన్యోన్యంగా ఉండే శ్రావణ్‌కుమార్, అంబిక మృతితో సింహగిరిపై ఉన్న గిరిజన గ్రామంలో విషాదం నెలకొంది. -
ఆ ఐదు గ్రామాలూ ఖాళీ
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. బస్సుల్లో వీరిని సింహాచలంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు. సింహాచలం కొండ దిగువ పాత గోశాల దగ్గర నుంచి మార్కెట్ కూడలి వరకు ఉన్న పలు ప్రైవేటు కల్యాణ మండపాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. వెంకటాపురంలో ఉన్న 1250 ఇళ్ల నుంచి సుమారు 8 వేల మందిని, నందమూరినగర్‌లో ఉన్న 600 కుటుంబాలకు చెందిన 2,250 మందిని, కంపరపాలెంలోని 250 ఇళ్ల నుంచి 1200 మందిని, పద్మనాభనగర్‌లో 500 కుటుంబాల నుంచి 2,500 మందిని, ఎస్సీ, బీసీ కాలనీలో 480 ఇళ్ల నుంచి 2 వేల మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. వారందరికీ అక్కడే భోజన ఏర్పాట్లు చేసి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. పూర్తిగా ప్రమాదం లేదని నిర్ధారించిన తరువాతే ప్రజలను గ్రామాలకు వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, చినగదిలి తహసీల్దార్ పునరావాస కేంద్రాల వద్దకు వెళ్లి బాధితులను పలకరించారు. కాగా, గురువారం అర్ధరాత్రి కూడా వెంకటాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
‘వారిది తప్ప.. అందరి మద్దతు ఉంది’
సాక్షి, సింహాచలం: మూడు ప్రాంతాల్లో అభివృద్ధి వికేంద్రీకరణ తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. మంగళవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుతో కలిసి ఆయన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. రెండు రాజధానులు అనే ప్రక్రియ బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడిన 29 గ్రామాల ప్రజలు మినహా ప్రజలందరూ మూడు రాజధానులకు మద్దతుగా ఉన్నారని ఆయన తెలిపారు. పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నాం.. ఇళ్ల స్థలాల పంపిణీ ద్వారా పేదలకు ఆస్తి ఇవ్వబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే భారీస్థాయిలో ఇళ్ల పట్టాలివ్వడం దేశంలోనే ప్రథమం అని తెలిపారు. 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ ప్రపంచ రికార్డు అని పేర్కొన్నారు. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తుంటే టీడీపీకి ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. టీడీపీ నేతల విమర్శలు దారుణమన్నారు. పేదలకి ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వం కన్నీళ్లు తుడిచే ప్రభుత్వమే కానీ.. కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వం కాదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో నిబంధనలకి విరుద్దంగా వ్యవహరించటం లేదని సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు తమ వైఫల్యాలను ప్రభుత్వం రుద్దాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా..? విచక్షణాధికారాల పేరుతో మండలి చైర్మన్ నిబంధనలకి విరుద్దంగా వ్యవహరిస్తే ఎలా చెల్లుబాటు అవుతుందని సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలంటే తప్పనిసరిగా ఓటింగ్ జరగాలన్నారు. అలా కాకుండా బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం కుదరదన్నారు. ఈ నిబంధనలు తెలియకపోతే యనమల మరోసారి రూల్స్ బుక్ చదువుకోవాలని సూచించారు. ఉద్యోగులను బెదిరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తప్పు చేయని ఉద్యోగులందరికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సింహాచలంలో ఎస్టీ కమిషన్ పర్యటన రాష్ట్ర ఎస్టీ కమిషన్ కమిటీ సభ్యులు మంగళవారం సింహాచలం కొండపై పర్యటించారు. సింహాచలంపై ఉద్యోగాల రిజర్వేషన్ అమలుపై ఏపీ ఎస్టీ శాసన సభా కమిటీ చైర్మన్ బాలరాజు, సభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ ఆరా తీశారు. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు, రిజర్వేషన్ల అమలుపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలో రోస్టర్ విధానంలో ఎస్టీ రిజర్వేషన్ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
సింహాచలం ఆలయంలో భోగి వేడుకలు
సాక్షి, సింహాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహ నరసింహ దేవస్థానం ప్రాంగణంలో అత్యంత వైభవంగా భోగి పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి శాస్త్రోత్కంగా పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించారు. చెడు గుణాలు ప్రాలదోలి... మంచి గుణాలను పొందాలని ఆకాంక్షించారు. అనంతరం స్వామిజీ.. వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. స్వాత్మానంద్రేద్ర స్వామికి ఆలయ ఈవో వెంకటేశ్వరరావు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు స్వామికి వరాహ నరసింహ స్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేసి ఆశీస్సులు పొందారు. -
సింహాచలంలో తెలంగాణవాసి ఆత్మహత్య
సాక్షి, సింహాచలం(పెందుర్తి): తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి సింహాచలంలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగుచూసింది. గోపాలపట్నం పోలీసులు అందించిన వివరాల ప్రకారం... సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఎగువ వైపు ఉన్న దేవస్థానం తోటల్లో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు కొంతమంది వెళ్లి చూశారు. చెట్టుకు వేలాడుతూ ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో వెంటనే గోపాలపట్నం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ రమణయ్య, ఎస్ఐ సత్యనారాయణ వివరాలు సేకరించారు. మృతుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొడిమెల మండలం పూడూరుకి చెందిన పున్నం ఆదయ్య(35) అలియాస్ అరుణ్గా గుర్తించి కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. రజక వృత్తి చేసుకుని జీవిస్తున్న ఆదయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, మానసిక స్థితి సరిగా లేకపోవడంతో 15 రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు వెల్లడించారు. అనంతరం వారణాసి, విజయవాడలో తిరిగినట్లు జేబులో టిక్కెట్లు ఉన్నాయని, ఈ నెల 6న సింహాచలం వచ్చినట్లు సిటీ బస్సు టికెట్ ఉందని తెలిపారు. రెండు రోజుల కిందటే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు. -
అప్పన్నను దర్శించుకున్న శారద పీఠాధిపతి
సాక్షి, విశాఖపట్నం : శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి , స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలు గురువారం సింహాచలంలోని వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్వర్ రావు పీఠాధిపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిలిద్దరు కలిసి అర్చకుల సమక్షంలో నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో 57 రోజుల పర్యటన చేపట్టనున్నట్లు స్మాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. అనంతరం దేవి శరన్ననవరాత్రులకు సంబంధించిన ఉత్సవాల బ్రౌచర్‌ను స్వరూపానందేంద్ర స్వామి విడుదల చేశారు. -
అప్పన్న ఆదాయం.. పక్కాగా వ్యయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలం శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించే విరాళాలు, కానుకలు, ఆలయ ఆదాయం ఇకపై దుర్వినియోగం కాకుండా పక్కాగా చర్యలు తీసుకుంటామని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వరరావు వెల్లడించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెంచేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానం ఆదాయం పెద్దమొత్తంలో దుర్వినియోగం అయిందని, వివరాల్లేని సర్దుబాటు చెల్లింపులు, పక్కా రికార్డుల్లేని చెల్లింపులు, బిల్లులకు మించి అదనపు చెల్లింపులు.. మొత్తంగా 375 అంశాలపై ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రూ.61 కోట్ల 32 లక్షల 87వేల చెల్లింపులకు ఆడిట్ శాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా 375 అంశాల్లో(కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి) చెల్లింపులు జరిగాయని తేల్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 105 అంశాల్లో కోట్లకు కోట్లు అదనపు బిల్లులుచెల్లించారని మొత్తంగా రూ.2 కోట్ల 9 లక్షలు సర్దుబాటు చెల్లింపులకు అసలు బిల్లులే లేవని పేర్కొంది. రూ.27 కోట్ల 42 లక్షల చెల్లింపులకు రికార్డుల్లేవని, కొన్ని బిల్లులకు రూ. 29 కోట్ల మేర అదనపు చెల్లింపులు చేశారని.. ఇలా అడ్డగోలుగా లెక్క లేకుండా కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసినట్లు సాక్షాత్తు ఆడిట్ శాఖ నిగ్గుతేల్చిన విషయం తెలిసిందే. ఈ వివరాలతో ‘టీడీపీ హయాంలో ప్రసాదంలా నిధుల పందేరం’ శీర్షికన శనివారం సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై సింహాచలం ఈవో వెంకటేశ్వరరావు స్పందించారు. ఆడిట్ అభ్యంతరాలపై వివరాలిస్తామని, నిధుల దుర్వినియోగం అని విచారణలో తేలితే బాధ్యులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక నిధుల వినియోగాన్ని పక్కాగా చేస్తామని, ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా చేస్తామని చెప్పారు. సుమారు రూ.6 కోట్ల 75 లక్షల బకాయిలు ఇంకా కాంట్రాక్టర్లు, షాపుల యజమానుల నుంచి రావాల్సి ఉందని ఈవో తెలిపారు. మొండిబకాయిలన్నీ వసూలు చేస్తామని, ఇది అత్యంత ప్రాధాన్య అంశంగా తీసుకుంటామని చెప్పారు. ఇక దేవస్థానంలో అంతర్గత విజిలెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు దేవాదాయ, ధర్మాదాయ ఉన్నతాధికారుల అనుమతి తీసుకుంటామని వెల్లడించారు. బ్లాక్ లిస్టులో ఉన్న వ్యాపారస్తులు, కాంట్రాక్టర్ల బకాయిలపై దృష్టిసారిస్తామని, వీలైనంత త్వరగా రావాల్సిన బకాయిలను వసూలు చేస్తామని చెప్పారు. అనవసర వ్యయాలు తగ్గించి దేవస్థానం ఆదాయం వృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని వెంకటేశ్వరరావు స్పష్టంచేశారు. -
ఐఏఎస్ అంతు చూశాడు
అతని సంకల్పం ముందు అంధత్వం ఓడింది. పేదరికం తలవంచింది. పుట్టుకతోనే అంధుడు అయినా, అనుకున్నది ఎందుకు సాధించలేననే దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. విజయం సాధించాడు. అతనే తూర్పు గోదావరి జిల్లామలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కట్టా సింహాచలం. సింహాచలం 2019 ఐఏఎస్ బ్యాచ్‌లో 457వ ర్యాంకు సాధించి ట్రై నీ కలెక్టర్‌గా ముస్సోరీలో శిక్షణకు ఎంపికయ్యారు. గూడపల్లి గ్రామంలోని కట్టా వాలి, వెంకట నర్సమ్మలకు ఆయన జన్మించారు. ఆ దంపతులకు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాంబాబు, సింహాచలం.. నలుగురు కుమారులు, ఒక కుమార్తె దుర్గ . కుటుంబ భారం మోసేందుకు తండ్రి వాలి పాత గోని సంచుల వ్యాపారం చేసేవారు. అలానే సంతానాన్ని పెంచి పెద్ద చేశారు. నాలుగో సంతానం అయిన సింహాచలం పుట్టుక తోనే అంధుడు. తండ్రికి కుమారుడిని చదివించే స్తోమత లేదు. ఆ పేదరికంతోనే సింహాచలం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బ్రెయిలీ స్కూల్లో చదువుతూ మలికిపురం ఎంవీఎన్ జేఎస్ అండ్ ఆర్వీఆర్ డిగ్రీ కళాశాలలో దాతల సహకారంతో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. అండ కోల్పోయిన ఇంటికి తాను అండగా ఉండాలని అనుకున్నాడు. ఐఏఎస్ కావాలన్న దృఢ సంకల్పాన్ని తన మనస్సులో గట్టిగా నాటుకున్నాడు. ఆ క్రమంలోనే బీఈడీ కూడా చదివి తిరుపతి కేంద్రీయ విద్యాలయంలో టీచరు ఉద్యోగం లో చేరారు సింహాచలం. 2014 సంవత్సరంలో సివిల్ సర్వీస్ పరీక్షలు రాశారు. 1212 ర్యాంకు సాధించారు. కలెక్టర్ అయ్యే అవకాశం కొద్దిలో మిస్ అయింది. అయినా నిరాశ చెందలేదు. 2016లో ఐఆర్ఎస్లో రాణించి ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌గా ఢిల్లీ, హైదరాబాద్‌లలో పని చేస్తూనే తన ఆశయం అయిన ఐఏఎస్‌కు ప్రిపేర్ అయ్యారు. ఎట్టకేలకు 2019 ఐఏఎస్ ఫలితాల్లో ర్యాంకు సాధించారు. ప్రసుతం సింహాచలం ముస్సోరిలో ట్రై నీ కలెక్టర్‌గా శిక్షణ తీసుకుంటున్నారు. బుధవారం తన స్వస్థలం గూడపల్లి వచ్చిన సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడారు. – తోట సత్యనారాయణ, సాక్షిమలికిపురం, తూ.గో.జిల్లా అవయవ దానాన్నిప్రోత్సహించాలి ‘‘అవయవ లోపం అన్నది మనలోని ప్రతిభ వెలికి వచ్చేందుకు అడ్డంకి కాదు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అలాగే ప్రతి ఒక్కరూ అవయవ దానాన్ని ప్రోత్సహించాలి. ఈరోజు నేను సాధించిన ఈ ఐఏఎస్ ఘనత కంటే అవయవ దానం చేసిన వారే చాలా గొప్పవారని నేను భావిస్తాను.’’– కట్టా సింహాచలం -
బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
సింహాచలం: అడవివరంలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. హుకుంపేటకు చెందిన ఎన్.కాంతమ్మ తన కుమారుడు అభిరాం(2)తో కలిసి సోమవారం ఆర్టీసీ బస్సులో విశాఖపట్నం వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ఆమెను ఇక్కడ కలిశాడు. ముగ్గురూ ఆటోలో సింహాచలం వెళ్లారు. దర్శనం అనంతరం సాయంత్రం కొండ దిగువకు వచ్చారు. అయితే పిల్లాడితో సహా శేఖర్ కనిపించకుండాపోయాడు. దీంతో కాంతమ్మ తనకు కుమారుడిని కిడ్నాప్ చేసేశారంటూ గోపాలపట్నం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసును నమోదుచేసుకున్న పోలీసులు... కిడ్నాపర్ శేఖర్‌ను మొబైల్ కాల్ ట్రాకింగ్ ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తిరిగి తల్లి కాంతమ్మకు అప్పగించారు. భర్తతో కాంతమ్మకు విబేధాలున్నాయని, ఈ నేపథ్యంలో ఆమెను నమ్మించి సింహాచలం తీసుకువచ్చిన శేఖర్.. ఆమె బాత్రూంలో ఉండగా బాలుడ్ని తీసుకొని వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. -
టీడీపీ మహిళా నేత దౌర్జన్యం
సాక్షి, విశాఖ : అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం కోల్పోయినా ఆ పార్టీ నేతల దౌర్జన్యాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు, పార్టీ కార్యకర్తలు అవకాశం దొరికినప్పుడల్లా తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అండదండలతో విశాఖ జిల్లాలో టీడీపీ మహిళానేత, డ్వాక్రా సంఘనేతపై దాడి చేయడం తీవ్ర అలజడి రేపుతోంది. విశాఖ- పాతనగరంలో డ్వాక్రా గ్రూపులకు దేవుడమ్మ నాయకురాలు. ఆమె గ్రూపులోని సభ్యులను టీడీపీకి చెందిన కొల్లి సింహాచలం అనే మహిళ బెదిరించి తమవైపుకు తిప్పుకుందన్న ఆరోపణలున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన తనను అనుచరులతో కొట్టించిందని ఆరోపించింది. ముఖం,వీపుపై పిడిగుద్దులు కొట్టారని,.ఈ విషయాన్ని విశాఖ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. అయితే ఇప్పటి వరకూ సింహాచలంపై ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు. సింహాచలం నుంచి దేవుడమ్మకు ప్రాణహాని ఉందని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో సింహాచలం దాడులు చేస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవుడమ్మపై దౌర్జన్యం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
సాక్షి, సింహాచలం(విశాఖపట్టణం) : దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. దైవదర్శనానికి వస్తే బండరాయి రూపంలో మృత్యువు కాటేయడంతో తరలిరాని లోకాలకు ఓ యువతి వెళ్లిపోయింది. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటన సింహగిరి మెట్ల మార్గంలో బుధవారం సంభవించింది. వివరాల్లోకి వెళ్తే... శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుందామని సబ్బవరం మండలం పెదనాయుడుపాలెం గ్రామానికి చెందిన ఆదిరెడ్డి భవాని(28) బుధవారం మెట్లమార్గంలో నడిచి బయలుదేరింది. అదే సమయంలో మెట్లమార్గం విస్తరణ పనుల్లో భాగంగా పొక్లెయిన్ సాయంతో కొండప్రాంతాన్ని చదును చేస్తున్నారు. సరిగ్గా మార్గ మధ్యలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చేసరికి ఓ బండరాయి జారివచ్చి భవానీతోపాటు కె.కోటపాడు మండలం పొడుగుపాలెం గ్రామానికి చెందిన సూరెడ్డి జగదీశ్వరికి తగిలింది. వీరిలో తీవ్ర గాయాలపాలైన భవాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. జగదీశ్వరి గాయాలతో చికిత్స పొందుతోంది. పరిహారం చెల్లించాలని డిమాండ్ ఆరిలోవ(విశాఖ తూర్పు): సింహాచలం అప్పన్నను దర్శించుకోవడానికి వస్తూ మెట్ల మార్గంలో బండరాయి తగలడంతో గాయాలపాలైన ఆదిరెడ్డి భవాని(28) హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అప్పటికే స్వగ్రామం నుంచి ఆస్పత్రికి చేరుకొన్న భవాని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకొన్న ఆర్డీవో తేజ్ భరత్, సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రరావు, రూరల్ తహసీల్దారు ఆర్.నర్సింహమూర్తి ఆస్పత్రి వద్దకు చేరుకొన్నారు. భవానీ మృతదేహాన్ని పరిశీలించారు. చికిత్స పొందుతున్న జగదీశ్వరి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్దకు చేరుకొన్న భవాని బంధువులు అధికారులను నిలదీశారు. మెట్ల మార్గంలో పనులు జరిపిస్తూ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, నష్టపరిహారం చెల్లించా లని డిమాండ్ చేశారు. దీనిపై ఆర్డీవో తేజ్‌భరత్, ఈవో కె.రామచంద్రరావు, మంత్రి అవంతి శ్రీనివాసరావు సోదరుడు మహేష్ చర్చించి మృతురాలి కుటుంబానికి దేవస్థానం తరఫున రూ.9లక్షలు పరిహారం అందించేందుకు అంగీక రించారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున బీమా సొమ్ము రూ.5లక్షలు ఇప్పించేందుకు యత్నిస్తామన్నారు. మరోవైపు తక్షణ సాయంగా దేవస్థానం తరఫున రూ.15వేలు, ప్రభుత్వం తరఫున రూ.5వేలు అందించారు. చికిత్స పొందుతున్న జగదీశ్వరికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆర్టీవో తేజ్‌భరత్ సూచించారు. రక్షణ లేకుండానే విస్తరణ పనులు భవిష్యతలో మెట్లమార్గంలో నడిచి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా మెట్లమార్గాన్ని విస్తరించాలని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు సూచించారు. అందులో భాగంగా రూ.8 కోట్లతో కొండ దిగువ నుంచి పై వరకు ప్రస్తుతం ఉన్న మెట్ల మార్గాన్ని మరో పది అడుగుల వెడల్పున విస్తరించే పనులు చేపట్టారు. ఇప్పటికి కొండదిగువ తొలిపావంచా నుంచి కొంతమేర పైవరకు పనులు పూర్తిచేసి కొత్త మెట్లు నిర్మించేశారు. మధ్యలోకి వచ్చేసరికి లోయ ఉన్న ప్రాంతంవైపు విస్తరణ పనులు ప్రస్తుతం చేస్తున్నారు. ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో పొక్లెయిన్ సాయంతో చదును చేస్తున్నారు. ఈ క్రమంలో కొండని తొలిచినప్పటి నుంచీ రాళ్లు కిందకు జారి మెట్లమార్గంలో పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కాంట్రాక్టర్గానీ, దేవస్థానం అధికారులుగానీ కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. ఆ రాళ్లను అక్కడే ఉంచేశారు తప్ప దూరంగా తరలించలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం... మెట్లపైకి మట్టి జారకుండా ఉండేందుకే అలా రాళ్లు పెట్టామని చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకి పెద్ద ఎత్తున రాళ్లు దొర్లుకుంటూ మెట్లమార్గంలోకి వచ్చి చేరాయి. విస్తరించే పనుల్లో భాగంగా ఆంజనేయస్వామి ఆలయం పైభాగం కూడా మూతపడింది. ఇదే ప్రాంతంలో మరిన్ని రాళ్లు పడే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా దేవస్థానం అధికారులు, కాంట్రాక్టర్ పొక్లెయిన్‌తో ఇష్టారాజ్యంగా పనులు చేసుకుంటూ పోతున్నారు. ఇవేమీ తెలియని భక్తులు మెట్లమార్గంలో నడిచివెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. కుటుంబానికి అండ కోల్పోయాం భవాని ఎంబీఏ చదువుకుని సబ్బవరంలోని ఓ టీవీ షోరూంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంది. ముగ్గురు కుమార్తెలలో భవాని పెద్దది. చదువు పూర్తిచేసిన అనంతరం ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతంతో కుటుంబాన్ని పోషిస్తుంది. తాను కూలి పనులు చేసుకొని కుమార్తెను చదివిస్తే, కుటుంబానికి అందివచ్చేసరికి ప్రాణాలు కోల్పోయింది. తన ఇద్దరు చెల్లిళ్లను చదివిస్తానని చెప్పేది. నాకు ధైర్యం చెప్పిన కుమార్తె ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోయింది. – కూర్మినాయుడు, మృతురాలి తండ్రి -
ఆ తల్లికి ఎంత కష్టమొచ్చిందో...!
సాక్షి, సింహాచలం/పెందుర్తి: తొలి సంతానం ఆడబిడ్డ.. లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందని సంబరపడింది ఆ తల్లి.. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ ముద్దులొలికే మాటల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది.. ఆ చిన్నారికి మరెన్నో కబుర్లు చెబుతూ గోరుముద్దలు తినిపిద్దామని ఆశపడింది.. కానీ విధి మరోలా తలచింది.. ఆ బిడ్డకు మాట రాలేదు.. మాటలు వినపడలేదు.. ఆడబిడ్డ జన్మించిన మూడేళ్లకు మగబిడ్డ రూపంలో మరో సంతానం.. ఈ సారీ అదే ఆశ.. అంతకు మించిన ఆత్రుత.. చిట్టచివరకు అదే వేదన.. ఇద్దరి బిడ్డల పండంటి భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి పూజ చేయని అమ్మవారు లేదు.. మొక్కని దేవత లేదు.. కానీ ఏ ‘తల్లీ’ కరుణించలేదు.. బలీయమైన విధి చేతిలో ఈ ‘అమ్మ’ ఓడిపోయింది. పిల్లల భవిష్యత్‌పై పూర్తిగా ఆశలు వదులుకున్న ఆ మాతృమూర్తి వారి గొంతులో గరళం పోసింది.. తానూ ఆ కాలకూటాన్ని మింగేసి తనువు చాలించింది.. సింహాచలం సమీపంలోని గొల్లనారాయణపురంలో పిల్లలు సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది. విగతజీవులుగా పడి ఉన్న తల్లీ బిడ్డలు బురకాయల అరుణ(30), రమ్యశ్రీ(9), మహేష్(6)ను చూసి కంటతడి పెట్టనివారు లేరు. ఓ వైపు పిల్లల వైకల్యం.. మరోవైపు ఆర్థిక భారం ఈ పెను విషాదానికి కారణమయ్యాయి. ఉన్నంతలో జీవనం సాగిస్తున్న సమయంలో భార్య పిల్లలు శాశ్వతంగా దూరం కావడంతో అరుణ భర్త సత్యనారాయణ తల్లడిల్లిపోతున్నాడు. అమ్మ సన్నిధిలోనే అనంతలోకాలకు ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం సమీపంలో ఉన్న గొల్లనారాయణపురంలో చోటుచేసుకుంది. పెందుర్తి సీఐ వెంకునాయుడు, స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామానికి చెందిన బురకాయల సత్యనారాయణ, అరుణ (30) దంపతులు గత ఆరేళ్లుగా గొల్లనారాయణపురంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సత్యనారాయణ శ్రీకాకుళంలోని అరబిందో ఫార్మసీలో పనిచేస్తూ వారానికి ఒకటి రెండుసార్లు గొల్లనారాయణపురంలోని ఇంటికి వస్తుంటాడు. వీరికి రమ్యశ్రీ (9), మహేష్ (6) అనే పిల్లలున్నారు. పిల్లలు ఇద్దరికీ పుట్టుక నుంచే మూగ, చెవుడు కావడంతో తల్లి నిత్యం మదనపడేది. రోజూ చుట్టుపక్కల వారితో పిల్లల పరిస్థితిని చెప్పుకుని బాధపడేది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో మెరుగైన వైద్యం చేసే పరిస్థితి లేకపోవడంతో కుమిలిపోయేది. ఉన్నంతలో అప్పుడప్పుడు వైద్యులకు చూపించినా ఫలితం ఉండేది కాదు. కాస్త దైవభక్తి ఎక్కువ ఉన్న అరుణ తన పిల్లలు బాగుపడాలని నిత్యం దేవతలను పూజిస్తుండేది. స్థానికంగా ఉన్న నూకాంబిక ఆలయంలో అమ్మవారికి సేవలు చేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న గ్రామస్తులందరికీ దగ్గరైంది. భర్త సత్యనారాయణని విచారిస్తున్న పెందుర్తి సీఐ వెంకునాయుడు ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భర్త సత్యనారాయణ ఫోన్ చేసి ఉదయం ఇంటికి వస్తున్నట్టు అరుణకి చెప్పాడు. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి సత్యనారాయణ ఇంటికి రాగా అరుణ, పిల్లలు ఇంట్లో కనిపించలేదు. ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల వద్ద వెతికాడు. ఆలయానికి వెళ్లిందేమోనని పలువురు చెప్పగా సత్యనారాయణ ఆలయం వద్దకు వెళ్లాడు. ఆలయం వెనుక ప్రాంగణంలో నిర్జీవ స్థితిలో పడి ఉన్న భార్య, పిల్లలను చూసి షాకయ్యాడు. అప్పటికే అరుణ పిల్లలకి విషం ఇచ్చి తానూ తాగి మృతి చెందింది. దీంతో సత్యనారాయణ స్థానికులకు, పెందుర్తి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి సీఐ వెంకునాయుడు సత్యనారాయణ, స్థానికులను విచారించారు. పిల్లలిద్దరూ మూగ, చెవుడు కావడంతో అరుణ మానసికంగా బాధపడుతుండేదని, ఆర్థిక పరిస్థితులు కూడా కారణం కావచ్చని స్థానికులు చెప్పినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. అరుణ పిల్లలతో సహా మృతి చెందిందని తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు తరలివచ్చారు. ఎప్పుడూ పిల్లల గురించే మాట్లాడేదని, పిల్లలకు చెవుడు, మూగ కావడంతో ఎప్పటికైనా అమ్మవారు కరుణిస్తుందని చెప్పేదని పలువురు మహిళలు కంటతడి పెట్టారు. భార్య సహా పిల్లలు కూడా ఒకేసారి మృత్యుఒడికి చేరుకోవడంతో సత్యనారాయణ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
అప్పన్న అన్న ప్రసాదం.. అ‘ధన’పు భారం!
సాక్షి, సింహాచలం (విశాఖపట్నం): అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంటారు. అదీ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆది వరాహమూర్తిగా అవతరించి, హిరణ్యాక్షుణ్ణి వధించిన పుణ్యక్షేత్రం, భక్తజన సిరి సింహగిరిపై అన్నప్రసాదం అంటే భక్తజన కోటికి మహా ప్రసాదం. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు నోరారా గోవిందుడి నామాన్ని స్మరించాలని.. తరించాలని.. మనసారా కోరుకుంటారు. ఆనక కడుపారా స్వామి అన్న ప్రసాదాన్ని స్వీకరించే అదృష్టం కలగాలని ప్రార్థిస్తారు. భగవంతుడు కరుణిస్తే మళ్లీ మళ్లీ ఆయన దర్శనభాగ్యం కల్పించాలని మొక్కుకుంటారు. అయితే సిరుల తల్లి శ్రీలక్ష్మిని చేతపట్టి వరాహ లక్ష్మీ నృసింహ స్వామిగా అవతరించిన సింహాచలేశుడి సన్నిధిలో భక్తులకు నిత్యాన్నదాన భారం అధికమవుతోందంటున్నారు ఆలయ అధికారులు. భక్తజన కోటి మహా ప్రసాదంగా భావించే సింహాద్రి అప్పన్న అన్నప్రసాదం ఇక అందరికీ దొరక్కపోవచ్చు. నిత్యాన్నదాన పథకం నిర్వహణ వ్యయ భారం అవుతోందన్న నెపంతో భక్తుల సంఖ్యను కుదించే చర్యలకు దేవస్థానం పూనుకుంటోంది. సింహగిరిపై ఐదేళ్ల నుంచి ప్రతి రోజు 5 వేల మంది భక్తులకు నిత్యాన్నదాన పథకం కింద అందించే అన్నప్రసాదాన్ని ఇక నుంచి పరిమితం చేయాలని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో మినహా సోమవారం నుంచి శుక్రవారం వరకు 1800 మంది భక్తులకు అన్నప్రసాదం అందించి వ్యయ భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయించినట్టు బోగట్టా. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు దేవదాయ శాఖ కమిషనర్‌కు పంపించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు నేడో, రేపో విడుదల కానున్నట్టు తెలిసింది. వివరాలిలా ఉన్నాయి. రూ.23 కోట్లకు చేరిన విరాళాలు 2014, ఆగష్టు వరకు ఆయా రోజుల్లో భక్తుల రద్దీ సంఖ్యకు అణుగుణంగా అన్నప్రసాదాన్ని భక్తులకు అందించేవారు. కానీ ఆ ఏడాది ఆగష్టు నుంచి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ప్రతి రోజూ 5 వేలు మందికి అన్నప్రసాదం అందించాలని సంకల్పించారు. ఆ మేరకు సింహాచలం దేవస్థానంలో కూడా రోజూ 5 వేల మందికి అన్నప్రసాదం అందిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ పద్ధతే కొనసాగుతోంది. అయితే రోజూ 5 వేల మందికి అన్నప్రసాదాన్ని అందించడం వల్ల నిత్యాన్నదాన పథకం నిర్వహణ భారమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ పథకానికి ఏడాదిలో వచ్చే వడ్డీకన్నా అదనంగా నగదు ఖర్చవుతోందని, మిగిలిన నిధులు వేరే విభాగాల నుంచి తీసుకోవాల్సి వస్తోందని అంటున్నారు. ప్రతి రోజూ ఒక భక్తుడి భోజనానికి రూ.24 వెచ్చిస్తుండగా.. ఆ లెక్కన 5 వేల మందికి రోజుకు సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు అవుతోంది. ఇలా సరాసరి ఏడాదికి పథకం నిర్వహణకు సుమారు రూ.3 కోట్లు వ్యయమవుతోంది. బ్యాంకులో ఉన్న రూ.23 కోట్ల డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే ఏడాదికి కోటి నుంచి కోటిన్నర అదనపు భారం పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఈ భారాన్ని దేవస్థానంలో ఉన్న మిగతా విభాగాల నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనిని అధిగమించేందుకు శని, ఆదివారాల్లో 5 వేల మందికి అన్నప్రసాదాన్ని అందించి, సోమవారం నుంచి శుక్రవారం వరకు 5 వేల మందికి అందించే అన్నప్రసాదాన్ని 1800 మందికి పరిమితం చేసేందుకు నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు దేవస్థానాల్లో కూడా 5వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించడం లేదన్న విషయాన్ని దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా దేవస్థానం ఈవో విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు బోగట్టా. ఇప్పటి వరకు అన్నదాన విరాళాలు: రూ.23 కోట్లు దీనిపై బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ సుమారు: రూ.1.60 కోట్లు ఏడాదికి అన్నదానానికి అయ్యే ఖర్చు: రూ.3 కోట్ల పైమాటే.. ఏడాదికి దేవస్థానంపై భారం సుమారు: రూ.1.5 కోట్లు రూ.50 వేల విరాళంతో 1989లో శ్రీకారం సింహగిరిపై 1989లో దేవస్థానం ఉద్యోగులు తొలి విరాళంగా రూ.50 వేలు అందించడంతో అన్నదాన పథకం ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పథకానికి దాతలు, భక్తులు రూ.1000 నుంచి రూ.లక్ష వరకు విరాళాలు అందిస్తున్నారు. అలా దాతలు ఇచ్చిన ఆ నగదును బ్యాంకుల్లో వేసి ఆ వచ్చే వడ్డీతో రోజూ భక్తులకు అన్నప్రసాదం అందిస్తున్నారు. దాతలు కోరుకున్న రోజున వారి పేరిట అన్నదానం చేస్తున్నారు. అలా దాతలు అందించిన విరాళాలు ఇప్పటికి రూ.23 కోట్లకు చేరుకున్నాయి. స్వామి ప్రసాదంపై ఆంక్షలా? భక్తులకు అందించే స్వామి అన్నప్రసాదం విషయంలో ఆదాయ వ్యయాలు చూసుకోవడం ఏంటని పలువురు ఆక్షేపిస్తున్నారు. దేవస్థానంలో దివ్యక్షేత్రం పేరిట ఎన్నో అభివృద్ధి పనులు చేసేందుకు పూనుకున్న అధికారులు అన్నప్రసాదం విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉన్నట్టు ఆలయ వర్గాలే చెబుతున్నాయి. సింహగిరిపై త్వరలో కాంట్రాక్ట్‌కు ఇచ్చిన అధునాతన క్యాంటీన్ ప్రారంభం వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. అన్నప్రసాద పథకంలో ఇప్పటికీ బఫే పద్ధతి కొనసాగిస్తున్న అధికారులు వ్యయభారం నెపంతో భక్తుల సంఖ్యను మాత్రం కుదించడం ఎంత వరకు భావ్యమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తమ నిర్ణయంపై పునరాలోచించుకుని, భక్తులందరికీ స్వామి అన్నప్రసాదం లభించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
స్వర్ణపుష్పార్చన పథకానికి విశేష స్పందన
సింహాచలం(పెందుర్తి): సింహాచలం దేవస్థానం ప్రవేశపెట్టిన ‘స్వర్ణపుష్పార్చన’ పథకానికి దాతల నుంచి విశేష స్పందన వచ్చింది. సంకల్పించిన రెండున్నర నెలల్లోనే కావాల్సిన 132 స్వర్ణపుష్పాలకు దాతలు విరాళాలు అందజేశారు. ఇప్పటికే 108 స్వర్ణపుష్పాలు సిద్ధం కావడంతో ఈనెల 17వ తేదీన నృసింహ జయంతిని పురస్కరించుకుని స్వామికి స్వర్ణపుష్పార్చన పూజ జరిపేందుకు అధికార, వైదిక వర్గాలు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ఒక భక్తుడు స్వామికి కానుకగా ఇచ్చిన 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో ఇప్పటివరకు ప్రతీ గురువారం, ఆదివారం స్వర్ణపుష్పార్చన నిర్వహిస్తున్నారు. ఆ పుష్పాలు కేవలం బంగారు కోటెడ్‌వి కావడంతో పక్కా స్వర్ణపుష్పాలను తయారు చేయించాలని దేవస్థానం అధికార, వైదిక వర్గాలు గత ఫిబ్రవరిలో సంకల్పించారు. ఒక్కో స్వర్ణ పుష్పం 18 గ్రాముల బరువుతో ఉండి మొత్తం 132 స్వర్ణపుష్పాలను తయారు చేయించాలని భావించారు. ఈ మేరకు నగరంలోని వైభవ్ జ్యూయలర్స్ ద్వారా కోయంబత్తూరుకి చెందిన ఒక వ్యాపార సంస్థకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఒక్కో స్వర్ణ పుష్పానికి 64 వేలు ఖర్చుగా నిర్ణయించి దాతల నుంచి విరాళంగా తీసుకునే కార్యక్రమాన్ని చేపట్టారు. అలా దేవస్థానం సంకల్పానికి దాతల నుంచి విశేషంగా ఆదరణ లభించింది. మొత్తం 103 మంది దాతలు 132 స్వర్ణపుష్పాలకి విరాళాలను అందజేశారు. ఇప్పటికే 108 స్వర్ణపుష్పాలు తయారై ఉండటంతో వాటిని సింహగిరికి తీసుకురానున్నారు. ఈనెల 17వ తేదీన స్వర్ణపుష్పాలతో స్వామికి జరిగే తొలిపూజకు విరాళాలు ఇచ్చిన దాతలందరినీ ఆహ్వానించేందుకు అధికార, వైదిక వర్గాలు నిర్ణయం తీసుకున్నారు. -
భైరవా... నీ మార్గానికి మోక్షమెప్పుడు?
విశాఖపట్నం, సింహాచలం(పెందుర్తి): భైరవస్వామి ఆలయానికి వెళ్లే భక్తుల సంఖ్య విశేషంగా పెరుగుతోంది. అలాగే సింహాచలం దేవస్థానానికి ఆదాయం కూడా పెద్ద ఎత్తున చేకూరుతోంది. ఇక్కడ పూజాసామగ్రి విక్రయానికి దేవస్థానం నిర్వహించే బహిరంగ వేలం పాటకు కూడా లక్షల్లో డిమాండ్ ఏర్పడింది. కానీ ఆలయానికి చేరుకునే మార్గానికే ఏళ్ల తరబడి మోక్షం లభించడం లేదు. అలాగే ఆలయం వద్ద భక్తులకు సరైన సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. రోడ్డు వచ్చి తమ బాధలు ఎప్పుడు తీరతాయా అని భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాగే ఆలయం వద్ద సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. వివరాలికి వేళ్తే.... సింహాచలం నుంచి శొంఠ్యాం వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో నాలుగు కిలోమీటర్ల దూరంలో భైరవవాక ఉంది. అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు అటవీ మార్గంలో పయనిస్తే భైరవస్వామి ఆలయం వస్తుంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సింహాచలం వచ్చే భక్తుల్లో చాలా మంది భైరవస్వామిని దర్శించుకునేందుకు భైరవవాకు వెళ్తుంటారు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లోను, భైరవుడి పుట్టిన రోజైన భైరవాష్టమిరోజుల్లోను, నెల నెలా వచ్చే అష్టమిరోజుల్లోను, ప్రతి శని, ఆదివారాల్లోనూ భక్తుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. స్వామికి అభిషేకాలు నిర్వహించి, విభూదిని భక్తులు సమర్పిస్తారు. అమృతకలశలను అందజేస్తారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న భైరవస్వామి ఆలయానికి చేరుకునే మార్గంలో ప్రయాణించాలంటే మాత్రం భక్తులు నరకం చూస్తున్నారు. మార్గమంతా రాళ్లు తేలిన రోడ్డే ఉంటుంది. పెద్ద పెద్ద గోతులతో దర్శనమిస్తుంది. ఇక వర్షం వస్తే గోతుల్లో పెద్దె ఎత్తున నీరు నిలుస్తుంది. ఏళ్ల తరబడి భక్తులు ఈ దీనావస్థలో ఉన్న మార్గంలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే అమావాస్య రోజుల్లో ఈ మార్గమంతా తీవ్ర రద్దీ నెలకుంటోంది. వాహనాలు పెద్ద ఎత్తున నిలిచి ట్రాఫిక్ స్తంభిస్తోంది. అటవీశాఖ ఆధీనంలో ఆలయానికి వెళ్లే మార్గం–దేవస్థానం ఆధీనంలో ఆలయం భైరవస్వామి ఆలయానికి మార్గం వేయాలంటే ఒక ముఖ్య సమస్య నెలకుంది. ఆలయానికి చేరుకునే రెండున్నర కిలోమీటర్లు ఉన్న మార్గం అటవీశాఖ ఆధీనంలో ఉండగా, ఆలయం మాత్రం సింహాచలం దేవస్థానం ఆధీనంలో ఉంది. సింహాచలం దేవస్థానం మార్గాన్ని వైడల్పు చేసి రోడ్డు వేసేందుకు పలుమార్లు పూనుకున్నా అటవీశాఖ నుంచి అనుమతి రాలేదు. ఇప్పటికే పలుమార్లు అటవీశాఖ, దేవస్థానానికి మధ్య రోడ్డు మార్గం ఏర్పాటుపై పరిశీలనలు కూడా జరిగాయి. కానీ ఇప్పటికీ సమస్య తీరలేదు. ఆలయం వద్ద సౌకర్యాలు నిల్ ఇక ఆలయం వద్ద సౌకర్యాలు కల్పించడంలో కూడా దేవస్థానం అశ్రద్ధ వహిస్తోంది. కనీసం భక్తులు తాగడానికి మంచినీరుకూ కూడా నోచుకోవడం లేదు. అలాగే విశ్రాంతి తీసుకునేందుకు షెల్టర్లులేవు. ఇక్కడ ఉన్న బోరు పనిచేయకపోగా, నుయ్యి ఎండిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భయమేస్తోంది నేను ప్రతి అమావాస్యకు భైరవస్వామి ఆలయానికి వస్తుంటాను. వచ్చినప్పుడల్లా నడిచే వెళ్తుంటాను. రోడ్డు మార్గంలో ఉన్న రాళ్లను చూస్తే నడవడానికి భయవేస్తోంది. అలాగే రాళ్లు తేలిన రోడ్డుపై చిన్నారులను ఎత్తుకుని నడిచే పలువురి భక్తులు పడే బాధ కూడా కలచివేస్తోంది. ఇప్పటికైనా మార్గాన్ని వెడల్పు చేసి రోడ్డు వేయాలి.–కె.సత్యనారాయణ, వేపగుంట మంత్రి గంటా హామీ మాటలకే పరిమితం భైరవస్వామి ఆలయానికి రోడ్డుమార్గం వేయడానికి కృషి చేస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు హామీలు కురిపించారు తప్ప ఆ తర్వాత పట్టించుకోలేదు. పలుమార్లు గంటా శ్రీనివాసరావు భైరవస్వామి దర్శనానికి వచ్చారు. అప్పట్లో పలువురు భక్తులు, స్థానికులు రోడ్డు విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అటవీశాఖ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని హామీలు ఇచ్చారు తప్ప ఆ తర్వాత విషయాన్ని పట్టించుకోలేదు. -
సింహాచలంలో శ్రీవరహలక్ష్మీనృసింహస్వామి నౌకావిహారం
-
అడవిలో వేట!
మహేశ్‌బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగ్ జూన్‌లో ప్రారంభం అవుతుంది. తాజాగా ఈ సినిమా కథనం సింహాచలం అడవుల నేపథ్యంలో సాగుతుందనే వార్త ప్రచారంలోకొచ్చింది. ఇది రీవెంజ్ డ్రామా అట. అంతేకాదు ఈ సినిమాలో మహేశ్‌బాబు లుక్ ఫుల్ గడ్డంతో ఉంటుందట. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే అడవిలో మహేశ్ వేట ఆడియన్స్‌కు మంచి కిక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. -
స్వామికి మద్యంతో అభిషేకాలు.. అర్ధరాత్రి తాంత్రిక పూజలు!
సింహాచలం: శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భైరవస్వామి ఆలయం వద్ద తాంత్రిక పూజలు ఆగడం లేదు. అర్ధరాత్రి అమావాస్య రోజుల్లో పెద్ద ఎత్తున ఈ పూజలు జరుగుతున్నాయి. అసలు ఈ పూజలు బయటి వ్యక్తులు చేస్తున్నారా.. లేక అధికారులే ఆ పూజలను ప్రోత్సహిస్తున్నారా.. అని కూడా పలువురు సందేహిస్తున్నారు. తాంత్రిక పూజలపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడమే ఈ అనుమానాలకు కారణమవుతోంది. గురువారం అర్ధరాత్రి అమావాస్య గడియల్లో భైరవస్వామికి తాంత్రిక పూజ జరిగిందని, అది దేవస్థానం అనుబంధ దేవాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అర్చకుల ఆధ్వర్యంలో ఇది జరిగిందని బహిర్గతమైంది. ఆ పూజలు ఈవో ఆదేశాల మేరకే జరిగాయన్న ప్రచారం జరుగుతోంది. భక్తులకు దర్శనం కల్పించకుండా ఆపేసి.. దేవస్థానానికి అనుబంధంగా అడవివరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అటవీప్రాంతంలో భైరవస్వామి ఆలయం ఉంది. అమావాస్య రోజుల్లో భక్తులు భారీగా వస్తున్నారు. కొందరు అనధికార పురోహితులు స్వామికి మద్యంతో అభిషేకాలు, హోమాలు, తాంత్రిక పూజలు నిర్వహిస్తుండటంపై రెండేళ్లుగా దుమారం రేగుతోంది. దీంతో దేవస్థానం అధికారులు గతేడాది ఆలయం వద్ద నిఘా పెట్టారు. అయినా అమావాస్య రోజుల్లో ఆలయం వద్ద ఇటువంటి పూజలు ఆగడం లేదు. గురువారం అమావాస్య కావడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆలయం వద్ద దేవస్థానానికి చెందిన కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో విధులు నిర్వర్తించే ఇద్దరు అర్చకులు.. మరికొంతమంది ప్రైవేటు అర్చకులతో కలిసి భైరవస్వామికి తాంత్రికపరమైన అభిషేకాలు, హోమం, పూజలు నిర్వహించారు. అప్పటికే అక్కడకు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు గంటల తరబడి దర్శనం కల్పించకుండా చేశారు. భైరవస్వామి చెంత అర్ధరాత్రి తాంత్రిక పూజలు అదేంటని భక్తులు ప్రశ్నిస్తే.. దేవస్థానం ఈవో చెప్పడంతోనే ఈ పూజలు చేస్తున్నామని వారు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిపై ఈవో వివరణ కోరేందుకు శుక్రవారం సాక్షి ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. భైరవస్వామి ఆలయం వద్ద జరుగుతున్న తాంత్రిక పూజలను దేవస్థానం అనువంశిక ధర్మకర్త సామాజిక వర్గానికి చెందినవారే ప్రోత్సహిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన ఐదేళ్లుగా ఈ విధమైన పూజలు జరిపేవారిని దగ్గరుండి ఆలయానికి తీసుకెళ్లిన సందర్భాలు, అలాంటి పూజలు జరిపే తాంత్రికులు ఏకంగా దేవస్థాన కార్యాలయంలోకి కూడా యథేచ్ఛగా తిరిగిన సందర్భాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కంచరపాలేనికి చెందిన ఓ భక్తుడు వస్తే నవగ్రహ పూజలు జరిపినట్లు అర్చకుడు సంతోష్‌శర్మ చెప్పారు. -
ఆ సెక్యూరిటీపైనే అవ్యాజ ప్రేమ
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం దేవస్థానంలో సెక్యూరిటీ కాంట్రాక్టు వ్యవహారంపై పెద్ద దుమారం రేగుతోంది. ఏళ్ల తరబడి ఒకే సంస్థకు సెక్యూరిటీ కాంట్రాక్టు ఖరారు కావడం, నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టును పొడిగించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానంలో దాదాపు 120 మంది వరకు సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తుంటారు. సెక్యూరిటీ గార్డులను సరఫరా చేయడానికి దేవస్థానం ఏటా టెండర్లను ఆహ్వానిస్తుంది. ఇందులో ఎవరు తక్కువ సొమ్ముకు గార్డులను సరఫరా చేస్తారో వారికే టెండరు ఖరారు చేస్తారు. ఏడాది పాటు వీరి టెండరు అమలులో ఉంటుంది. గడువు ముగియడానికి రెండు నెలల ముందే కొత్తగా టెండర్లను పిలవాల్సి ఉంటుంది. ఇలా దాదాపు ఐదేళ్లుగా స్కాట్లాండ్ అనే సెక్యూరిటీ సంస్థ సింహాచలం దేవస్థానం అవసరాలకు సెక్యూరిటీ గార్డులను సరఫరా చేస్తోంది. 2016 అక్టోబర్‌తో స్కాట్లాండ్ సంస్థకు గడువు ముగిసినా మరో ఏడాదికి అంటే 2017 వరకు కొనసాగించడానికి అనుమతి పొందినట్టు సమాచారం. 2017లో టెండర్లు ఆహ్వానిస్తే ఇండియన్ సెక్యూరిటీ అనే సంస్థకు ఖరారు కాగా ఏదో మతలబుతో స్కాట్లాండ్ సెక్యూరిటీ చొరబాటుకు అనుమతించినట్టు చెబుతున్నారు. ఈ సంస్థ ఒప్పందం కూడా 2018 అక్టోబర్ ఆఖరుతో ముగిసింది. ముందుగా టెండర్లను పిలవకుండా మళ్లీ ఆ సంస్థలకే సెక్యూరిటీ కాంట్రాక్టును ఏడాది పొడిగించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిబంధనల ప్రకారం టెండర్లను ఆహ్వానిస్తే ఆసక్తి ఉన్న వారు టెండర్లలో పాల్గొంటారు. తక్కువ ధరకు కోట్ చేసిన వారికి టెండర్లు ఖరారు చేస్తారు. కా>నీ ఏదో విధంగా నాలుగైదేళ్లుగా ఒకట్రెండు సంస్థలే వీటిని దక్కించుకోవడం వెనక ఉన్నతాధికారుల ‘కృషి’ ఉందని చెబుతున్నారు. ఏటా వీరికే సెక్యూరిటీ కాంట్రాక్టు దక్కుతుండడంతో టెండర్ల సమయంలో ముందుగా లీకులిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సెక్యూరిటీ కాంట్రాక్టరు అధికార పార్టీ ముఖ్య నేతలకు అత్యంత సన్నిహితులన్న ప్రచారం కూడా ఉంది. కాగా సెక్యూరిటీ కాంట్రాక్టు కొనసాగింపు వ్యవహారంపై సింహాచలం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌ను వివరణకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. జీతాల్లోనూ కోత మరోవైపు ఈ సంస్థల గార్డులకిచ్చే జీతాల్లోనూ కోత విధిస్తున్నారు. ఒక్కో గార్డుకు రోజుకు రూ.368.42 చొప్పున దేవస్థానం సంబంధిత కాంట్రాక్టరుకు చెల్లిస్తుంది. అంటే ఒక్కో గార్డుకు నెలకు రూ.11 వేలు జీతం అందాలి. కానీ కాంట్రాక్టరు రూ.6500–7000కి మించి చెల్లించడం లేదని చెబుతున్నారు. మిగలిన సొమ్ములో కొంత దేవస్థానం అధికారులకు మామూళ్లుగా చెల్లిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు.. సెక్యూరిటీ గార్డులకు నెలనెలా పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ము కూడా కాంట్రాక్టరు సక్రమంగా చెల్లించడం లేదని తెలుస్తోంది. దీనిపై కొన్నాళ్ల క్రితం గార్డులు ఆందోళనకు దిగడంతో నామమాత్రంగా కొద్దిమందికి చెల్లిస్తున్నారని అంటున్నారు. -
సత్‌భుక్తి
సింహాచలం మండుటెండను, నెత్తిమీది బరువునూ భరిస్తూ గమ్యం చేరి, తలమీది బరువును దిగ్గున కింద పడేసి, ఒక షాపు మెట్ల మీద కూర్చుంది. చీరకొంగు ముందుకు లాక్కుని, ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంది. చెంగుతో కలిసిన చేతివేళ్లు కళ్లవద్దకు వచ్చేసరికి కన్నీళ్లు తన్నుకు రాబోయాయి. కానీ, అలవాటైన చేతివేళ్లు ఆ కళ్లను సముదాయించి, తమ బాధ్యతను నెరవేర్చుకున్నాయి. సింహాచలం నిట్టూర్చింది. బతికి చెడినవారికి నిట్టూర్పులు, చెడి బతికినవారికి మైమరపులూ పరిపాటే. నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాడెవడు అనుకుందామె. మనస్సుకు కాస్త తీరుబడి దొరికితే అది గతంలోకి చొచ్చుకుపోతుంది. ఉస్సూరుమంటుంది. శరీరానికే గానీ, మనస్సుకు విశ్రాంతినివ్వలేదా దేముడు. ఈలోగా కోమటి కోటేశ్వర్రావు కొడుకు నాగేశ్వర్రావు వచ్చి, షాపు తెరుస్తూ, ‘‘ఏం సింహాచలం! ఈరోజు పేపర్లు బాగానే పట్టినట్టున్నావే’’ అన్నాడు. సింహాచలం పేపర్లు తక్కెడలో పెడుతూ, ‘‘ఏముంది నాయనా, ఎంత సంపాదించినా కూటికీ, ఎన్నాళ్లు బతికినా కాటికేగదా అన్నట్టుంది నా కథ’’ అంది.‘‘నీతో మాట్లాడేటపుడో నోట్‌బుక్కూ, ఓ పెన్నూ సిద్ధం చేసుకోవాలి. ఎన్ని సామెతల్జెప్తావో’’ అన్నాడు నాగేశ్వర్రావు.పేపర్ల డబ్బులు తీసుకుని, కాళ్లీడ్చుకుంటూ గుడిశకి చేరి, ఓ మూడు గుప్పెళ్ల బియ్యం అత్తెసరు పడేసి, గోడకి జారపడి కూర్చుంది సింహాచలం. ఆమె మనస్సు గతంలోకి గుంజింది. ‘‘... సింహాచలం గెట్స్ క్లాస్ ఫస్టినింగ్లీష్’’ అది తన ఇంగ్లిష్ టీచర్ గొంతు. అది ఎనిమిదో తరగతి క్లాసు. టీచర్ గొంతు విన్న పిల్లల్లో ఆనందంతో కొందరు, ఆనవాయితీగా కొందరు, సరదాగా కొందరు, తప్పనిసరిగా కొందరు చప్పట్లు కొట్టారు. ఆ ఆనందంతో తను ఎగిరి గంతేసినంత పనిచేసి, నిభాయించుకుంది. మనస్సు మాత్రం ఎగిరి, గంతున్నర వేసింది ఉత్సాహంతో. ఆ రాత్రి భోజనాలయ్యాయనిపించుకున్నాక, సింహాచలం తండ్రితో, ‘‘నాన్నా! పన్నెండు పాసయ్యాక నే టీచరు చదువుతా’’ అని, కాసేపాగి, ‘‘వెంటనే కాదులే.. ఓ ఏడాగుతా.. ఈనెల నుంచీ మరికొన్నిళ్లు పనికి ఒప్పుకుంటా’’ అంది. సింహాచలం తండ్రి ఆమెకేసి జాలిగా చూసి, ‘‘అలాగేనమ్మా! నాకు కూతురివైనా, కొడుకువైనా నువ్వే కదా’’ అన్నాడు. తనకంత స్తోమతుందో లేదో అతనికే తెలీదు. ఈలోగా తల్లి సత్తెమ్మవచ్చి కూర్చుంటూ ‘‘మింగ మెతుకు లేదు. మీసాలకు సంపంగి నూనే అన్నట్టుంది నీ కథ’’ అంది.‘‘ఎప్పుడో నాలుగేళ్ల తర్వాత కదే అది చెప్పేది. ఇప్పుడే మీద పడ్డట్టెందుకా ఊపు’’ అన్నాడతను చిరాగ్గా. సత్తెమ్మ అది వినిపించుకోకుండా ‘‘ఈ చదువయ్యాక ఆ చదువెన్నేళ్లే’’ అంది.‘‘ఓ ఏడాది’’‘‘అంటే మొత్తం అయిదేళ్లు.. తర్వాత’’‘‘ఉద్యోగం.. టీచరుద్యోగం చేస్తా’’‘‘ఎన్నేళ్లు మిడుకుతావ్’’సింహాచలం కాసేపాగి ‘‘ఓ రెండేళ్లు. కాపోతే మరో ఏడు’’ అంది.‘‘అంటే.. ఊ.. సరి. ఆ తర్వాత?’’ సింహాచలం జంకింది. ‘‘ఆ తర్వాత – నీ ఇష్టప్రకారం బావను పెళ్లి చేస్కుంటా. అయినా ఉద్యోగం మానను’’సత్తెమ్మ వెటకారంగా నవ్వింది.‘‘అంటే నీకోసం వాడు ఎనిమిదేళ్లు ఆగాలటే.. నా ముఖంలా ఉంది నీ కథ. ఆ మాత్రం దానికి ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటే నీ పీడ మాకు, మా పీడ నీకూ ఉండదు కదా’’ అందామె.‘‘పోనీ పెళ్లి చేసుకొని చదువుతా’’ అంది సింహాచలం గొంతు తగ్గించి. ‘‘అది నీ అత్త, నీ మొగుడూ ఇష్టం. నీకు పెళ్లి చేసి, మేం చేతులు దులుపుకుంటే ఇహ నువ్వేవ్టో, నీ కోర్కెలేవ్టో అన్నీ ఆ ఇంట్లోనే’’ అంటూ సత్తెమ్మ నడుంవాల్చింది.భవిష్యత్తు ఆలోచించుకుంటూ సింహాచలం కూర్చున్న చోటే సాగిలపడింది. అత్తెసరులో అన్నం మాడుతున్న వాసన సింహాచలాన్ని వాస్తవానికి లాగింది. ‘‘ప్చ్! ఏం బతుకిది’’ అనుకుంటూ సింహాచలం పొయ్యిమీంచి గిన్నె దింపింది. సంకల్పం ప్రకారం సింహాచలం ఆ నెల నుంచే మరికొన్ని ఇళ్లల్లో పనులు కూడా ఒప్పుకుంది. సంపాదనంతా నీల డబ్బీలో జమచేసి, నిలవ రాసుకునేది నెలనెలా. ఇలాగే ఓ రెండేళ్లు గడిచాయి. పెళ్లికి తండ్రి మద్దతుతో తల్లితో పోట్లాడుతూండేది. ఈలోగా దేవుడిటు చూశాడు. బీదవాళ్లను ధనలేమితోను, ధనం ఉన్న వాళ్లను ఆరోగ్యలేమితోను బాధలు పెడతాడాయన. అదే ఆయన గడుసుదనం. సాఫీగా సాగుతున్న కొంపమీద కొండ విరిగిపడ్డట్టు సింహాచలం నాన్న తను అద్దెకు తీసుకున్న ఆటో ఆ ఓనరుకు అప్పజెప్పి, లెక్క చెల్లుపెట్టి వస్తూంటే అతన్నో కారు ఢీకొంది. కారు ఓనరు వైద్య సహాయం చేసినా,కాలు విరిగి, ఇక ఆటో తోలడం మంచిది కాదు అనే నమ్మకంతో రెండు నెలలు ఆసుపత్రిలో ఉండి తిరిగొచ్చాడు.సింహాచలం నీల డిబ్బీ పైకొచ్చి, పగిలి ఆ ఖర్చు కొంత భరించింది.తనకిక చదువు యోగం లేదని సింహాచలానికి అర్థమయ్యింది. అయినా పన్నెండో క్లాసయ్యాక కదా. ఇంకా టైముందిలే.. అని మనస్సుకు సర్ది చెప్పుకునేది. మరో ఏడు గడ్డుగా గడిచేసరికి సింహాచలం నాయనమ్మ గోల ఆరంభించింది. తనకు చావు దగ్గరకొచ్చిందనీ, మనమరాలి పెళ్లి చూడకుండా చావదలుచుకోలేదనీ ప్రకటించింది. నానా గోల చేసి, రెండుసార్లు మంచం దిగి, మళ్లీ ఎక్కింది. ఫలితంగా సింహాచలం మెడలో మూడు ముళ్లూ పడ్డాయి. జీవితదశ దిశ మారిపోయిందామెకు ఆ మూడు ముళ్లతో. ఏడాది తిరిగేసరికి ఒక పిల్లాడు ఒళ్లో పడ్డాడు. ఇంటింటెడు చాకిరీ చేసి, మరో ఆరిళ్లకూ అదే పని చేసి, ఉస్సురుమంటూ ఇంటికొచ్చిన తనని చూసి, అత్తగా మారిన మేనత్త జాలి పడేది కాదు. ఈ దిక్కుమాలిన మేనరికం తగలడకపోతే, ఆ ముసిల్ది గోలచేసి, చావకపోతే తన కొడుక్కి చక్కని కట్నంతో పెళ్లయ్యేదని ముప్పూటలూ దెప్పేది. ఇంట్లో పని, బయట పని, అత్త సేవ, మొగుడి సేవ, పిల్లాడి చాకిరీ... రకరకాల పనులతో సింహాచలం జీవితం యంత్రాన్ని మించిన యంత్రంగా మారింది. ఆరోజు వర్షం పడుతూ ఉండటంతో సింహాచలం నాగేశ్వర్రావు షాపు ముందే కూర్చుంది. నాగేశ్వర్రావు తాను చూస్తున్న టీవీని ఆపు చేసి, ‘‘సింహాచలం, నీ కథ చెప్పు. నీ మొగుడు, కొడుకూ ఏరి! ఒంటరిగా ఒక్కతివే ఎందుకుంటున్నావు?’’ ఇల్లొదిలి వచ్చేశావా? ఏంటసలు..’’ అన్నాడు. సింహాచలం మాట్లాడేలోగా, ‘‘అవును, ఆ నాగేశ్వరమ్మ కూతురికి చదువు నువ్వే చెప్పిస్తున్నావట కదా, ఎందుకు! వాళ్లంత లేనివాళ్లు కాదు కదా,’’ అన్నాడు. సింహాచలం విరాగినిగా నవ్వింది. ‘‘నా కథ నాకు నేనే చాలాసార్లు చెప్పుకుంటుంటాను. మననం చేసుకుంటుంటాను. విమర్శించుకుంటుంటాను. అలా చెయ్యవలసినది, ఇలా చెయ్యవలసినది అనుకుంటుంటాను. ఈ కట్టె రాలేలోగా ఇంకా ఎన్నిసార్లు తలుచుకుంటానో గతాన్ని’’ అంది.‘‘ఓ సివాచలం, ఉపోద్ఘాతం మాని, కథ చెప్పు. మా నాన్నొచ్చేడంటే కథకు కామా పడుతుంది’’ అన్నాడు నాగేశ్వర్రావు. సింహాచలం ఆరంభించింది.‘‘ఒంటరితనం చాలా కష్టం నాయనా! పైగా ఓ లక్ష్యం లేని జీవితం సారం తీసేసిన చెరుకు పిప్పిలా ఉంటుంది. నాలుగు రాళ్లు సంపాదించడం, ఒండుకోవడం, మింగడం, పడుకోవడం – మర్నాడు, ఆ మర్నాడూ.. ఇహ జీవితమంతా అంతే! బతకడానికో అర్థం, లక్ష్యం ఉండాలి. నాకు చదువంటే చాలా ఇష్టం. ఈ జన్మలో చదువుకూ నాకూ అంతే రాసిపెట్టాడా దేవుడు. చక్కగా చదువుకునే ఓ పిల్ల చదువు బాధ్యత తీసుకుందామని మన సందవతలుండే స్కూలుకు వెళ్లి అయిదో క్లాసులో బాగా చదివే పిల్లను ఎంచుకున్నాను. ఆ పిల్ల పేరు వైదేహీ. దాని మార్కులు అవీ బాగున్నాయి. ఆ పిల్లతో వాళ్ల ఇంటికి వెళ్లి వాళ్లమ్మా నాన్నతో మాట్లాడాను. ‘‘ఏవన్నారు వాళ్లు.. మేమేం లేనివాళ్లం కాదు. పదిళ్లల్లో పని చేసుకునే దానివి నువ్వు ఎవరు చదివించడానికి అన్లేదా?’’ అన్నాడు నాగేశ్వర్రావు. ‘‘అలానే అన్నారు. కానీ నా కోరిక చెప్పాక ఒప్పుకున్నారు.’’ ‘‘ఏమని చెప్పావు?’’ ‘‘నేను బతకడానికీ, ఒంటరితనాన్ని వెళ్లగొట్టుకోడానికీ ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాను. మీరొద్దంటే, మరో పాపను ఎంచుకుంటాను’’ అన్నాను. స్కూల్లో మాష్టారు కూడా ఇదో స్కాలర్షిప్ అనుకోండి అని నచ్చజెప్పాడు. చివరికి వాళ్లు ఒప్పుకున్నారు.’’ అంది.‘‘ఆర్నెల్లయ్యిందా.. ఇది మొదలెట్టి?’’‘‘అయ్యుంటుంది.’’ అని మళ్లీ తనే ఆరంభించింది. ‘‘ఆ పిల్ల ఎంతవరకు చదువుకుంటే అంతవరకూ చదివిస్తా. నాకు టీచర్ ఉద్యోగం అంటే ఇష్టం.’’ అంది.‘‘బీఏ చేయించి, ట్రయినింగ్ చేయిస్తావా ఆ పిల్లని.. చాలా డబ్బవుతుంది కదా’’ అన్నాడు నాగేశ్వర్రావు, నోటి లెక్కలేసి చూసుకుంటూ. ‘‘ఏమి నాయనా! ఓపిక ఉన్నంతవరకూ చదివిస్తా. అది పోతే ఇంకేం చెస్తాం. చేతులెత్తేస్తా.. చూద్దాం దేవుడేం చేస్తాడో’’ అంది వేదాంత ధోరణిలో. ‘‘ఇక నువ్వు ఒంటరివెలా అయ్యావో చెప్పు’’ అని అంతలోనే ‘‘బాబోయ్, మా నాన్నొస్తున్నాడు. గమ్మునుండు. లేకపోతే నన్ను నస పెట్టి చంపేస్తాడు’’ అన్నాడు.కోటేశ్వర్రావు కొట్టు మెట్లెక్కుతూ, ‘‘ఏం సింహాచలం. తీరుబడిగా కూర్చున్నావే’’ అని మళ్లీ తనే, ‘‘అవున్లే! ఒంటి ప్రాణం. ఆరాటం లేని లైఫ్’’ అని ముగించి, కొడుకు వైపు చూస్తూ ‘‘ఏరా.. బోణీ ఏమైనా అయ్యిందా,’’ అని దానికి తనే సమాధానం చెప్పుకుంటూ, ‘‘నువ్ కూర్చుంటే బోణీ లేదు, వోణీ లేదు. పోరా, పోయి చదువుకునేడు’’ అన్నాడు. కొడుకు కిమ్మనకుండా మెట్లు దిగి మాయమైపోయాడు. కోటేశ్వర్రావు షాపులో కూర్చుంటూ, ‘‘అదేవ్టీ.. నువ్వు ఆ నరసయ్య కూతురి చదువు ఖర్చు భరిస్తున్నావట. డబ్బెక్కువయిందా, ఒంటరిదానివి. డబ్బులెక్కువయితే బ్యాంకులో దాచుకుంటే రేపు కాలూ చెయ్యి లొంగకపోతే అవసరమవుతాయి కదా’’ అన్నాడు.సింహాచలం వాదనవుతుందని, పెద్ద వాళ్లతో వాదన మంచిది కాదని, నవ్వేసి ఊరుకుంది. తాను చదివిస్తున్న పిల్ల వైదేహికి ఓ గౌను కొని, ఆ గౌను పెట్టెలో దాచుకుని, మర్నాడివ్వాలనీ, పెట్టె తీస్తే ఆ పెట్టెలో తన కొడుకు చొక్కా ఒకటి కనిపించింది.సింహాచలం కళ్లలో నీరు గిర్రున తిరిగింది. గుర్తుకొచ్చిన కొడుకు ఆమెను గతానికి లాక్కుపోయాడు.బంధువుల ఇంట్లో పెళ్లికి బయల్దేరారందరూ. తన తండ్రికి వాళ్లు ఛార్జీలకు డబ్బు కూడా పంపారు. తాను, తన కొడుకు, మొగుడూ, తల్లిదండ్రులూ, మామ గారూ.. అత్తయిన మేనత్త తాను రానంది. పెళ్లికి వెళ్లి ఆనందంగా తిరుగు ప్రయాణంలో కబుర్లూ పాటలతో సంతోషంగా ఉన్నారంతా. ట్రాక్టరు ట్రయిలర్ తొట్టిలో సిమెంటు బస్తాల లోడు మీద గోనె సంచులు పరుచుకుని కూర్చున్నారు. గేటులేని రైలు కట్ట ఎక్కుతూ ట్రాక్టరు అదుపుతప్పి, గుంజుకుని, కట్టమీంచి దొర్లుకుంటూ పడిపోయింది.పెళ్లి వారందరూ కింద, వారిమీద సిమెంటు బస్తాలు పడ్డాయి. ఊళ్లో జనాలకి తెలిసి, పరుగున వచ్చి ఆ సిమెంటు లోడంతా తీసేసరికి అందరూ చచ్చిపోయారు. సింహాచలం కన్నీరాగలేదు. తన కొడుకు సిమెంట్ విగ్రహంలా మారిపోయాడు. అందరూ కూడా ఊపిరాడక, సిమెంటు లోపలకు – ఊపిరితిత్తుల్లోపలకు పోయి, అంతా చచ్చిపోయారు. సిమెంటు బస్తాలు కొన్ని పగిలి కొందర్ని విగ్రహాలుగా మార్చేశాయి. తనకి మాత్రం రెండు కాళ్లమీద నాలుగైదు సిమెంటు బస్తాలు పడి, గిలగిల్లాడింది. సింహాచలం వెక్కి వెక్కి ఏడ్చింది. చాలాసేపు ఏడ్చాక, ఆ ఏడుపే ఆమెకు ఊరట కలిగించింది. కన్నీళ్లు తుడుచుకుని, ముఖం కడుక్కుని, ఓ చెంబుడు మంచినీళ్లు తాగి స్థిమితపడింది. సింహాచలం కథ అంతటితో ఆగలేదు. ఒంటరిగా ఇంటికొచ్చిన సింహాచలాన్ని జుట్టు పట్టుకుని, సింహాచలం అత్త నడిరోడ్డు మీదికి ఈడ్చింది. ‘‘పాపిష్టిదానా, తల్లినీ తండ్రినీ, కొడుకునూ మింగడమే గాక, నీ మొగుణ్నీ మింగి, నా మొగుణ్నీ మింగి రాయిలా తిరిగివచ్చావా.. లోపలకొచ్చావంటే నీ మీదకి కిరసనాయిలు పోసి, తగలబెడ్తా. నేను జైలుకెళ్లినా ఫర్లేదు. నిన్ను బతకనివ్వను’’ అంటూ భీభత్సంగా గోల చేసింది. సింహాచలం ఆ ఊరు వదిలి, ఈ ఊరు చేరి, ఒంటరి బతుకు ఆరంభించింది. ఆరోజు ఎన్ని వీధులు తిరిగినా, ఎంత తిరిగినా పాత పేపర్లు దొరకలేదు. ఇక కొత్త వీధులు తిరిగి చూద్దామని, కొంచెం దూరం వెళ్లి ప్రయత్నించింది సింహాచలం. ఓ సందులో తన కేక విని ఒకావిడ ఎదురు కేక వేసింది. ‘హమ్మయ్యా!’ అనుకుంటూ సింహాచలం ఆ ఇంటికి వెళ్లింది. ఆ ఇంటావిడ కట్టలు కట్టలుగా కట్టిన పేపర్లు తెచ్చి నెమ్మదిగా కింద పెత్తి ‘‘అన్నీ నీటుగా కట్టాను. తూచి చూసుకో’’ అని బేరమాడి, ఖరారు చేసింది.సింహాచలం కట్టలన్నీ తూచి, తన గోనే సంచీలో వేసుకుని, ఆవిడకివ్వాల్సిన డబ్బులిచ్చి, బరువు నెత్తికెత్తించుకుని బయల్దేరింది. ఆ ఇంటావిడ మురిసిపోతూ ఆ డబ్బు బీరువాలో దాచుకుంది. ఆ ఇల్లాలు మైథిలి.బరువు దింపుకుంటున్న సింహాచలాన్ని చూసి, ‘‘ఏం సివాచలం.. ఈరోజు బాగా పేపర్లు దొరికినట్టున్నాయే’’ అన్నాడు షాపు ఓనరు కోటేశ్వర్రావు లేచి, లైటు వేసి, దేవుడికి దండం పెట్టుకుంటూ. షావుకారు దీపం వేశాక ఇక ఆ పూట డబ్బులిచ్చే పనులేవీ చేయడని సింహాచలానికి తెలుసు. తాను తెచ్చిన పేపర్లన్నీ పొందికగా షాపులో ఒక మూల సర్దింది. కాస్సేపు మెట్లమీద కూర్చుని, ఇంటికి వెళ్లిపోయింది. పేపర్లమ్మిన ఇల్లాలు మైథిలి మొగుడు ఇంటికి రాగానే ‘‘పేపర్లమ్మేశాను’’ అని, ఎంత డబ్బు వచ్చిందో చెప్పి, పేపర్లు కొన్ని నెలలుగా అమ్మిన డబ్బు మొత్తం ఎంతో కూడా లెక్కలు చెప్పి, ‘‘నా దగ్గర ఎంతుంటే అంత డబ్బు మీరిస్తానన్నారు కదా, ఇవ్వండి’’ అంది.ఆ ఇల్లాలి భర్త ఎగిరి గంతేశాడు. ‘‘ఏయే.. నా బీరువా మీద విడిగా పెట్టిన పేపర్లు కూడా అమ్మేశావా?’’ అంటూ ఒక్క గెంతులో లోపలకెళ్లి బీరువాపైన ఖాళీగా ఉండటం చూసి, మరో గెంతులో పెళ్లాం మీద విరుచుకుపడ్డాడు. ‘‘ఓసినీ, ఆ పేపర్లు విడిగా పెట్టాను కదా, అవి కొన్ని చాలా ఇంపార్టెంటు పేపర్లు. ఆ పేపర్ల మధ్యలో ఓ కవరు పెట్టాను. అది తీసి దాచావా?’’ అన్నాడు.‘‘లేదు. కవరేం కనబళ్లా’’ అందా ఇల్లాలు.ఇంటాయన మోహన్‌రావు పిచ్చిపట్టిన వాడిలా జుట్టు కొంచెం పీక్కుని, ‘‘చంపేశావే.. ఆ కవర్లో డబ్...’’ అని, తమాయించుకుని ‘‘వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన కాగితాలు పెట్టాను. ఎవడికిచ్చావో గుర్తుందా, రా, బండెక్కు’’ అని దాదాపు అరిచినంత పని చేశాడు. మైథిలి కిక్కురుమనకుండా స్కూటరువెనక కూర్చుంది. దారిలో సింహాచలాన్ని వర్ణించి చెప్పింది. ఇద్దరూ ఓ గంటన్నర తెగ తిరిగి ఉస్సురుమంటూ ఇల్లు చేరారు. మోహన్‌రావు ధుమధుమలాడుతూ సోఫాలో కూలబడ్డాడు.‘‘అందులో ఇంపార్టెంటు పేపర్లా, లేక డబ్బు పెట్టారా. నాకు నిజం చెప్పండి. మీ వాలకం చూస్తే పేపర్లు పోయినట్టనిపించట్లేదు’’ అంటూ కొంచెం దబాయించి చూసింది.మోహన్‌రావు కిమ్మనకపోయేసరికి ఆమెకి కొంచెం ధైర్యం పాలు ఎక్కువైంది. దాంతో కాస్త పుంజుకుని ‘‘ఎన్ని వేలు ఉన్నాయందులో’’ అంది. ‘‘కాస్సేపు నోరు మూసుక్కూర్చుంటావా’’ అన్నాడు మోహన్‌రావు. కానీ మైథిలికి తనమీద తనకు నమ్మకం ఎక్కువైంది. కాస్సేపాగి, ‘‘ఓ పది వరకూ ఉండొచ్చా. చెప్పండి. పోయిన దాన్ని బట్టి ప్రయత్నం చేయడమా, మానడమా ఆలోచిస్తా. నాలుగిళ్లు వాకబు చేస్తే ఆ ముసిల్దాన్ని ఈజీగా పట్టియ్యచ్చు’’ అంది.ఈలోగా గేటు శబ్దమయితే అటు చూసి, ‘‘అయ్! అదిగో ఆ ముసిల్దే వచ్చింది’’ అని ఒక్క గంతులో గుమ్మం దాటి గేటు దగ్గరికి చేరింది. మోహన్‌రావు కూడా ఒక్క ఉదుటున హాలు దాటి గేటు దగ్గరకు చేరాడు. ‘‘మీ పేపర్లలో ఈ కవరొకటి ఉంది’’ అంటూ సింహాచలం ఆ కవరు మైథిలి చేతిలో పెట్టేలోపు మోహన్‌రావు గద్దలో ఆ కవర్‌ను లాక్కున్నాడు. ‘‘అందులో డబ్బు సరి చూసుకోండి’’ అంది సింహాచలం. ‘‘ఎంతుందే అందులో’’ అంది మైథిలి. ‘‘పదివేలు’’ అంది సింహాచలం. ‘‘పదివేలా.. అంతేనా.. నువ్వేమయినా..’’ అని మైథిలి నిలదీయబోయింది. ‘‘అలా చేసేదాన్నయితే.. ఈ డబ్బు కూడా పట్టుకొచ్చి ఇవ్వక్కర్లేదు’’ అంది సింహాచలం. కవరు సరిచూసుకున్న మోహన్‌రావు సంతృప్తిగా, గాలిపీల్చి, ‘‘సరిపోయిందిలే’’ అని, ‘‘ఇందా.. ఈ వంద ఉంచుకో’’ అని ఓ వంద రూపాయలు ఇచ్చాడు. సింహాచలం ఆ వంద తీసుకుని, తన మొల్లో దోపుకున్న గుడ్డ సంచీలో పెట్టి, అందులోంచి ఓ ఇరవై రూపాయలు తీసి, ‘‘నే మోసపోయినదంతే బాబూ’’ అంది.‘‘అదేమిటీ?’’ అన్నాడతను. ‘‘చెప్తా’’ అంటూ సింహాచలం చంకలో ఉన్న గోని సంచిలోంచి కొన్ని నాపరాయి ముక్కలు తీసి మైథిలి చేతిలో పెడుతూ, ‘‘ఇవి పేపర్ల మధ్యలో ఉన్నాయమ్మా. ఈ రాళ్లు మళ్లీ మీకు అవసరపడొచ్చు. తూకం తేడా డబ్బులు అయ్యగారి వద్ద తీసేసుకున్నాను’’ అంది. వారిద్దరూ నిర్ఘాంతపోయి, తేరుకునేలోగా సింహాచలం రోడ్డు మీదికి వచ్చేసింది. ఆమె మనస్సు తేలికపడి, హాయి అనిపించింది. - ఫాలక్షుడు -
సింహాచలం కొండలపై మంటలు
-
షూటింగ్‌లకు విశాఖ అనువైన ప్రదేశం
సింహాచలం: సినిమా షూటింగ్‌లకు విశాఖ ఎంతో చక్కనైన ప్రదేశమని, రానున్న రెండు మూడేళ్లలో ఇక్కడ నిరంతరం సినిమా షూటింగ్‌లు జరుగుతాయని, ఆ విధంగా పరిశ్రమని అభివృద్ధి చేయబోతున్నామని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం ఆయన దర్శించుకున్నారు. కప్ప స్తంభానికి మొక్కుకుని స్వామికి అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బాలకృష్ణ హీరోగా తాను నిర్మిస్తున్న జై సింహా సినిమా విశేషాలను తెలిపారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఫిల్మ్ ఇండస్ట్రీస్‌కి ఫైవ్‌స్టార్ ఫెసిలిటీస్‌తో వృద్ధాశ్రమాలు ఉండాలని భావిస్తున్నానన్నారు. -
అప్పన్న హుండీ లెక్కింపు
సింహాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది మంగళవారం ఉదయం లెక్కించారు. గడిచిన 20 రోజులకు గాను రూ. 70,21,195 నగదుతో పాటు 61 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి భక్తులు సమర్పించినట్లు ఈవో కోడూరి రామచంద్రమోహన్ తెలిపారు. శ్రావణ మాసం కావడంతో భక్తుల రాక మరింత పెరిగే అవకాశముందని... ప్రతి శుక్రవారం మహిళలను దృష్టిలో పెట్టుకుని ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కల్యాణ మండపాలన్నీ రద్దీగా ఉన్నాయని.. వాటి కారణంగా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. -
అన్యాయమో... రామచంద్రా!
►సింహాచలంలో ఈవో ఇష్టారాజ్యం ►చందనోత్సవంలో సంప్రదాయాలకు తిలోదకాలు ►ఘటాభిషేకానికి జీయర్లను ఆహ్వానించని వైనం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవంలో దొర్లిన తప్పులు ఈవో కె.రామచంద్రమోహన్ మెడకు చుట్టుకుంటున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చందనోత్సవ నిర్వహణ జరిగిందన్న వాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ ఆచార సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ కేవలం రాజకీయ వీఐపీలకే ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. విశాఖపట్నం : ఏడాదికొక్క రోజు మాత్రమే నిజరూపదర్శనమిచ్చే స్వామి వారి చందనోత్సవానికి లక్షలాదిమంది భక్తులు పోటెత్తుతారు. శనివారం నాటి చందనోత్సవానికి కూడా రెండు లక్షలమందికి పైగా భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. సామాన్య భక్తులను పక్కనపెట్టి వీఐపీలకే ప్రాధాన్యనమివ్వడం అన్ని దేవాలయాల్లోనూ ఓ తంతుగా మారినా.. సింహాచలంలో మాత్రం సంప్రదాయాలను సైతం పక్కనపెట్టి అధికారులు కేవలం వీఐపీల సేవలో తరించడం వివాదాస్పదమవుతోంది. శనివారం తెల్లవారుజామున అనువంశిక ధర్మకర్త, కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిదర్శనం తర్వాత 2.45 గంటల నుంచి సామాన్యభక్తులకు స్వామి వారి దర్శనానికి అనుమతిచ్చారు. వాస్తవానికి ఈ సమయంలో వీఐపీలు, ప్రొటోకాల్ వీఐపీల దర్శనాలు చెల్లవు. వీరికి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. కానీ ఈసారి సామాన్య భక్తులకు నిర్దేశించిన వేళల్లోనూ వీఐపీలకు అనుమతినిచ్చారు. వీఐపీలతో పాటు వారి మందీమార్బలం పెద్దసంఖ్యలో రావడంతో సామాన్య భక్తులకు చుక్కలు కనిపించాయి. ఉచిత క్యూలైన్ భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో సింహగిరి బస్టాండ్ వరకూ లైన్ వచ్చింది. అక్కడ ఎటువంటి టెంట్లు లేకపోవడంతో మండుటెండలో భక్తులు నరకం చవిచూడాల్సి వచ్చింది. ఉచిత ప్రసాద వితరణ సంస్థల పట్ల అనుచిత వైఖరి చందనోత్సవం నాడు స్వామి వారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎన్నో ధార్మిక, స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా ప్రసాదం, అల్పాహారం అందిస్తుంటాయి. అయితే, ప్రసాద వితరణ నిమిత్తం ఆయా సంస్థలకు దేవాలయ ప్రాంగణాల్లో కనీస ఏర్పాట్లు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ట్రస్ట్, శ్రీ గోపాల్ బాబా చారిటబుల్ ట్రస్ట్. హరేకృష్ణ మూమెంట్ (అక్షయపాత్ర) సహా 34 ధార్మిక, సేవా సంస్థల ప్రతినిధులు కొండపైన వివిధ ప్రాంతాల్లో ఉచిత ప్రసాద వితరణ నిమిత్తం అనుమతి తీసుకున్నారు. అలాగే కొండ కింద ప్రాంతాల్లో ప్రసాద వితరణ చేసేందుకు 21 సంస్థలు ముందుకొచ్చాయి. ఆయా సంస్థలకు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు గాను అనుమతులు ఇచ్చేందుకే రోజుల తరబడి తిప్పిన దేవస్థానం అధికారులు చందనోత్సవం రోజు వారికి నరకం చూపించారు. సంస్థల ప్రతినిధులకు కనీసం టెంట్లు, కుర్చీలు కూడా ఇవ్వలేదు. ప్రసాదాలను కింద నుంచి కొండపైకి పైకి తీసుకువచ్చేందుకు వాహనాలకు చివరిక్షణం వరకు అనుమతినివ్వకుండా చాలా ఇబ్బంది పెట్టారని ఓ ధార్మిక సంస్థ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు. తమ సంస్థ దశాబ్దాలుగా చందనోత్సవం నాడు కొండపై సేవలందిస్తోందని, ఎప్పుడూ ఇటువంటి ఇబ్బంది చూడలేదని చెప్పుకొచ్చారు. -
వరాహ లక్ష్మీ నరసింహ స్వామి నిజరూప దర్శనం
నిత్యం చందనపు పూతల మాటున అసలు రూపమేమిటో అంతుపట్టకుండా ఉంటాడాయన. ఏడాదికి ఒక్కసారి మాత్రం ఆ చందనపు పూతలను తొలగించుకుని, భక్తులకు తన నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తాడా స్వామి. ఆయనే సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి. స్వామి నిజరూప దర్శనం లభించే ఈ శుభ తరుణం... ఈ నెల 29, శనివారం అక్షయ తదియ నాడే. ఈ సందర్భంగా ఆలయం గురించిన ఆసక్తికరమైన విశేషాలు... చుట్టూ కొండలు, అనాస, జీడి, మామిడి, పనస, సంపెంగ తదితర వృక్ష, ఫల, పుష్ప వనాల మధ్య సింహాచల క్షేత్రం విరాజిల్లుతోంది. హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుని సంహరించిన నారసింహ అవతారాల కలయికలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఇక్కడ వెలిశాడు. విహంగ వీక్షణంలో ఈ కొండ సింహాకారంలో కనిపిస్తుంది. దాంతో ఈ క్షేత్రాన్ని సింహగిరిగా కూడా పిలుస్తారు. అద్భుత శిల్పసంపద అద్భుతమైన శిల్పసంపద, రాతి కట్టడాలతో ఆలయం నిర్మితమైంది. ఆలయంలోని బేడా మండపం, ఆస్థానమండపం, భోగమండపం, అంతరాలయంలో స్వామి వేంచేసే ప్రహ్లాదమంటపం, కల్యాణమంటపం, హంసమూల రాతిరథం, రాజగోపురం ఈ క్షేత్రంలో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. బేడామండపంలో 32 నారసింహ రూపాలు దర్శనమిస్తాయి. మహిమాన్విత కప్పస్తంభం ఎంతో మహిమాన్వితమైన కప్పస్తంభం ఆలయంలో ఉంది. పూజారులు భక్తులను ఈ స్తంభానికి కట్టివేసి, కొంత కప్పం చెల్లిస్తే విడిపిస్తారు. అందుకే ఈ స్తంభానికి కప్పస్తంభమని పేరు. ఇలా చేస్తే మంచిదని విశ్వాసం. సంతాన వేణుగోపాలస్వామి యంత్రం ఈ స్తంభం అడుగుభాగంలో ప్రతిష్టింపబడింది. ఈస్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని విశ్వాసం. అలాగే పిల్లలు లేని దంపతులు ఈ స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే సంతానప్రాప్తి కల్గుతుందని చెబుతారు. పాపాలను నశింపజేసే గంగధార ఈ క్షేత్రానికి ఈశాన్య దిక్కులో నిత్యం పారే గంగధార ఎంతో విశిష్టమైనది. ఇక్కడ స్నానమాచరిస్తే పాపాలు నశిస్తాయని, ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయని చెబుతారు. స్థలపురాణం: హిరణ్యకశిపుడి కోపోద్రేకానికి గురై ప్రహ్లాదుడు విశాఖ పూర్వ సముద్రంలో పడవేయబడతాడు. ప్రహ్లాదుడ్ని రక్షించేందుకు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి జారుతున్న వస్త్రాన్ని ఒకచేతితోను, మరొక చేతితో గరుత్మంతునికి అమృతాన్ని అందిస్తూ అమితవేగంతో ఒక్కసారిగా ఈ కొండపైకి దూకి ప్రహ్లాదుణ్ణి ర క్షించాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి సింహగిరిపైనే ఉండి కొంతకాలం పూజలు అందుకున్నాడు. ప్రహ్లాదుడి అనంతరం పూజలు చేసేవారు కరువవడంతో మరుగునపడ్డ స్వామిపై పెద్ద పుట్ట వెలిసింది. కొంతకాలానికి షట్చక్రవర్తులలో ఒకరైన పురూరవుడు తన భార్య ఊర్వశితో కలిసి హంసవాహనంపై ఆకాశమార్గంలో విహారయాత్ర చేస్తుండగా ఉన్నట్టుండి హంసవాహనం ఈ కొండపై ఆగిపోయి ఎంతకీ కదల లేదు. చేసేదేమీ లేక ఆరోజు రాత్రి పురూరవుడు భార్యతో సహా ఈ కొండపైనే నిద్రించాడు. పురూరవుడికి స్వప్నంలో సాక్షాత్కరించిన స్వామి పుట్టలో తాను ఉన్న విషయాన్ని చెప్పాడు. పుట్టను తొలగించి ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు. పుట్టమన్నుకు బదులుగా తనపై చందనాన్ని పూయాలని, ఏడాదంతా చందనంతో నిత్యరూపంతోనూ, ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం చందనం మణుగుల్లోంచి బయటకి వచ్చి నిజరూపాన్ని కల్పిస్తానని తెలియజేశాడు. స్వామి ఆజ్ఞ ప్రకారం పురూరవుడు పుట్టను తొలగించి స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. పురూరవుడు స్వామిపై ఉన్న పుట్టను తొలగించిన రోజే వైశాఖ శుద్ధ తదియ పర్వదినం. దీంతో ఈ రోజున ప్రతి ఏటా ఈ క్షేత్రంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ ఒక్కరోజే స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల చొప్పున చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు నిజరూపదర్శనం అనంతరం తొలివిడతగా మూడు మణుగుల చందనాన్ని సమర్పించి స్వామిని మళ్లీ నిత్య రూపుణ్ణి చేస్తారు. తదుపరి వైశాఖ, జ్యేష్ట, ఆషాడ పౌర్ణమి రోజుల్లో మరో మూడేసి మణుగులు చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. ఆద్యంతం సంప్రదాయకం నాలుగు విడతలుగా సమర్పించే చందనాన్ని సిద్ధం చేయడం కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ఆలయ సిబ్బంది ఎంతో నియమ నిష్ఠలతో ఆలయ బేడా మండపంలో చందనాన్ని అరగదీస్తుంటారు. ఒక్కో విడతలో నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఈ అరగదీత కార్యక్రమం ఉంటుంది. ఇలా అరగదీసిన చందనంలో అర్చకులు పలు సుగంధ ద్రవ్యాలను కలిసి స్వామికి లేపనంగా అద్దుతారు. సింహా చలంలో చూడదగ్గ ప్రదేశాలు సింహాచలం క్షేత్రానికి సమీపంలో పలు చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. దేవస్థానానికి చెందిన వరాహ పుష్కరిణి, భైరవస్వామి వేంచేసిన భైరవవాక, ఉద్యానవనం చూడదగ్గ ప్రదేశాలు. ఎలా చేరుకోవాలి.... విశాఖపట్నం ఆర్టీసికాంప్లెక్స్, రైల్వేస్టేషన్ల నుంచి ప్రతి పది నిమిషాలకు ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆర్టీసి కాంప్లెక్స్ నుంచి అయితే సింహాచలం 16 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి అయితే 15 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కొన్ని బస్సులు నేరుగా కొండపైకి వెళ్తాయి. విమానమార్గం: సింహాచలంకి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో విశాఖ విమానాశ్రయం ఉంది. విమానాశ్రయం బయటకి రాగానే 55 నెంబరు బస్సులు సింహాచలం వెళ్లేందుకు అందుబాటులో ఉంటాయి. – అవసరాల గోపాలరావు, సాక్షి, సింహాచలం -
అప్పన్న సన్నిధిలో సినీ డైరెక్టర్
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు శ్రీను వైట్ల గురువారం దర్శించుకున్నారు. వరుణ్‌తేజ్, హెబ్బాపటేల్, లావణ్యత్రిపాఠి నటించిన మిస్టర్ సినిమా శుక్రవారం విడుదల అవుతుండటంతో ఆ సినిమా విజయవంతం అవ్వాలని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామికి శ్రీను వైట్ల పూజలు నిర్వహించారు. సెన్సార్ స్క్రిప్టును స్వామి సన్నిధిలో ఉంచి అష్టోత్తర పూజ చేశారు. కప్పస్తంభానికి మొక్కుకున్నారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనువైట్ల స్థానిక విలేకర్లతో మాట్లాడారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి అంటే ఎంతో ఇష్టదైవమన్నారు. ప్రతీ సినిమా రిలీజ్‌కి ముందు స్వామిని దర్శించుకోవడం జరుగుతోందన్నారు. సింహగిరికి ఎప్పుడు వచ్చినా పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నారు. లక్ష్మీనరసింహ బేనర్‌పై తెరకెక్కిన మిస్టర్ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మిస్టర్ సినిమా అలరిస్తుందన్నారు. ప్రస్తుతం రెండు కథలు సిద్దం చేసుకున్నానని, తదుపరి చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు -
అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు
విశాఖపట్నం: సింహాచలం గోశాలలో సోలార్ విద్యుత్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. కల్యాణ మండపం, సత్రాలు, డార్మిటరీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంతరాలయంలో అప్పన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నారు. -
అప్పన్న సేవలో సుప్రీం న్యాయమూర్తులు
విశాఖపట్నం: విశాఖ జిల్లా సింహాచలంలో కొలువైన సింహాద్రి అప్పన్నను శనివారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ లావు నాగేశ్వరరావు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం న్యాయమూర్తులకు వేదపండితులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
అప్పన్న సన్నిధిలో ప్రముఖులు
సింహాచలం : శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈస్టు కోస్టు రైల్వే జనరల్ మేనేజర్ ఉమేష్‌సింగ్ దంపతులు, ఎల్.పాణిగ్రహి స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. వీరంతా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకొని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అధికారులు ప్రసాదాన్ని అందజేశారు. -
అశ్లీల నృత్యాలపై విచారణకు ఆదేశం
విశాఖ : పవిత్ర పుణ్యక్షేతం సింహాచలంలో వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాల ఘటనపై విశాఖ పోలీస్ కమిషనర్ యోగానంద్ స్పందించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ఆయన వేటు వేశారు. సింహాచలంలో వినాయకచవితి భద్రతా విధుల్లో ఉన్న ఏసీపీ భీమారావు, సీఐ బాల సూర్యారావులను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణకు యోగానంద్ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై అడిషనల్ సీపీ సత్తార్ ఖాన్ విచారణ జరపనున్నారు. కాగా అప్పన్న ఆలయం సమీపంలో వినాయక చవితిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అశ్లీలం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మద్యం సేవించిన కొందరు యువకులు ఓ మహిళా డ్యాన్సర్ తో అసభ్యకర భంగిమల్లో నృత్యం చేయించారు. పోలీసులు పెట్రోలింగ్ కు వచ్చినా ఎదురుగా అశ్లీల నృత్యాలు జరుగుతున్నా పట్టించుకోలేదు. దీంతో రాత్రి మొదలయిన ఈ నృత్యాలు తెల్లవారుజాము వరకూ కొనసాగాయి. అయితే పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వార్తలు మీడియాలోనూ ప్రసారం కావటంతో విశాఖ పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు. -
పవిత్రోత్సవాలకు పట్టువస్త్రాలు బహూకరణ
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో త్వరలో జరిగే పవిత్రోత్సవాలను పురస్కరించుకుని బెంగళూరుకి చెందిన సుందరరాజగోపాలన్ రూ. 50వేలు విలువచేసే పట్టు వస్త్రాలను గురువారం బహూకరించారు. ఉదయం స్వామి దర్శనానికి వచ్చిన దాత సంబంధిత పట్టువస్త్రాలను ఆలయ సూపరింటిండెంట్ కష్ణారావుకు అందజేశారు. పవిత్రోత్సవాల రోజుల్లో ఆలయంలో ఉన్న దేవతామూర్తులకు పట్టువస్త్రాలను అలంకరించనున్నారు. -
లారీని ఢీకొట్టిన బస్సు: 10 మందికి గాయాలు
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు సమీపంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ఈ రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్నలారీని బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విజయవాడ నుంచి సింహాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అప్పన్న సన్నిధిలో కేంద్ర బృందం
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖకి చెందిన వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులు దర్శించుకున్నారు. కర్ణాటకకు చెందిన తేజశ్వర్, దీపక్ కరియాని, బీహార్‌కి చెందిన సుమిత్ అగర్వాల్, చత్తీస్‌గఢ్‌కి చెందిన షామి మహ్మద్‌ఖాన్ తదితరులు స్వామిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. వీరంతా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. -
అప్పన్న హుండీ ఆదాయం రూ. 85.21 లక్షలు
సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి హుండీ ఆదాయం గడిచిన 21 రోజులకు 85లక్షల 21వేల 643 రూపాయలు వచ్చినట్టు సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. సింహగిరిపై ఆలయ బేడా మండపంలో సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. నగదుతో పాటు 115 గ్రాముల బంగారం, 6కిలోల 040 గ్రాముల వెండి లభించినట్టు ఈవో తెలిపారు. అలాగే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి సోదరి, అడవివరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారి హుండీ ఆదాయం 96వేల 695 రూపాయలు వచ్చినట్టు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈలెక్కింపులో దేవస్థానం అధికారులు, సిబ్బంది, శ్రీహరి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. -
శాకాంబరిగా బాలత్రిపురసుందరిదేవి
సింహాచల ః సింహగిరి క్షేత్రపాలకుడు త్రిపురాంతకస్వామి ఆలయంలో వేంజేసిన బాలత్రిపురసుందరీదేవి సోమవారం శాకాంబరిగా దర్శనమిచ్చింది. అధిక సంఖ్యలో భక్తులు శాకాంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మొత్తం 300 కిలోలతో 27 రకాల కూరగాయలతో అమ్మవారిని, త్రిపురాంతకస్వామిని, ఆలయంలో వేంజేసిన గణపతి, సుబ్రహ్మణ్యస్వామిలను అలంకరించారు. అలాగే ఆలయాన్ని కూడా అలంకరించారు. ఆలయ అర్చకుడు రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. -
సింహాచలంలో యువరాజ్
సింహాచలంః శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామిని యువరాజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కలెక్టరుగా పనిచేసిన కాలంలో ఏమైనా చేయాలనుకున్న పనులు చేయలేక అసంతప్తితో ఉన్నారా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ..సింహాచలంలో బీఆర్టీఎస్ పనులు పూర్తి చేయలేకపోయామన్నారు. ఒక కొలిక్కి వచ్చినా అది పూర్తికాలేదన్నారు. ప్రస్తుత కలెక్టరు ప్రవీణ్‌కుమార్ ఆ పనులు పూర్తిచేస్తారన్నారు. అలాగే సింహగిరి కొండలోంచి టర్నల్ ఏర్పాటు ఒకటన్నారు. వైదికవర్గాలను, పబ్లిక్‌ను ఒప్పించి చేయలేకపోయామన్నారు. శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి ఎంతో మహిమ గల దేవుడని, ఇక్కడ ఎంతో ప్రశాంతత ఉంటుందని తెలిపారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ధ్వజస్తంభం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడాచుట్టూ ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఈవొ కె.రామచంద్రమోహన్ అందజేశారు. -
26న పాదాలమ్మ, బంగారమ్మ పండుగ
సింహాచలం: సింహగిరి గ్రామదేవతలు పాదాలమ్మ, బంగారమ్మ పండుగ మహోత్సవాన్ని ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తొలేళ్ల ఉత్సవం, 26 సాయంత్రం నుంచి రాత్రి వరకు అనుపు మహోత్సవం జరుగుతుందన్నారు. 26న అప్పన్న దర్శనాలు మధ్యాహ్నం 2.30 గంటల వరకే... సింహగిరి గ్రామదేవతలు పాదాలమ్మ, బంగారమ్మ పండుగను పురస్కరించుకుని ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల వరకే సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి దర్శనాలు లభిస్తాయని ఈవో తెలిపారు. -
26న పాదాలమ్మ, బంగారమ్మ పండుగ
26న పాదాలమ్మ, బంగారమ్మ పండుగ బంగారమ్మ,పండగ bangaramma,festival,simhachalam సింహాచలం: సింహగిరి గ్రామదేవతలు పాదాలమ్మ, బంగారమ్మ పండుగ మహోత్సవాన్ని ఈనెల 26న నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తొలేళ్ల ఉత్సవం, 26 సాయంత్రం నుంచి రాత్రి వరకు అనుపు మహోత్సవం జరుగుతుందన్నారు. 26న అప్పన్న దర్శనాలు మధ్యాహ్నం 2.30 గంటల వరకే... సింహగిరి గ్రామదేవతలు పాదాలమ్మ, బంగారమ్మ పండుగను పురస్కరించుకుని ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటల వరకే సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి దర్శనాలు లభిస్తాయని ఈవో తెలిపారు. -
సింహగిరికి రెండో ఘాట్‌రోడ్డు
సింహాచలం: సింహగిరికి వెళ్లే ప్రస్తుత ఘాట్‌రోడ్డులో రోజురోజుకీ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం జరుగుతోంది. హనుమంతవాక జంక్షన్ నుంచి సింహాచలం వెళ్లే బీఆర్టీఎస్ మార్గంలోని పాత అడవివరం వద్ద మహాత్మా జ్యోతీబాఫూలే బీసీ గురుకుల పాఠశాలకి సమీపంలోంచి ఈ రెండో ఘాట్‌రోడ్డు ప్రారంభం కానుంది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే దీనికి శంకుస్థాపన జరిగినా పనులు మధ్యలో నిలిచిపోయాయి. ప్రస్తుతం తిరిగి ఘాట్ రోడ్డు నిర్మాణం వేగం పుంజుకుంది. సింహగిరికి రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణ పనులకు 2013 డిసెంబరు 11న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. మొత్తం 1.3 కిలో మీటర్లు పొడవు ఉండే ఘాట్‌రోడ్డు నిర్మాణానికి ఇక్కడి తోటల్లోంచి రోడ్డు ఫౌర్మేషన్ చేయడానికి, కల్వర్టులు నిర్మాణానికి తొలుత రూ.1.8 కోట్ల పనులకు దేవస్థానం టెండర్లు పిలిచింది. ఏడాదిలో పనులు పూర్తికావాలని సమయం నిర్దేశించింది. కానీ కాంట్రాక్టరు గడువు సమయానికి సగం పనులే చేసి వెళ్లి పోవడంతో దేవస్థానం అతని టెండరుని రద్దుæ చేసింది. అప్పటి నుంచి కొంతకాలం పనులు నిలిచిపోయాయి. అలాగే ప్రణాళిక కూడా మారుతూ వచ్చింది. 2016 మార్చిలో మళ్లీ రోడ్డు ఫార్మేషన్, బీటీ రోడ్డు నిర్మాణం, కల్వర్టులు, సైడ్ డ్రై న్స్, రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి రూ.3.3 కోట్లకి దేవస్థానం టెండర్లు పిలి చింది. ప్రస్తుతం మూడు నెలలు గా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్లా ఘాట్‌రోడ్డుని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. సింహాచలం రాకుండానే సింహగిరికి! రెండో ఘాట్‌రోడ్డు అందుబాటులోకి వస్తే నగరంలోంచి హనుమంతవాక మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులో వచ్చేవారు సింహాచలం రాకుండానే నేరుగా సింహగిరికి చేరుకోవచ్చు. గురుకుల పాఠశాల నుంచి ప్రారం¿¶ మయ్యే ఘాటోరోడ్డులోకి ప్రవేశించి నేరుగా శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి దర్శనానికి సింహగిరికి వెళ్లవచ్చు. దీంతో అక్కడి నుంచి సింహాచలం వచ్చే మూడు కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. ఘాట్‌రోడ్డు ఇలా : సింహాచలంలోని టోల్గేట్ నుంచి సింహగిరికి ఐదు కిలోమీటర్లు మేర ప్రస్తుత ఘాట్‌రోడ్డు ఉంది. అటు హనుమంతవాక నుంచి కానీ, ఇటు గోపాలపట్నం నుంచి కానీ ఏ వాహనమైనా ఈ ఘాట్‌రోడ్డులోంచి వెళ్లాల్సి వస్తోంది. హనుమంతవాక నుంచి సింహాచలం వచ్చే బీఆర్టీఎస్ రోడ్డులో గురుకుల పాఠశాల వద్ద నుంచి ప్రారంభమయ్యే 1.3 కిలోమీటర్ల రెండో ఘాట్‌రోడ్డుని ప్రస్తుతం ఉన్న ఘాట్‌రోడ్డులోని ఎన్టీఆర్ఘాట్వద్ద కలుపుతారు. దిగువకి వచ్చినప్పడు కూడా నగరంలోకి వెళ్లే వాహనాలు ఇక్కడ నుంచి వేరుకావచ్చు. అలాగే సింహగిరికి రద్దీ నెలకొనే సమయాల్లో కొత్త ఘాట్‌రోడ్డులోంచి వాహనాలకు కొండపైకి చేరుకునేలా, పాత ఘాట్‌రోడ్డులోంచి కిందకి చేరుకునేలా కూడా ప్రణాళిక చేశారు. పలు అభివద్ధి పనులు కూడా... కొత్తఘాట్రోడ్డు ప్రారంభమయ్యే ప్రదేశంలో దేవస్థానం పలు అభివద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టనుంది. దేవస్థానం పరిపాలనా భవనం, భక్తులు వేచి ఉండేందుకు డార్మెటరీలు, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాలు, వేద పాఠశాల, కల్యాణ మండపాలు నిర్మాణానికి ఇప్పటికే మాస్టర్‌ప్లాన్‌లో రూపొందించారు. అలాగే ఇక్కడే మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నారు. -
తీరు మార్చుకోని ఆర్టీసీ
సింహాచలం : ఆర్టీసీ సిబ్బంది తీరు మారలేదు. గతంలో లాగే ఈ సారికూడా టిక్కెట్‌పై అదనపు వసూళ్లకు పాల్పడి గిరి ప్రదక్షిణ భక్తులను దోచుకున్నారు. కొండ దిగువ నుంచి సింహగిరిపైకి ఉన్న టిక్కెట్టు ధరకన్నా అదనంగా మూడు రూపాయలను మంగళవారం భక్తుల నుంచి వసూలు చేశారు. కొండ దిగువ నుంచి సింహగిరిపైకి ఆర్టీసి బస్సుల్లో పెద్దలకు 17 రూపాయల టిక్కెట్టు వసూలు చేస్తారు. ఒప్పందం ప్రకారం ఆర్టీసీకి సంబంధించిన 12 రూపాయల టిక్కెట్టు, దేవస్థానంకి చెందిన 5 రూపాయల టిక్కెట్టు బస్సుల్లో విడివిడిగా కండక్టరు ఇస్తాడు. మంగళవారం మాత్రం భక్తుల నుంచి టిక్కెట్టుకు రూ.20లు వసూలు చేశారు. దేవస్థానం టిక్కెట్టు 5 రూపాయలు తీసేయగా మూడు రూపాయలను అధికంగా వసూలు చేశారు. కొన్ని సందర్భాల్లో అసలు దేవస్థానం టిక్కెట్టు ఇవ్వకుండానే మొత్తం టిక్కెట్టు ఆర్టీసీదే ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. పై విషయాలను పలువురు భక్తులు దేవస్థానం ట్రాన్స్‌పోర్టు సిబ్బంది దష్టికి తీసుకురాగా వారు ఈవో కె.రామచంద్రమోహన్ దష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఈవో సింహాచలం డిపో మేనేజర్ దివ్యతో ఫోన్లో సంప్రదించినా ప్రయోజనం లేకుండా పోయింది. గత ఏడాది కూడా భక్తుల నుంచి ఆర్టీసీ సిబ్బంది అధిక వసూళ్లకు పాల్పడితే దేవస్థానం ట్రాన్స్‌పోర్టు సిబ్బందే పట్టుకున్నారు. బస్సులను కొండపైకి వెళ్లనీయలేదు. అయినా ఈ ఏడాది కూడా వారి తీరు మారలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆధ్యాత్మిక సిరి..సింహగిరి
శ్రీ వరాహ లక్షీనసింహస్వామి దర్శనానికి మంగళవారం సింహగిరిపై భక్తులు పోటెత్తారు. 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఒకవైపు....ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి ఆలయ ప్రదక్షిణలు చేసేందుకు వచ్చిన భక్తులు మరోవైపు.... ఎటు చూసినా సింహగిరి ఆధ్యాత్మిక సిరిని సంతరించుకుంది. –సింహాచలం విశేషంగా ఆలయ ప్రదక్షిణలు ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి ఆలయ ప్రదక్షిణలు విశేషంగా జరిగాయి. ఐదువేల మంది వరకు భక్తులు ఆలయ ప్రదక్షిణ చేశారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచి భక్తులు ఈ ఆలయ ప్రదక్షిణలకు తరలివచ్చారు. ఆషాఢ పౌర్ణమి ముందురోజు సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు చేసే గిరి ప్రదక్షిణకు సమానంగా మూడు ఆషాఢ పౌర్ణమి రోజుల్లో శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి ఆలయం చుట్టూ 108 సార్లు చొప్పున చేసే ప్రదక్షిణలు కూడా సమానం కావడంతో ఈ ఏడాది కూడా భక్తులు ఆలయ ప్రదక్షిణల్లో విశేషంగా పాల్గొన్నారు. సింహగిరిపై అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు సోమవారం గిరి ప్రదక్షిణ ప్రారంభించి వచ్చిన భక్తులందరికీ మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామి దర్శనాలు కల్పించారు. లక్ష మంది వరకు భక్తులు స్వామి దర్శనాన్ని చేసుకున్నట్లు దేవస్థానం అధికారులు అంచనా వేశారు. కిక్కిరిసిన మెట్లమార్గం 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేసి సింహగిరికి చేరుకునే భక్తులతో మెట్లమార్గం కిక్కిరిసింది. భక్తులు ఒకరినొకరు తప్పించుకోలేని పరిస్థితి మెట్లమార్గంలో నెలకుంది. గిరి ప్రదక్షిణ పూర్తిచేసి తిరిగి సింహాచలం చేరుకున్న భక్తులు కొండదిగువ తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి మెట్లమార్గం ద్వారా సింహగిరికి చేరుకున్నారు. విశేషంగా ఏర్పాట్లు గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని సింహగిరికి వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో అధికారులు విశేషంగా ఏర్పాట్లు చేశారు. గిరి ప్రదక్షిణ చేసి దర్శనానికి వచ్చిన భక్తులు, ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కల్యాణమండపం నుంచి ఉత్తర రాజగోపురం వరకు బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై నుంచి దర్శనానికి వెళ్లే భక్తులను, కిందనుంచి ఆలయ ప్రదక్షిణలు చేసే భక్తులను అనుమతించారు. అలాగే దర్శనానంతరం బయటకు వెళ్లే దక్షిణ రాజపురం మార్గంలో కూడా శాస్త్రోక్తంగా ఆఖరి విడత చందన సమర్పణ ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామికి మంగళవారం ఆఖరి విడత చందన సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. తెల్లవారుజామన రెండు గంటలకు స్వామిని సుప్రభాతసేవతో మేల్కొలిపి మూడు మణుగుల(125 కిలోలు) చందనాన్ని స్వామికి సమర్పించారు. అనంతరం ఆరాధన చేశారు. చందనంతో దర్శనమిచ్చిన ఉత్సవమూర్తి శ్రీ వరాహ లక్ష్మీనసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి చందనంతో శ్రీదేవి, భూదేవి స్వరూపుడై భక్తులకు దర్శనమిచ్చాడు. భోగమండపంలోని మండపంలో వేంజేసిన స్వామిని అధికసంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. -
వైభవంగా సింహ గిరి ప్రదక్షిణ
విశాఖపట్నం: గురుపౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టు భక్తులు ప్రదక్షిణ మొదలుపెట్టారు. సింహగిరి తొలి పావంచా దగ్గర కొబ్బరి కాయ కొట్టి నమో నరసింహా అంటూ నడక ప్రారంభించిన భక్తులు... అడవివరం, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్ల పాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీ పాలెం మీదుగా సీతమ్మధార, పోర్టు స్టేడియం, కప్పరాడ, మురళీనగర్, మాధవధారకు చేరుకుంటారు. అక్కడ నుంచి హైవేపై ఆర్ అండ్ బీ, ఎన్ఏడీ, గోపాలపట్నం మీదుగా సింహాచలం కొండకు వెళ్తారు. -
పార్టీలకతీతంగా పోరాటంతోనే ప్రత్యేక హోదా
► శాసనమండలి చైర్మన్ చక్రపాణి ► అప్పన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు సింహాచలం: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పార్టీలకతీతంగా పోరాడి సాధించుకోవాలని శాసనమండలి చైర్మన్ చక్రపాణి అన్నారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని మంగళవారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యమన్నారు. అందరూ ఒక్కటై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పారు. కేంద్రంలో మిత్ర పక్షంగా ఉన్న టీడీపీ సామరస్యమైన చర్చలతో కూడా ప్రత్యేక హోదా సాధించుకోవచ్చన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు కల్పిస్తారా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వారెవరైనా అర్హులేనని చక్రపాణి బదులిచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టం.. దాని పని అది చేసుకుపోతుందన్నారు. ముందుగా చక్రపాణి దంపతులకు ఆలయ ధ్వజ స్తంభం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరం పూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన జరిపారు. నాలుగు వేదాలతో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఈవో కె.రామచంద్రమోహన్ అందజేశారు. -
ఎస్సై ఎదుటే వ్యక్తి ఆత్మహత్యాయత్నం
పెంటపాడు: తన కుమార్తె పెట్టిన వేధింపుల కేసుపై పోలీసులు స్పందించటం లేదంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పెంటపాడుకు చెందిన సింహాచలం కుమార్తె మీనా శిరీష వివాహం రెండేళ్ల క్రితం పరిమళ్ల గ్రామానికి చెందిన అట్టాడ వెంకటేశ్వరరావుతో జరిగింది. అయితే, కొన్నాళ్లకే అత్తింటి వారు మీనా శిరీషను పుట్టింట్లో వదిలేశారు. దీంతో ఆమె.. భర్త, అత్తింటి వారిపై వేధింపుల కేసు పెట్టింది. కేసు నమోదు చేసి ఏడాదైనా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదంటూ శుక్రవారం సింహాచలం ఎస్సై గుర్రయ్యను నిలదీశాడు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేయటంతో వెంట తెచ్చుకున్న పురుగు మందు తాగాడు. సింహాచలం పరిస్థితి విషమంగా మారటంతో తాడేపల్లిగూడెం తరలించారు. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
విశాఖపట్నం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం సింహాద్రి అప్పన్న చందనోత్సవం సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి చందనో త్సవానికి తొలి చందనాన్ని ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి నివేదన చేశారు. వంశపారంపర్య ధర్మకర్త, కేంద్ర మంత్రి పూసపాటి అశోకగజపతిరాజు, ఆయన కుటుంబసభ్యులు సోమవారం తెల్లవారుజామున తొలి దర్శనం చేసుకోనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో గంటా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందోనత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఉంగరం దొంగలు మీరేనా...!
సింహగిరిపై భక్తులను ప్రశ్నించిన అర్చకులు కన్నీటిపర్యవంతమైన భక్తులు ఉత్సవమని తెలుసుకుని ఆనందభాష్పాలు నవ్వుల సందడిగా జరిగిన వినోదోత్సవం సింహాచలం: ‘‘నిన్న రాత్రి స్వామివారి ఉంగరం పోయింది. మీరే దొంగిలించారని తెలిసింది. దయచేసి దొంగిలించిన ఉంగరాన్ని ఇచ్చేయండి. లేదంటే పోలీసులకు అప్పగిస్తాం...’’ అని స్థానాచార్యులు అడిగేసరికి భక్తులు ఆశ్చర్యపోయారు. స్వామి దర్శనానికి వస్తే ఉంగరం దొంగతనం చేశారంటారేంటి? తాళ్లతో బంధించి తీసుకురావడమేంటి? మేము దొంగల్లా కనిపిస్తున్నామా అంటూ స్థానాచార్యులను భక్తులు ఆవేశంతో ఎదురు ప్రశ్నించారు. చూడండీ.. మీరు దొంగతనం చేసినట్లు మా దగ్గర ఆధారాలున్నాయి. సీసీ కెమోరాల్లో కూడా రికార్డయ్యాయి. పోలీసులు తీసుకెళ్లకముందే ఉంగరాన్ని ఇచ్చేయండంటూ స్థానాచార్యులు మరల ప్రశ్నించేసరికి భక్తుల కళ్లంట నీళ్లు తిరిగాయి. దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా, అందరిమధ్యలో మీరే ఉంగరం దొంగతనం చేశారని స్థానాచార్యులు పదేపదే ప్రశ్నిచడంతో కన్నీటిపర్యవంతమవుతూ భక్తులు గంతులు వేశారు. తమ వైపు చూసి నవ్వుతున్న వాళ్లపై ఆవేశంతో చిందులు వేశారు. చివరికి ఇదంతా వినోదోత్సవంలోని ఘట్టాలని తెలుసుకుని ఆనందభరితులయ్యారు. తమకు మాత్రమే లభించిన ఈ అరుదైన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదీ... సింహగిరిపై శనివారం నవ్వుల సందడిగా జరిగిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వినోదోత్సవం. ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు జరుగుతున్న స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మృగయోత్సవంలో పోయిన స్వామివారి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై శనివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఏడు పరదాల్లో దాగున్న స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని రాజగోపురం వద్ద పల్లికీలో ఆశీనింపజేశారు. స్వామివారి దూతగా అర్చకుడు సీతారామాచార్యులు కర్రను చేతితో పట్టుకుని దర్శనానికి వచ్చిన భక్తులను ఉంగరం దొంగిలించారంటూ తాళ్లతో బంధించి తీసుకొచ్చారు. స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ దొంగిలించిన ఉంగరాన్ని ఇవ్వాలంటూ వారిని ప్రశ్నల వర్షం కురిపించారు. స్వామిపై ఉన్న ఒక్కొక్క పరదాని తొలగించారు. చివరికి ఆయన చివరి పరదాలోనే ఉంగరం దొరికింది. స్వామివారి దర్శనానికి ఎస్‌కోట నుంచి వచ్చిన డిగ్రీ విద్యార్థులు, నగరంలోని గాయత్రి విద్యా పరిషత్‌లో బిటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న మచిలీపట్నంకి చెందిన విద్యార్థినులు, గాజువాక కి చెందిన ఇంటర్ విద్యార్థినులు, విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన భక్తులు తాము దొంగతనం చేయలేదంటూ కన్నీటిపర్యవంతమయ్యారు. అనకాపల్లి ఎంపి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవస్థానం రిటైర్డ్ ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఏఈవొ మోర్తా వెంకటకృష్ణమాచార్యులు, ఏఈ రాంబాబు, సూపరింటిండెంట్ ఆనందకుమార్, కొత్వాల్‌నాయక్ మాణిక్యం, వంటశాల సిబ్బంది శ్రీను, కొత్తగా పెళ్లి చేసుకుని స్వామి దర్శనానికి వచ్చి నవ దంపతులు, మహిళలు సైతం దొంగలుగా చిక్కారు. -
కూతుళ్లను బావిలోకి తోసేసి, తానూ...
దంపతుల మధ్య కలహాలు మూడు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను బావిలోకి తోసేసి తాను కూడా దూకి, చనిపోయింది. విజయనగరం జిల్లా రాజాం మండలం గడ్డిముడిదాం గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గునుకూరు సింహాచలం, లక్ష్మి(32) దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం ఉదయం లక్ష్మి తన ముగ్గురు కూతుళ్లను తీసుకుని గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్దకు చేరుకుంది. చిన్న కుమార్తెలిద్దరినీ బావిలోకి నెట్టేసిన అనంతరం మూడో కూతురును కూడా పడేయాలని ప్రయత్నించింది. దీంతో ఆ బాలిక తల్లికి అందకుండా గ్రామంలోకి పరుగు తీసింది. అనంతరం లక్ష్మి కూడా బావిలోకి దూకేసింది. వెంటనే ఎవరూ గమనించకపోయేసరికి ముగ్గురూ చనిపోయారు. -
సింహాచలంలో తలనీలాలు చోరీ
సింహాచలం: మొక్కుల రూపంలో దేవునికి సమర్పించుకున్న తలనీలాలను గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విశాఖపట్నం సింహాచలం దేవస్థానంలో సోమవారం వెలుగుచూసింది. ఆలయంలోని కేశఖండనశాలలో గ్రేడింగ్ చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 15 బస్తాల తలనీలాలను దుండగులు అపహరించుకుపోయారు. ఇది గుర్తించిన ఆలయ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. చోరీకి గురైన తలనీలాల విలువ సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నతల్లిని గొడ్డలితో నరికాడు
మద్యానికి బానిసైన కన్నతల్లిని ఓ వ్యక్తి అంతంచేశాడు. విశాఖ జిల్లా పాడేరు మండలం లగిశపల్లిలో ఈ ఘటన జరిగింది. మసాడ సింహాచలం (40) అనే మహిళ మద్యానికి బానిసైంది. అలవాటు మానుకోవాలని కుమారుడు రమేష్‌బాబు తల్లికి చాలాసార్లు నచ్చజెప్పాడు. అయినా ఆమె ఆ అలవాటు వీడలేదు. దీంతో శనివారం రాత్రి రమేష్‌బాబు మద్యం సేవించి కన్నతల్లిని గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాలతో సింహాచలం మృతి చెందింది. ఈ ఘటన తర్వాత నిందితుడు పాడేరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. -
ఆస్తి తగాదాల వివాదంలో వ్యక్తి మృతి
ఆస్తి తగాదాల నేపథ్యంలో వరుసకు తండ్రి అయ్యే వ్యక్తిని యువకుడు కర్రతో చితకబాదాడు..దీంతో తీవ్రంగా గాయపడ్డ అతను ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం కోరాపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సోరాబు రాంనాయుడు(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన వరుసక కొడుకు అయ్యే సింహాచలంతో గత కొంత కాలంగా ఆస్తి విషయంలో తగాదా పడుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం ఇద్దరు కర్రలతో ఒకరి పై మరొక రు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రాంనాయుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సింహాచలం అప్పన్నను దర్శించుకున్న గవర్నర్
-
సింహాచలంకు పోటెత్తిన భక్తులు
-
అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళ్లి హీరో అయ్యాడు!
70 ఎంఎం సెల్యులాయిడ్‌పై మనల్ని మనం చూసుకుంటే ఎంత బావుంటుందోనని కలలు కనే యూత్ మన చుట్టూ లక్షల మంది ఉన్నారు. దానిని నిజం చేసుకోవడానికి కష్టపడుతున్న వారు కూడా వేలల్లో ఉన్నారు. సినీ వారసులు రాజ్యమేలుతున్న సమయంలో అవకాశాల కోసం ఏళ్లతరబడి ఫిల్మ్ నగర్ చుట్టూ తిరుతున్నారు. కానీ ఈ కుర్రాడు కాస్త డిఫరెంట్. షార్ట్ ఫిల్మ్‌లతో టాలెంట్ చూపించి అసిస్టెంట్ డైరక్టర్‌గా చేరి, ఆడిషన్స్‌లో చాన్స్‌ల కోసం వచ్చిన వారికి ఇలా నటించాలి...అలా నటించాలి... అని చూపిస్తూ దర్శకుడి కంట్లో పడ్డాడు. హీరోగా మారాడు. సినిమా పేరు ‘ఉయ్యాల జంపాల’. హీరోకు కావలసిన లక్షణాలు ఏమీ లేని బక్క పలచని కుర్రాడు ఎనర్జీతో ‘సినిమా చూపిస్త మామా’ అని ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించుకున్నాడు. అతనే వైజాగ్ కుర్రాడు రాజ్ తరుణ్. ఆ చిత్రం సక్సెస్ మీట్ సందర్భంగా వైజాగ్ వచ్చిన సందర్భంగా సాక్షితో ముచ్చటించాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే... - పెదగంట్యాడ అనుకోకుండా చాన్స్... ఉయ్యాల జంపాల సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్‌గా పని చెయ్యడానికి వెళ్లాను. రెండు వందల మందిని ఆడిషన్స్‌లో చూసినా ఎవరికీ నచ్చలేదు. ఆఖరికి డైరక్టర్ సీన్ పేపర్ నాకిచ్చి చెయ్యమని అడిగారు. నేను అలవాటు ఉండడం వల్ల సింపుల్‌గా చేసి చూపించా. వాళ్లకది నచ్చింది..నాకు చాన్సొచ్చింది. నేను వైజాగ్ లోకల్... నేను పుట్టింది పెరిగింది అంతా వైజాగ్‌లోనే, మా అమ్మ నాన్న ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటున్నారు. మేం సింహాచలం దగ్గర ప్రహ్లాదపురంలో ఉంటాం. మా నాన్న బ్యాంక్ ఎంప్లాయి, అమ్మ హౌస్ వైఫ్. సినిమా అంటే పిచ్చి... నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం. సొంతంగా సినిమా తియ్యాలని చిన్న చిన్న స్ట్క్రిప్ట్లు రాసుకుంటూ ఉండేవాడిని. 8వ తరగతితో ఉన్నప్పుడు మా యింట్లో ఉన్న చిన్న హ్యాండీ క్యామ్‌తో నేనే నటించి వీడియో చేశాను. ఎడిటింగ్ మ్యూజిక్ అన్నీ చేసి మా అన్నకు, నాన్నకు చూపించాను. వాళ్లకది బాగా నచ్చింది. డీవీడీ పెట్టుకునే చిన్న హ్యాండీ క్యామ్ కొనిచ్చారు. తర్వాత రెండు మూడు షార్ట్ ఫిల్మ్‌లు తీశాను. కాలేజ్‌లో సుభాష్(ఎమ్ఆర్ ప్రొడక్షన్ పేరుతో స్టూడెంట్స్‌తో షార్ట్ ఫిల్మ్‌లు చేశాడు) పరిచయం అయ్యాడు. తర్వాత వంద షార్ట్ ఫిల్మ్‌ల వరకూ చేశాం. అంత ఈజీకాదు... చిన్న క్యామ్, ఖాళీ రూమ్, ఫ్రెండ్స్ ఉంటే షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది. కానీ స్క్రిప్ట్ నుండి ప్రొడక్షన్ వరకూ వందల మందిని మేనేజ్ చేసి సినిమా తియ్యాలంటే అంత ఈజీ కాదు. షార్ట్ ఫిల్మ్‌లకు ఒక్క లాజిక్ ఉంటే కంప్లీట్ అవుతుంది. పెద్ద సినిమా సీన్ బై సీన్ లాజిక్ మిస్ అవ్వకుండా కంటిన్యూగా రెండున్నర గంటలు ప్రేక్షకుడిని భ్రమలో ఉంచాలి. లేదంటే ఎంత కష్టపడి సినిమా తీసినా చెత్త సినిమా అని ఒక్క మాటలో కొట్టి పారేస్తారు. ఊహించలేదు... ‘సినిమా చూపిస్త మావ’ సక్సెస్ మీట్ కోసం గాజువాక వచ్చాను. అప్పుడు అంత మంది జనం ఉంటారని ఊహించలేదు. కనీసం నేను నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాను. ఒకడు చెయ్యి, ఇంకొకరు కాలు, మరొకరు జుట్టు పట్టుకుని లాగుతుంటే ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే అయినా దీని కోసమే కదా ఇంత కష్టపడింది అని ఆనందంగా ఫీలయ్యా. ఒక విజయం సాధించగానే గర్వం తలకెక్కకూడదు. అది అదృష్టం మాత్రమే. నేను చేసింది చాలా తక్కువ అని బలంగా నమ్ముతాను. అందుకే అందరినీ గౌరవించి ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను. టిక్కెట్ల కోసం గొడవ చేసే వాడిని ‘ఒక్కడు’ సినిమా చూశాకే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. గోపాలపట్నం సుకన్య థియేటర్లో ఎక్కువ సినిమాలు చూసేవాడిని. ఎప్పుడూ టికెట్ల కోసం హాల్లో ఒక వ్యక్తితో వాదన చేస్తూ ఉండేవాడిని. అతను ఇక్కడి నుంచి పొమ్మని అరిచేవాడు. ఇప్పుడు సక్సెస్ టూర్లో ఆ థియేటర్‌కు వెళ్లి ఎప్పుడూ పొమ్మనేవారు, ఇప్పుడేంటి కొత్తగా రండి, రండీ అని గౌరవిస్తున్నారు.. అని చమత్కారంగా అడిగాను ఆరోజులు మళ్లీ వస్తాయా చెప్పండి... తర్వాతి సినిమా... డైరక్టర్ సుకుమార్ ప్రొడక్షన్లో 21ఎఫ్ అనే షూట్ జరుగుతోంది. కెమెరామెన్ రత్నవేలు, మ్యూజిక్ డెరైక్టర్ దేవీశ్రీ ప్రసాద్, సుకుమార్ గారు వీళ్లంతా నా ఫేవరెట్ టీమ్. ఎప్పటికైనా వీళ్లతో పని చెయ్యాలని కలలు కనేవాడిని. ఇంత తొందరగా ఈ అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. -
నల్లగొండ జిల్లాలో శ్రీకాకుళం వాసి మృతి
మఠంపల్లి (నల్లగొండ): వంతెన నిర్మాణ పనుల్లో పాల్గొంటున్న ఓ కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణా నదిపై వంతెన నిర్మాణం జరుగుతోంది. ఈ నిర్మాణ పనుల్లో శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం మర్లపాడు గ్రామానికి చెందిన ఎం.సింహాచలం (40) పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం పిల్లర్‌పైకి ఎక్కి పనులు చేస్తూ ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. సింహాచలానికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా కలిసి వంతెన నిర్మాణ ప్రాంతానికి సమీపంలోనే నివాసం ఉంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
'48 పశుగ్రాస కేంద్రాల ఏర్పాటు'
బొబ్బిలి: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 48 ఇంటిగ్రేటెడ్ లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ సెంటర్లు (సంతానోత్పత్తి, పశుగ్రాస సేవల కోసం) ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు పశుసంవర్థక శాఖ జేడీ సింహాచలం తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పాల ఉత్పత్తిపై రైతులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో పాల ఉత్పత్తి ప్రస్తుతం 4.49 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, దాన్ని 4.94 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు. -
సింహాచలంలో పోటెత్తిన భక్తులు
విశాఖపట్నం : సింహాచలంలో కోలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం శుక్రవారం భక్తులు పోటెత్తారు. స్వామి వారికి ఆలయ అర్చకులు ఆఖరి విడత చందనం సమర్పణ చేశారు. అదికాక ఆషాడ పౌర్ణమి సందర్భంగా సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్ల మేర ప్రదక్షణ (గిరి ప్రదక్షణ) పూర్తి చేసుకున్న భక్తులు అప్పన్న దర్శనం కోసం బారులు తీరారు. స్వామి వారి దర్శనం కోసం సుమారు 3 లక్షల మంది భక్తులు బారులు తీరారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు పంపిణీ చేస్తున్న లడ్డూలలో పురుగులు ఉండటం చూసి భక్తులు ఆందోళనకు దిగారు. ఆలయ అధికారుల తీవ్ర నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. -
కనుల పండువగా చందనోత్సవం
సింహాచలం: సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం(నిజరూపదర్శనం) మంగళవారం కనుల పండువగా జరిగింది. సోమవారం అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలు ప్రారంభించారు. సుప్రభాతసేవ, విష్వక్సేన పూ జ, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, కలశారాధన నిర్వహించారు. తదుపరి స్వామిపై ఉన్న 12 మణుగుల చందనాన్ని వెండి బొరుగులతో తొలగించి నిజరూపభరితుణ్ని చేశారు. తెల్లవారుజామున 2 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ఆనందగజపతిరాజు తొలిదర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం 2.30 గంటల నుంచి ఉచిత క్యూల్లో వేచివున్న సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు. దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. కాగా, దేవస్థానం క్యూలు, టెంట్లు ఏర్పాటు చేసినా సరిపోక పోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఎండలో విలవిల్లాడారు. పలు చోట్ల భక్తుల మధ్య తోపులాటలు జరిగాయి. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
-
కన్నుల పండుగగా సింహాద్రి అప్పన్న కల్యాణం
చైత్రశుద్ద ఏకాదశిని పురస్కరించుకుని విశాఖ జిల్లా సిహాచలంలో కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. సింహగిరిపై ఉన్న నృసింహ కల్యాణ మండపంలో భారీ ఎత్తున వేదిక ఏర్పాటుచేసి పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం వైదికులు కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిల ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలకరించి వేదికపై అధిష్టింపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, యజ్ఞోపవీత ధారణ, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో ఘనంగా జరిపారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందజేశారు. అంతకుముందు సాయంత్రం నాలుగు గంటల నుంచి కొట్నాల ఉత్సవం, ధ్వజారోహణం, ఎదురు సన్నాహోత్సవం నిర్వహించారు. రాత్రి 8 గంటల నుంచి సింహగిరి మాడ వీధుల్లో రథోత్సవాన్నినిర్వహించారు. రథోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు దంపతులు స్వామిని దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. -
సింహాచలం ఆలయ సమీపంలో చిరుత మృతి
-
సింహాచలం అప్పన్నను దర్శించుకున్న వైఎస్ జగన్
విశాఖపట్నం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద వైఎస్ జగన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నానని జగన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సింహాచలం భూముల సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మంగళవారం విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ ఆర్కే బీచ్ లో కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. శారదాపీఠంలోని పలు ఆలయాలను వైఎస్ జగన్ సందర్శించారు. శారదాపీఠం నిర్వహిస్తున్న చతుర్వేద యాగంలో పాల్గొన్నారు. స్వరూపానందస్వామి శారదాపీఠం విశిష్టతను తెలియజేశారు. -
సింహాద్రి అప్పన్న సేవలో వైఎస్ జగన్
-
'అప్పన్న' పచ్చలపతకం చోరీ స్టోరీ
మాజీ డీజీపీ ఎం.వి.భాస్కరరావు చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ పొద్దున్నే ఐదున్నరకు సింహాచలం ఆలయ పూజారుల నుంచి ఫోన్... ‘‘గర్భగుడిలో దొంగలు చొరబడి స్వామివారి ఆభరణాలన్నీ దోచుకుపోయా’’రని. తిరుపతి తర్వాత ఆ స్థాయి ఆదరణ ఉన్న ఆలయం సింహాచలం. తెలుగువారు, ఒడిశా భక్తులతో ఎప్పుడూ కిటకిటలాడే దేవాలయంలోకి దొంగలు రావడమేంటి? వెళ్లి చూస్తే దొంగలు గుడి వెనకద్వారం గొళ్లెం పగులగొట్టి లోపలికి వచ్చారు. స్వామివారి ఒంటిపై ఉన్న బంగారం మొత్తం తీసుకెళ్లిపోయారు. ఇంకా నయం... బోషాణం పెట్టె దగ్గరికి పోలేదని మనసులో అనుకుంటుండగా... ఆలయ పూజారి కంగారుగా ‘సార్... స్వామివారి మెడలోని పచ్చలపతకంతో ఉన్న హారం కూడా పోయింది సార్’ అన్నాడు. ఆ జిల్లా ఎంపీ హడావుడి చేయడం మొదలుపెట్టాడు. దొంగలెత్తుకుపోయిన పచ్చలపతకం ఐదు వందల ఏళ్లక్రితపుదనీ, అంతర్జాతీయ మార్కెట్లో దాని వెల ఎనిమిది వందల నుంచి వెయ్యికోట్లవరకూ పలుకుతుందనీ ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. 1978లో జరిగిన ఈ దొంగతనం కేసు చాలా పాపులర్ అయ్యింది. అప్పుడు నేను విశాఖపట్నం ఎస్పీగా పనిచేస్తున్నాను. ఎప్పటిలాగే ఉదయం నాలుగున్నరకు గుడి పూజారులు తమ పనులకు దిగారు. ఐదింటికి గర్భగుడి దగ్గరికి వెళ్లేసరికి దొంగతనం జరిగిన విషయం తెలిసింది. వెంటనే మాకు కబురు పంపారు. వాచ్‌మేన్‌ని అడిగితే రాత్రి ఒంటిగంటవరకూ మెలకువగా ఉన్నట్లు చెప్పాడు. తాను నిద్రలో ఉండగా ఈ ఘోరం జరిగినట్టు చెప్పాడు. దొంగతనం జరిగిన తీరును చూస్తే గుడిలో దొంగలు రెండుగంటలపాటు ఉన్నట్లు అర్థమవుతోంది. ఆరు కిలోమీటర్ల ఎత్తున ఉన్న దేవాలయం కొండ దిగి మెయిన్‌రోడ్డుపైకి వెళ్లాలంటే కనీసంరెండు మూడు గంటలు పడుతుంది. గుడికి వెళ్లే రోడ్డుగుండా దొంగలు వెళ్లే ఆస్కారం లేదు. ఎందుకంటే నాలుగింటినుంచే పాలవాళ్లు, పూలవాళ్లు, పండ్ల వ్యాపారులు ఆ మార్గం నుంచి వస్తుంటారు. ఇక మరో మార్గం అంటే గుడి వెనకవైపున్న అడవిలోనుంచి కాలినడకన పారిపోవాలి. ఆలస్యం చేయకుండా పోలీసులు అడవంతా గాలిస్తే దొంగలు దొరికే అవకాశం ఉంది. ఒకర్ని ఇద్దరినీ కాదు... డీఎస్పీతో సహా వందమందికిపైగా పోలీసుల్ని ఐదారు జట్లుగా చేసి అడవిలోకి పంపించాను. ఒత్తిడి కారణంగా... జరిగింది చిన్నచోరీ కాదు. బంగారం రెండు కిలోలకుపైగా ఉంటుందని చెబుతున్నారు. పచ్చలపతకమున్న హారం వల్ల నాపై ప్రెజర్ పెరిగిపోయింది. ఇప్పట్లోలా డాగ్స్టీం వంటివి లేవు. ఒకవేళ హైదరాబాద్ నుంచి కుక్కల్ని రప్పిద్దామన్నా రోజు పడుతుంది. హైదరాబాద్ నుంచి ఐజీ, డీఐజీ, ముఖ్యమంత్రిల నుంచి ఫోన్లు వస్తున్నాయి. అడవిలోకి వెళ్లిన పోలీసులేమో వెనక్కి వచ్చేసి ఎవరూ కనిపించలేదని చెప్పడం మొదలెట్టారు. నా అంచనా ప్రకారం వారు అడవిదాటిపోయే అవకాశమే లేదు. బాస్ దగ్గర లేకపోతే ఎవరికైనా అలుసేకదా! ఏం చేస్తాను... సంఘటనా స్థలానికి వెళ్లి జాగ్రత్తగా పరిశీలించాను. తాళం పగలగొట్టిన గడ్డపారకు బట్టచుట్టడం, దేవుడి దగ్గర ప్రసాదం మొత్తం తినడం, సగం కాల్చిన సిగరెట్ పీకలు... ఇది కచ్చితంగా బిట్రగుంట గ్యాంగ్ పనే అనుకున్నాను. వాళ్లే అనడానికి ఆలయ ప్రాంగణంలో దొరికిన సిజర్స్ బ్రాండ్ సిగరెట్ పెట్టె ఒక ఆధారమైంది. అప్పట్లో అంత ఖరీదైన సిగరెట్ కాల్చేవారు విశాఖపట్నం ప్రాంతంలోనే లేరు. గర్ల్‌ఫ్రెండ్‌ని అడిగితే... నేను ఉద్యోగంలోకి చేరిన కొత్తల్లో కొన్నాళ్లు గుంటూరులో పనిచేశాను. అక్కడే ఉండే బిట్రగుంట దొంగల గురించి తెలుసుకున్నాను. వాళ్లు దొంగతనం చేసే విధానం గురించి నాకు అవగాహన ఉంది. నాకు ఎప్పుడయితే అనుమానం వచ్చిందో ఆ గ్యాంగ్ లీడర్ చవటా ప్రసాద్ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాను. అతని స్పెషాలిటీ ఏంటంటే... దాదాపు నలభై ప్రాంతాల్లో గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. మా సింహాచలం ప్రాంతంలో కూడా ఒకామె ఉంది. ఆమెని స్టేషన్‌కి తీసుకొచ్చి నాలుగు కేకలు వేయగానే జరిగిందంతా చెప్పింది. చవటా ప్రసాద్, అతని గ్యాంగ్ మూడురోజుల క్రితమే తన ఇంటికి వచ్చి గుడికి సంబంధించి రెక్కీలు వేసుకుని పనిపూర్తిచేసుకుని పారిపోయారని చెప్పింది. బిట్రగుంట దొంగలముఠాకి అప్పట్లో పెద్ద పేరు. వాళ్లు క్రిమినల్ ట్రైబ్స్ అన్నమాట. దృఢంగా, తెలివిగా ఉండేవారు. చవటా ప్రసాద్‌పై అప్పటికే నలభై కేసులున్నాయి. ఆరుసార్లు పోలీసుల చేతుల్లోనుంచి తప్పించుకున్నాడు. మద్రాసు సెంట్రల్‌జైలు నుంచి కూడా తప్పించుకున్న చరిత్ర ఉంది. పదిహేను రోజుల్లో... దొంగలెవరో తెలిసిపోయింది కాబట్టి ప్రెజర్ తగ్గింది. కానీ ప్రతిపక్షంవారు, ఢిల్లీ అధికారులు పచ్చలపతకం దేశం దాటిపోతోందంటూ చేస్తున్న ఊహగానాలు ప్రశాంతత లేకుండా చేశాయి. ఆ పతకం శ్రీకృష్ణదేవరాయలు ఎంతో ప్రేమతో స్వామివారికి బహుమానంగా ఇచ్చారనీ, ఇలాంటి పతకం ఎలిజిబెత్‌రాణి దగ్గర కూడా లేదనీ, ఆ పతకంగానీ దొరక్కపోతే డిపార్టుమెంట్ పరువుపోతుందనీ నానాయాగీ చేశారు. దొంగలు ఎక్కడివారో తెలియగానే నేను వెంటనే గుంటూరు ఫోన్ చేసి బిట్రగుంట దొంగలుండే ప్రాంతంపై నిఘా పెట్టమన్నాను. నేను చెప్పిన పద్ధతిలోనే మెరుపుదాడి చేసి వారిని పట్టుకున్నారు. అందరూ దొరికారు కానీ చవటా ప్రసాద్ దొరకలేదు. దొరికినవారు బంగారాన్ని పంచేసుకుని ఎవరికివారు దాచేసుకున్నారు. అందరినీ ఇంటరాగేషన్ చేసి సొమ్ము మొత్తాన్ని రాబట్టాం. అరవైశాతం బంగారం దొరికింది. పెద్దవాటా తీసుకోవడం వల్ల ప్రసాద్ దగ్గర 40 శాతం సొమ్ము ఉండిపోయింది. పచ్చలపతకం ఉందో లేదో చూస్తే...దాన్ని ఐదు ముక్కలు చేశారు. మూడు ముక్కలు మాత్రమే దొరికాయి. 15వేలు మాత్రమే... దొరికిన బంగారం మొత్తం తీసుకెళ్లి మార్వాడి ముందుపెడితే పదిహేనువేల రూపాయలు కూడా ఉండదన్నాడు. పచ్చలపతకం గురించి అడిగితే... అవి జైపూర్ పచ్చలని చెప్పాడు. పెద్ద ఖరీదు కావన్నాడు. పూర్వంనాటి హారం కావడంతో నలుగురు నాలుగు రకాలుగా ఊహించుకుని మమ్మల్ని పరుగులు పెట్టించారు. అఫ్కోర్స్... ఖరీదైంది కాకపోయినా మా డ్యూటీ మేం చేసేవాళ్లం. దొంగలు దొరికినా, బంగారం దొరికినా... అసలైనవాడు దొరకలేదు. మా గాలింపు ఆగలేదు. ఐదేళ్ల తర్వాత... చవటా ప్రసాద్‌ని అరెస్ట్ చేస్తేగానీ సింహాచలం ఆలయం కేసు ఫైలు మూతపడదు. వెంటనే దొరకడానికి వాడు సామాన్యమైన దొంగా? వాడెంత డెడికేటెడ్ ఫెలో అంటే దొంగకి బలహీనత ఉండకూడదని మద్యం కూడా తీసుకోడు. ఎక్కడికక్కడ బలమైన నెట్వర్క్ ఉంటుంది. ప్రాంతాలవారీగా పోలీసుల బలహీనతలు కూడా తెలుసు వాడికి. సింహాచలం కేసు పెద్దదవడంతో జిల్లా జిల్లా జల్లెడ పట్టడం మొదలుపెట్టాను. ఇక లాభం లేదనుకుని వాడు దగ్గరున్న బంగారాన్ని అమ్మేసి వరంగల్ దగ్గర ములుగు ప్రాంతానికెళ్లి లారీల వ్యాపారం పెట్టాడు. చాలా బుద్ధిమంతుడిగా రంగేసుకుని బతకడం మొదలుపెట్టాడు. ఏదో ఒక సందర్భంలో మా కంట్లో పడ్డాడు. వెంటనే అరెస్ట్ చేశాం. మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరికి ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఆ రోజు సింహాచలం ఆలయం కేసు ఫైలు మూతపడింది. బిట్రగుంట దొంగలు దొంగతనం వృత్తిలో బాగా రిచ్ క్యాడరన్నమాట. వారు కేవలం అమావాస్య చీకట్లోనే దొంగతనానికి బయలుదేరేవారు. దానికి కూడా ఒక సెంటిమెంటు ఉండేది. అర్ధరాత్రి కోడిని కోసి దాని తలను నేలమీదకు విసిరేవారు. దాని ముక్కు ఏ దిశను చూపిస్తే ఆ దిశగా దొంగతనానికి బయలుదేరేవారు. దొంగతానికి వెళ్లినచోట ఏదైనా తినివస్తే... పాపం తగలదని వారి నమ్మకం! రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: ఎస్. ఎస్ ఠాకూర్ -
కొనసాగిన బినామీ రుణాల విచారణ
పార్వతీపురం/గరుగుబిల్లి: గరుగుబిల్లి మండలంల రావివలస పీఏసీఎస్‌లో బినామీ రుణ గ్రహీతల విచారణ నాలుగో రోజూ కొనసాగింది. శుక్రవారం జరిగిన విచారణకు 134 మందికి నోటీసులు జారీ చేయగా 76మంది హాజరయ్యారు. పీఏసీఎస్ కార్యాలయానికి విచారణకు వచ్చిన బాధితులు డీసీసీబీ అధ్యక్షురాలు మరిశర్ల తులసి, సర్పంచ్ బలరాం నాయుడు, సీఈఓ సింహాచలంలను అరెస్ట్‌చేయాలంటూ...నినాదాలు చేస్తూ..కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. బాధితులు కార్యాలయంలోనికి రాకుండా ఎస్సై డి.ఈశ్వర్రావు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్భంగా కార్యాలయం ఆవరణ లో ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అప్పు కావాలంటే కుంటి సాకులు చెప్పి...కాళ్లరిగేలా తిప్పించే పీఏసీఎస్‌లు...తాము కోరకుండా..తామెవరో తెలియకుండా..సభ్యత్వ నమోదు లేకుండానే.. తమ పేరున రూ.75వేలు రుణాలున్నట్లు...విచారణకు హాజరు కావాలంటూ...నోటీసులివ్వడం పట్ల బాధితుల ఆగ్రహోదగ్రులయ్యారు. ఈ సందర్భంగా చిలకాంకు చెందిన ద్వారపురెడ్డి సత్యనారాయణ, రావివలసకు చెందిన కోట సుమన్, కారివలసకు చెందిన పట్టా లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ బినామీ రుణాలు వాడేసి ఎవరి కొంప ముంచేస్తారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఎస్సై వారికి నచ్చచెబుతూ..విచారణ పూర్తి అయినవెంటనే ఏఎస్పీ ఇచ్చిన హామీ ప్రకారం దోషులు ఎంతటివారినైనా చట్టం శిక్షిస్తుందన్నారు. అనంతరం వారు రుణాల జాబితా కోరగా 4,514 మందికి సంబంధించిన రుణ జాబితాను అందజేశారు. దీంతో బాధితులు శాంతించారు. తర్వాత విచారణ కొనసాగింది. అప్పు ఎలా తీర్చాలి ఈ సందర్భంగా విచారణకు వచ్చిన వారిలో దత్తివలసకు చెందిన దత్తి కాం చన మాట్లాడుతూ కుంటిదాన్ని. నాకు లోనేటి బాబు. ఇప్పుడెలా తీర్చాలి ఆ లోనం టూ.. గుండెలవిసేలా రో దిస్తుంటే...చుట్టూ ఉన్నవారంతా ఆవేద న చెందారు. బిక్షమెత్తే నాకు లోనా! ఊరూరా...ఇంటింటికీ తిరిగి బిచ్చమెత్తుకుని పూటగడుపుతున్న తనకు లోనేంటని విచారణకు హాజరైన వారిలో చిలకాం గ్రామానికి చెందిన మారెడ్డి పార్వతి అనే యాచకురాలు వాపోయింది. ఆమె ఆవేదన అక్కడున్నవారందర్నీ కలచివేసింది. -
పెందుర్తి రెవెన్యూలో అవినీతి చేప
పెందుర్తి : పెందుర్తి రెవెన్యూ కార్యాలయంలో ఓ అధికారి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి పట్టుబడ్డాడు. ఎఫ్ లైన్ ధ్రువపత్రం కోసం రూ.5 లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ పొడుగు రవ్రీంద్రపాల్ గురువారం ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.నరసింహారావు తెలిపిన వివరాలు.. పెందుర్తి గ్రామానికి చెందిన మామిడి సింహాచలంకి పెందుర్తి సమీపంలో కొత్తవలస వెళ్లే రహదారి వద్ద 79 సెంట్ల భూమి ఉంది. సింహాచలం ఈ ఏడాది జూన్‌లో మరణించాడు. దీంతో అతడి పేరిట ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాన్ని సింహాచలం భార్య వెంకటేశ్వరమ్మ పేరిట మా ర్చుకునేందుకు సిద్ధమయ్యారు. అమ్మమ్మ తరపున ఆమె మనవడు సింహా చలం ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న యడ్ల రామారావు గత ఆగస్టు 30న ఎఫ్ లైన్ సర్టిఫికెట్ కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేశాడు. నిబంధనల ప్రకారం సర్వేయర్ భూమిని సర్వే చేసి రిపోర్టు ఇస్తే 45 రోజులకు ఎఫ్ లైన్ ధ్రువపత్రం వస్తోంది. అయితే సర్వేయర్ రిపోర్టు కోసం రూ.10 వేలు డిమాండ్ చేశాడు. రూ.5 వేలు ఇస్తానని రామారావు సర్వేయర్‌ను ఒప్పించాడు. నగదు ఇచ్చేందుకు సిద్ధమైన రామారావు బుధవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ప్రణాళిక ప్రకారం గురువారం పాల్‌కు లంచం ఇచ్చేందుకు వెళ్లగా ఏసీబీ అధికారులు రంగ ప్రవేశం చేసి అతడిని పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో రవీంద్రపాల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏసీబీ రూర ల్ డీఎస్పీ ఎన్.రమేష్, ఇన్స్పెక్టర్లు గణేష్, రామకృష్ణ పాల్గొన్నారు. -
మా గోవిందుడు అందరినీ అలరిస్తాడు...
అప్పన్నను దర్శించుకున్న చిత్ర నిర్మాత బండ్ల గణేష్ సింహాచలం: రామ్‌చరణ్ హీరోగా తాను నిర్మించి న ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని ఆచిత్ర నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. ఆదివారం ఉదయం సింహా చల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆయ న కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అక్టోబర్ ఒకటిన విడుదల అవుతున్న తమ చిత్రం విజయవంతంకావాలని స్వామికి పూజ లు నిర్వహించారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ‘గబ్బర్‌సింగ్’ సినిమా నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిం దన్నారు. అప్పటి నుంచి తన పరమేశ్వర ఆర్ట్స్ బేనర్ వేల్యూ పెరిగిందన్నారు. గోవిందుడు అందరివాడేలే కూడా స్వామి ఆశీస్సులతో పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ఒకటిన ఈ సిని మా రిలీజ్ అవుతోందన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్, జయసుధతోపాటు దాదాపు 60 మంది ప్రముఖ నటీనటులతో ఈ చిత్రాన్ని తీశామన్నారు. ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా, మానవతా విలువలు, తాతా మనవళ్ల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పేవిధంగా చిత్రాన్ని రూపొందించామన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. శరణ్య వేంకటేశునికి పూజలు ఆనందపురం: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ దంపతులు పైడా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఉన్న శ్రీ శరణ్య వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్నారు. ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా విజయవంతం కావాలని కోరుతూ వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు కిశోర్ ఆచార్యులు స్వాగతం పలికి పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను అంద జేశారు. -
అప్పన్న ధ్వజ స్తంభం శిథిల రాగం
పుచ్చిపోయిన 150 ఏళ్లనాటి స్తంభం కొత్తది ఏర్పాటుకు మీన మేషాలు టేకు మాను, రాగితాపడం ఎప్పుడో సిద్ధం అధికార, వైదిక వర్గాల తాత్సారం సింహాచలం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ధ్వజస్తంభం మార్చే పనులపై సింహాచల దేవస్థానం అధికార, వైదిక వర్గాలు తాత్సారం చేస్తున్నాయి. ధ్వజస్తం భాన్ని గడిచిన ఉత్తరాయణంలో మార్పు చేస్తామని ప్రకటించిన అధికార, వైదిక వర్గాలు ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్లి, మరో ఉత్తరాయణం సమీపిస్తున్నా ఆ విషయంపై దృష్టి సారించటం లేదు. వివరాల్లోకి వెళ్తే.... రాష్ర్టంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయ ప్రస్తుత ధ్వజస్తంభం సుమారు 150 ఏళ్ల క్రింతం ప్రతిష్టితమైంది. అది ప్రస్తుతం ఒకైవె పునకు వంగి ఉండటం, లోపల ఉన్న చెక్క పుచ్చిపోవడం వంటి పరిస్థితుల దృష్ట్యా నాలుగేళ్ల కిందటే కొత్త ధ్వజస్తంభం ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 2011లో అప్పటి ఈవో ప్రేమ్‌కుమార్ హయాంలో విశాఖ జిల్లా లంబసింగి అడవుల నుంచి 72 అడుగుల పొడవైన భారీ టేకు మానును తీసుకొచ్చారు. ఇంతలోనే ఆ పనులకు సంబంధించి కాంట్రాక్టర్ కోర్టు కేసు, టీటీడీతో కుదుర్చుకున్న ఒప్పందం తెరపైకి రావడంతో కొంతకాలం ఆ పనులు నిలిచిపోయాయి. తరువాత ఏడాది క్రితం ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో 2014 సంవత్సరం ఉత్తరాయణంలో కొత్త ధ్వజస్తంభం ప్రతిష్టిస్తామని వైదిక, అధికారులు ప్రకటించారు. ధ్వజస్తంభానికి అవ సరమైన రాగి తాపడాన్ని కూడా 2013 జూన్ నెలలో సిద్ధం చేశారు. మళ్లీ ఉత్తరాయణం సమీపిస్తున్నా ఆ పనులే జరగలేదు. ఇప్పటికే మూడున్నర ఏళ్ల నుంచి భారీ టేకు మాను ఎండకి ఎండి, వానకు తడుస్తోంది. రాగి తాపడం మూలన పడి ఉంది. రానున్న ఉత్తరాయణంలోనైనా నూతన ద్వజస్తంభం ప్రతిష్ట జరగాలని భక్తులు, ఇటు అడవివరం గ్రామస్తులు కోరుతున్నారు. -
అన్న ప్రసాద ప్రయాస
సింహాచలం ‘సిత్రాలు’ గంటల తరబడి భక్తుల నిరీక్షణ అన్నదాన సత్రంలో వినియోగంలో ఉన్నది ఒక అంతస్తే.. నత్తనడకన సాగుతున్న క్యూ కాంప్లెక్స్ అప్పన్న అన్న ప్రసాదం స్వీకరించాలంటే గంటలతరబడి నిరీక్షణ తప్పదు. భారీ అన్నదాన సత్రం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోవటం భక్తులకు శిక్షగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు అవస్థలు పడుతున్నారు. సింహాచలం : దివ్యక్షేత్రం పనుల్లో భాగంగా సింహగిరిపై సుమారు రూ. 4 కోట్లు వెచ్చిం చి భారీ అన్నదాన భవనాన్ని నిర్మించారు. ఒకేసారి 700 మంది వరకు భక్తులు కూర్చు ని భోజనం చేసే విధంగా రెండంతస్తులు ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర క్రితం నుంచి భక్తులకు ఆ భవనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దివ్యక్షేత్రం పనులు జరుగుతున్నప్పుడు తాత్కాలిక భవనాల్లో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ పక్కా భవనం నిర్మించాక తొలగిపోతాయని భక్తులు భావించారు. తీరా చూస్తే పరిస్థితి యథాతథంగానే ఉండటంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు.సింహగిరిపై నిత్యాన్నదాన భవనం వద్ద ప్రతిరోజు చోటు చేసుకుంటున్న వాస్తవ పరిస్థితులు ఇలా ఉన్నాయి. లక్ష్మీ నృసింహస్వామి ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటా రు. భక్తులకు దేవస్థానం నిత్యాన్నదాన పథకంలో ప్రతి రోజూ అన్నదానం చేస్తోంది. వీరి సౌకర్యార్థం సుమారు రూ.4 కోట్లు వెచ్చించి రెండంతస్తుల్లో నిర్మించిన భవననాన్ని ఏడాదిన్నర క్రితం అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి క్రింది అంతస్తులోనే భక్తులకు అన్నదానం చేస్తున్నారు. రెండవ అంతస్తును వినియోగించడం లేదు. దీంతో భక్తులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. వీరి కోసం పక్కా క్యూ కాంప్లెక్స్ నిర్మించలేదు. భవనానికి సమీపంలో ఉన్న తాత్కాలిక రేకుల షెడ్లో భక్తులు గంటల తరబడి నిలబ డాల్సి వస్తోంది. వృద్ధులు, చిన్నారులతో వచ్చిన భక్తులు పడుతున్న ఇబ్బందులు దయనీయం. శని, ఆదివారాలు, ఉత్సవాల రోజుల్లోనైతే మండుటెండలో భక్తుల క్యూ బారులు తీరి ఉంటుంది. గంటల తరబడి నిలబడలేక భక్తుల మధ్య తోపులాటలు కూడా జరుగుతున్నా యి. ఆకలి బాధలు తట్టుకోలేక దూసుకెళ్తున్న పరిస్థితులున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవ డం లేదు. సిబ్బంది కొరత వల్ల పై అంతస్తులో భోజనం సదుపాయాన్ని ఏర్పా టు చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. భక్తులు వేచి ఉండేందుకు రూ. 8 లక్షలతో క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టామని, తొందరలోనే పూర్తవు తుందంటున్నారు. -
గుడి పండగ
ఎఱంద ప్రాంతంలో అప్పలకొండ క్రీ.శ.1100 (నేటి సింహాచలం) పదం నుంచి పథంలోకి 14 మహాపాత్రుడు వైఖాసన క్రమంలో వరాహనృసింహుని దేవస్థానాధిపతి. క్షేత్రంలో భండారి, శ్రీకరణం, కోష్టకరణం (కొట్టులెక్కల అధికారి), ఆచార్యుడు, అర్చకులు, బోయలు, గొల్లలు, సానులు గల పరిషత్తులో అతడి మాటంటే వేదవాక్కు. అతడి కొడుకు తిరిగి వచ్చిన సందర్భంలో మహాపాత్రుని ఇంట్లో సందడి అంతింత కాదు. దానికి తోడు కటకమానపు గిరిప్రదక్షిణం కళింగంలోనే పెద్దపండగ. ‘పండగ కాగానే కోడలిని ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుంది, ఏమంటారు?’ అడిగింది మహాపాత్రుడి ఇల్లాలు. ‘అవునవును! ఇవాళ మంచిరోజు. శకునాలూ బాగున్నాయి. గుడికి వెళ్ళగానే నీ అన్నకి కమ్మ రాసి శ్రీకూర్మానికి పంపిస్తాను. కార్తీకమాసంలో ముహూర్తం పెట్టి పంపిస్తే మనవాణ్ని శోభనానికి పంపిద్దాం’ ‘మనమూ వెళ్దామండీ. అన్నయ్యనీ వదినెనీ చూసి చాలా నాళ్ళయింది’ ‘పోయిన సంక్రాంతికే గదే వెళ్లావ్? నేనయితే కోడలిని పెళ్ళిలో చూడటమే. ఏడే ళ్ళయింది. గుడి పనులతో క్షణం తీరిక దొరకదు. అయినా ఈసారి తప్పదులే. అప్పగింతలకి మనం లేకుంటే ఎలా?’ మూల కూర్చోని వెక్కివెక్కి ఏడుస్తోంది ముత్యాలు. ‘అక్కా! ఏడ్వమాకే. నువు లానంటే నానెట్టాగే పోయేది?’ పూరింటి వసారా అరుగు మీద బారెడు జడకి మొగలిరేకులు అల్లి, సింగారాన్ని రాగి అద్దంతో చూసుకుని మురిసిపోతూ అడిగింది దాని చెలె ్లలు కన్నమ్మ- ‘బేగా తయ్యరైపో. ఏటంటావ్?’ అంది. ‘ఆడ్ని పొట్టనెట్టుకున్న ఆ దేముణ్నేటికే నాను మొక్కేది? నువె ్వల్లు. నాను లాను’ కొంగుతో మొగం తుడుచుకుంటూ జవాబిచ్చింది ముత్యాలు. ‘నీవో మారు నాతో వచ్చీయ్. పెదపాత్రులకి మొరెట్టుకుని గుళ్ళో సాతాని పనో దివిటీల పనో ఏదన్నా ఇిప్పిస్తా’ అంటూ ప్రాధేయపడింది కన్నమ్మ. ‘ఆ దివిటీల పనే నా పానం తీసింది. మద్దిలపాలెం పండక్కి ఆయేళ పోమాకరా అంటే ఇనిపించుకోలేదు సచ్చినోడు. పందిరి అంటించి ఆడనే సచ్చాడు. నావొల్ల కాదులేయ్. ఒగ్గేయ్’ ‘కొండచుట్టే పండగే! తీర్థాల దంక తానాలు చేసి పొద్దుటాలకి వచ్చీయొచ్చు. దారంట ప్రతి పల్లెలో, పాలెంలో చలిది కుండలు, దద్దోనాలు పెడతారు. ఆడతా పాడతా పోయేసి మొక్కి తిరిగొచ్చీద్దాం’ ముత్యాలు మొగుడు అప్పడు గుళ్ళో దివ్వెకోల పట్టేవాడు. మద్దిలపాలెం ఊరి పండగలో చినరడ్డి పోయించిన కల్లు దాగిన మైకంలో ఆడే పందిరి అంటించాడని పంచాయతీ పెద్దలు తీరుమానం చేసారు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. ఏదన్నా పని లేకుంటే బతుకు గడవదు. సాతాని పనికి రోజుకి మూడు కాకిరూకల బత్తెం, గుళ్ళో ప్రసాదం, పానకం. కానీ ఆడు చేసిన తప్పిదానికి జాతర్లో ఆరుగురు చచ్చారు. ఆడికి బదులుగా పని అడిగేటికి మొగం చెల్లదు. ఏటి చేయాలో దిక్కుతోచని ముత్యాలుకి చెల్లెలి మాట సబబే అనిపించింది. సరే పద! అని బయలుదేరింది. గిరి ప్రదక్షిణం పనులకి తోడు రాజమహేంద్రి ఆస్థానం నుంచి గుడి లెక్కలు చూసేందుకు భోగపరీక్షకుడు (ఆడిటర్) వస్తున్నాడని కబురు వచ్చింది. కొష్టాల లెక్కలు, జీతబత్యాలు, స్వామివారి కానుకలూ కట్నాలే కాక గుడి మాన్యాలు, పశువులు, పాడి ప్రసాదాలు అన్నిటినీ పర్యవేక్షించి మహారాజుకి నివేదించడం అతడి పని. ఏమాత్రం లెక్కతప్పినా ఉద్యోగాలకే ముప్పు. దాంతో మహాపాత్రుడికి క్షణం తీరికలేదు. వియ్యంకుడికి కమ్మ రాస్తానన్న విషయం హడావుడిలో మరిచిపోయాడు. ‘వచ్చేవాడు యముడు! కైలాసనాథ దేశికుడు. శైవుడు! దక్షారామంలో శ్రీగంధం మూడు పుట్ల తేడా వచ్చిందని కోష్టకరణాన్ని తొలగించి గ్రామం నుంచి వెలి వేయించాడు. శివాలయంలోనే అలా చేస్తే మన నిలువుబొట్టని వదులుతాడా?’ బిక్కమొహంతో ఎదురు నిలిచాడు భండారి. ‘మన గుళ్ళో అలాంటి తేడాలకి ఆస్కారం లేదు. మొన్ననేగా చందనోత్సవం తరువాత అన్ని లెక్కలూ చూశాం. అనవసరంగా అధైర్యపడక ఈ పండగ పనులు చూడండి.’ ‘అలా కాదు పాత్రులూ! ఒకటా రెండా? డెబ్భైవేల వశువులు అంటే ఏడొందలకి పైన గొల్లకాపర్లు. కొండ చుట్టూ వెయ్యి గోచరాల పంటపొలాలు అంటే ఐదువేల కాపు కుటుంబాలు. పూలతోటల మాలదాసర్లు, పంచాణం వాళ్ళు, వంటవాళ్ళు, గుళ్ళో పని చేసే సాతానులు, భోగంవీధిలో సానులు... వీళ్ళలో ఏ ఒక్కరు తప్పు చేసినా అది మన తలకి చుట్టుకుంటుంది. ఒకసారి అందరినీ పిలిపించి లెక్కలు మరోసారి విచారిస్తే మంచిది.’ ‘సరే అలాగే చేద్దాం! అందరినీ రేపు ఉదయాన్నే పిలిపించండి’ ‘రేపా? మరి తీర్థం స్నానాల వద్ద అన్నదానాలు, ప్రసాదాలు ఎవరు పర్యవేక్షిస్తారు?’ ‘ఆ విషయంలో భయం లేదు. అబ్బాయి నరసింహుడు వచ్చాడుగా! వాడిని నియోగిస్తాను. అరే! అసలు విషయం మరిచాను’ కొడుకు మాట రాగానే వియ్యంకుడికి రాయాల్సిన కమ్మ గుర్తుకొచ్చింది. వియ్యంకుడికి ఉత్తరం రాయటంలో నిమగ్నుడయ్యాడు. జోడుగుళ్ళలో మొక్కి కొండ చుట్టేందుకు సిద్ధమయ్యారు అక్కాచెల్లెళ్ళు. మొగుడు పోయిన ఒంటరిది! అయినా పసుపంచు పావడా, మందారపు రంగు వల్లెవాటు, అరముడితో బిగువుగా కట్టిన రవికెలో మిడిసిపడే మేని నిగారింపుతో ఉంది ముత్యాలు. ఆ మేని చూసి జోడు కట్టేందుకు పోటీపడే కుర్రకారు ఎకసెక్కాలతో, కొంటె పాటలతో దారి పొడుగునా దాని వెన్నంటే ఉన్నారు. మూడు యోజనాల (34 కిమీ) అడివిదారి! దారిలో అక్కడక్కడా కాపుల కొష్టాలు, అగ్రహారాలు, జాతరకి వేలాదిగా వచ్చిన భక్తుల కోసం ప్రతి కోసుకకి చలివేంద్రాలు, తాహతుకి తగినట్లు పౌరులు ఏర్పాటు చేసిన పొంగుళ్ళు, పులిహోర, దధ్యోదనం. తాగేందుకు చల్లముంతల్లో మజ్జిగ, పానకం, ఆగిన ప్రతిచోటా పందిళ్ళలో బొమ్మలాటలు, సానివాళ్ళ చిందులు, కథలు చెప్పే భాగోతులు, పాము- తేలుకాట్లకి బెణికిన కీళ్లకి విరిగిన ముళ్ళకి, బొబ్బలెక్కిన అరికాళ్ళకి పసరు కట్లుకట్టే ఆచారులు, శాస్త్రచికిత్స చేసే మంగళ్ళు... ఎంత నడిచినా అలుపే తెలియలేదు. మెట ్లకింద నుండే అప్పన్నకి మొక్కి, పొద్దు పొడిచేలోగా సముద్రతీరం చేరారు. ఎత్తివస్తున్న అలలని తొక్కుతూ ఒకరిపైనొకరు నురగ చల్లుకుంటూ సరసాలతో కేరింతలతో కాలమే తెలియలేదు. సముద్రపుటొడ్డున భక్తుల కోసం పెద్ద భోజనాల పందిరి. పందిరి కింద వంటవాళ్ళని వడ్డించేవాళ్ళనీ పురమాయిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న నరసింహాచారిని సమీపించారా అక్కాచెల్లెళ్ళు. వంటికి అతుక్కున్న చీరెలో, నడుము దాటే తడిసిన కురులతో మత్స్యకన్యలా వస్తున్న ముత్యాలుపై నుంచి చూపు మరల్చుకోలేక పోయాడు చినసాత్రుడు. ఒక చెవితో దాని చెల్లెలు చెప్తున్న గోడు వింటున్నా అతడి మనసంతా దాని పొందు కోసం ఆరాటపడసాగింది. ఎలా? అని ఆలోచించగా ఉపాయం తట్టింది... రంగసాని! సానిమున్నూరు గణానికి నాయకురాలు. ఇలాంటి విషయాలలో ఆమే సరియైన ఉపాయం చెప్పగలదు! రేపు సాయంకాలం గుడి వెనక నాట్యమండపానికి రావే. అక్కడ ఏ సంగతీ చెబుతాను’ కనులంతా దాని రూపాన్నే నింపుకోని వణికే గొంతుతో చెప్పాడు నరసింహాచారి. పాతికేళ్ళు గ డిచాయి.... స్థానాధికారి నరసింహాచార్య మహాపాత్రుని నీడలో, రంగసాని శిక్షణలో, అనతికాలంలోనే సానిమున్నూరు గణానికే తలమానికంగా ఎదిగింది ముత్యాలమ్మ. భోగంవీధిలో రెండంతస్తుల మేడ, కళింగంలో నూరెకరాల మాగాణి, పరిచారికలు, మందిమార్బలం... చందనోత్సవంలో ఆమె చెంచులక్ష్మి వేషానికి గజ్జె కడితే ఆ నాట్యం చూసేందుకు కళింగన గరం, రాజమహేంద్రం వంటి నగరాల నుంచి కూడా జనం వస్తారు. వృద్ధాప్యంలో ఆమె దానం ఇచ్చిన 16 బారువుల (2300 కిలోలు) వెండితో నృత్యమండపానికి తొడుగు వేసిన పంచాణం కంసాలి ప్రతిభని ప్రశంసిస్తూ నరసింహాచార్య మహాపాత్రుడే స్వయంగా ముఖమంటపంలో దానశాసనాన్ని వేయించాడు. ఠి మహాపాత్రుడు వైఖాసన క్రమంలో వరాహనృసింహుని దేవస్థానాధిపతి. క్షేత్రంలో భండారి, శ్రీకరణం, కోష్టకరణం (కొట్టులెక్కల అధికారి), ఆచార్యుడు, అర్చకులు, బోయలు, గొల్లలు, సానులు గల పరిషత్తులో అతడి మాటంటే వేదవాక్కు. అతడి కొడుకు తిరిగి వచ్చిన సందర్భంలో మహాపాత్రుని ఇంట్లో సందడి అంతింత కాదు. దానికి తోడు కటకమానపు గిరిప్రదక్షిణం కళింగంలోనే పెద్దపండగ. ‘పండగ కాగానే కోడలిని ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుంది, ఏమంటారు?’ అడిగింది మహాపాత్రుడి ఇల్లాలు. ‘అవునవును! ఇవాళ మంచిరోజు. శకునాలూ బాగున్నాయి. గుడికి వెళ్ళగానే నీ అన్నకి కమ్మ రాసి శ్రీకూర్మానికి పంపిస్తాను. కార్తీకమాసంలో ముహూర్తం పెట్టి పంపిస్తే మనవాణ్ని శోభనానికి పంపిద్దాం’ ‘మనమూ వెళ్దామండీ. అన్నయ్యనీ వదినెనీ చూసి చాలా నాళ్ళయింది’ ‘పోయిన సంక్రాంతికే గదే వెళ్లావ్? నేనయితే కోడలిని పెళ్ళిలో చూడటమే. ఏడే ళ్ళయింది. గుడి పనులతో క్షణం తీరిక దొరకదు. అయినా ఈసారి తప్పదులే. అప్పగింతలకి మనం లేకుంటే ఎలా?’ మూల కూర్చోని వెక్కివెక్కి ఏడుస్తోంది ముత్యాలు. ‘అక్కా! ఏడ్వమాకే. నువు లానంటే నానెట్టాగే పోయేది?’ పూరింటి వసారా అరుగు మీద బారెడు జడకి మొగలిరేకులు అల్లి, సింగారాన్ని రాగి అద్దంతో చూసుకుని మురిసిపోతూ అడిగింది దాని చెలె ్లలు కన్నమ్మ- ‘బేగా తయ్యరైపో. ఏటంటావ్?’ అంది. ‘ఆడ్ని పొట్టనెట్టుకున్న ఆ దేముణ్నేటికే నాను మొక్కేది? నువె ్వల్లు. నాను లాను’ కొంగుతో మొగం తుడుచుకుంటూ జవాబిచ్చింది ముత్యాలు. ‘నీవో మారు నాతో వచ్చీయ్. పెదపాత్రులకి మొరెట్టుకుని గుళ్ళో సాతాని పనో దివిటీల పనో ఏదన్నా ఇిప్పిస్తా’ అంటూ ప్రాధేయపడింది కన్నమ్మ. ‘ఆ దివిటీల పనే నా పానం తీసింది. మద్దిలపాలెం పండక్కి ఆయేళ పోమాకరా అంటే ఇనిపించుకోలేదు సచ్చినోడు. పందిరి అంటించి ఆడనే సచ్చాడు. నావొల్ల కాదులేయ్. ఒగ్గేయ్’ ‘కొండచుట్టే పండగే! తీర్థాల దంక తానాలు చేసి పొద్దుటాలకి వచ్చీయొచ్చు. దారంట ప్రతి పల్లెలో, పాలెంలో చలిది కుండలు, దద్దోనాలు పెడతారు. ఆడతా పాడతా పోయేసి మొక్కి తిరిగొచ్చీద్దాం’ ముత్యాలు మొగుడు అప్పడు గుళ్ళో దివ్వెకోల పట్టేవాడు. మద్దిలపాలెం ఊరి పండగలో చినరడ్డి పోయించిన కల్లు దాగిన మైకంలో ఆడే పందిరి అంటించాడని పంచాయతీ పెద్దలు తీరుమానం చేసారు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. ఏదన్నా పని లేకుంటే బతుకు గడవదు. సాతాని పనికి రోజుకి మూడు కాకిరూకల బత్తెం, గుళ్ళో ప్రసాదం, పానకం. కానీ ఆడు చేసిన తప్పిదానికి జాతర్లో ఆరుగురు చచ్చారు. ఆడికి బదులుగా పని అడిగేటికి మొగం చెల్లదు. ఏటి చేయాలో దిక్కుతోచని ముత్యాలుకి చెల్లెలి మాట సబబే అనిపించింది. సరే పద! అని బయలుదేరింది. గిరి ప్రదక్షిణం పనులకి తోడు రాజమహేంద్రి ఆస్థానం నుంచి గుడి లెక్కలు చూసేందుకు భోగపరీక్షకుడు (ఆడిటర్) వస్తున్నాడని కబురు వచ్చింది. కొష్టాల లెక్కలు, జీతబత్యాలు, స్వామివారి కానుకలూ కట్నాలే కాక గుడి మాన్యాలు, పశువులు, పాడి ప్రసాదాలు అన్నిటినీ పర్యవేక్షించి మహారాజుకి నివేదించడం అతడి పని. ఏమాత్రం లెక్కతప్పినా ఉద్యోగాలకే ముప్పు. దాంతో మహాపాత్రుడికి క్షణం తీరికలేదు. వియ్యంకుడికి కమ్మ రాస్తానన్న విషయం హడావుడిలో మరిచిపోయాడు. ‘వచ్చేవాడు యముడు! కైలాసనాథ దేశికుడు. శైవుడు! దక్షారామంలో శ్రీగంధం మూడు పుట్ల తేడా వచ్చిందని కోష్టకరణాన్ని తొలగించి గ్రామం నుంచి వెలి వేయించాడు. శివాలయంలోనే అలా చేస్తే మన నిలువుబొట్టని వదులుతాడా?’ బిక్కమొహంతో ఎదురు నిలిచాడు భండారి. ‘మన గుళ్ళో అలాంటి తేడాలకి ఆస్కారం లేదు. మొన్ననేగా చందనోత్సవం తరువాత అన్ని లెక్కలూ చూశాం. అనవసరంగా అధైర్యపడక ఈ పండగ పనులు చూడండి.’ ‘అలా కాదు పాత్రులూ! ఒకటా రెండా? డెబ్భైవేల వశువులు అంటే ఏడొందలకి పైన గొల్లకాపర్లు. కొండ చుట్టూ వెయ్యి గోచరాల పంటపొలాలు అంటే ఐదువేల కాపు కుటుంబాలు. పూలతోటల మాలదాసర్లు, పంచాణం వాళ్ళు, వంటవాళ్ళు, గుళ్ళో పని చేసే సాతానులు, భోగంవీధిలో సానులు... వీళ్ళలో ఏ ఒక్కరు తప్పు చేసినా అది మన తలకి చుట్టుకుంటుంది. ఒకసారి అందరినీ పిలిపించి లెక్కలు మరోసారి విచారిస్తే మంచిది.’ ‘సరే అలాగే చేద్దాం! అందరినీ రేపు ఉదయాన్నే పిలిపించండి’ ‘రేపా? మరి తీర్థం స్నానాల వద్ద అన్నదానాలు, ప్రసాదాలు ఎవరు పర్యవేక్షిస్తారు?’ ‘ఆ విషయంలో భయం లేదు. అబ్బాయి నరసింహుడు వచ్చాడుగా! వాడిని నియోగిస్తాను. అరే! అసలు విషయం మరిచాను’ కొడుకు మాట రాగానే వియ్యంకుడికి రాయాల్సిన కమ్మ గుర్తుకొచ్చింది. వియ్యంకుడికి ఉత్తరం రాయటంలో నిమగ్నుడయ్యాడు. జోడుగుళ్ళలో మొక్కి కొండ చుట్టేందుకు సిద్ధమయ్యారు అక్కాచెల్లెళ్ళు. మొగుడు పోయిన ఒంటరిది! అయినా పసుపంచు పావడా, మందారపు రంగు వల్లెవాటు, అరముడితో బిగువుగా కట్టిన రవికెలో మిడిసిపడే మేని నిగారింపుతో ఉంది ముత్యాలు. ఆ మేని చూసి జోడు కట్టేందుకు పోటీపడే కుర్రకారు ఎకసెక్కాలతో, కొంటె పాటలతో దారి పొడుగునా దాని వెన్నంటే ఉన్నారు. మూడు యోజనాల (34 కిమీ) అడివిదారి! దారిలో అక్కడక్కడా కాపుల కొష్టాలు, అగ్రహారాలు, జాతరకి వేలాదిగా వచ్చిన భక్తుల కోసం ప్రతి కోసుకకి చలివేంద్రాలు, తాహతుకి తగినట్లు పౌరులు ఏర్పాటు చేసిన పొంగుళ్ళు, పులిహోర, దధ్యోదనం. తాగేందుకు చల్లముంతల్లో మజ్జిగ, పానకం, ఆగిన ప్రతిచోటా పందిళ్ళలో బొమ్మలాటలు, సానివాళ్ళ చిందులు, కథలు చెప్పే భాగోతులు, పాము- తేలుకాట్లకి బెణికిన కీళ్లకి విరిగిన ముళ్ళకి, బొబ్బలెక్కిన అరికాళ్ళకి పసరు కట్లుకట్టే ఆచారులు, శాస్త్రచికిత్స చేసే మంగళ్ళు... ఎంత నడిచినా అలుపే తెలియలేదు. మెట ్లకింద నుండే అప్పన్నకి మొక్కి, పొద్దు పొడిచేలోగా సముద్రతీరం చేరారు. ఎత్తివస్తున్న అలలని తొక్కుతూ ఒకరిపైనొకరు నురగ చల్లుకుంటూ సరసాలతో కేరింతలతో కాలమే తెలియలేదు. సముద్రపుటొడ్డున భక్తుల కోసం పెద్ద భోజనాల పందిరి. పందిరి కింద వంటవాళ్ళని వడ్డించేవాళ్ళనీ పురమాయిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న నరసింహాచారిని సమీపించారా అక్కాచెల్లెళ్ళు. వంటికి అతుక్కున్న చీరెలో, నడుము దాటే తడిసిన కురులతో మత్స్యకన్యలా వస్తున్న ముత్యాలుపై నుంచి చూపు మరల్చుకోలేక పోయాడు చినసాత్రుడు. ఒక చెవితో దాని చెల్లెలు చెప్తున్న గోడు వింటున్నా అతడి మనసంతా దాని పొందు కోసం ఆరాటపడసాగింది. ఎలా? అని ఆలోచించగా ఉపాయం తట్టింది... రంగసాని! సానిమున్నూరు గణానికి నాయకురాలు. ఇలాంటి విషయాలలో ఆమే సరియైన ఉపాయం చెప్పగలదు! ‘రేపు సాయంకాలం గుడి వెనక నాట్యమండపానికి రావే. అక్కడ ఏ సంగతీ చెబుతాను’ కనులంతా దాని రూపాన్నే నింపుకోని వణికే గొంతుతో చెప్పాడు నరసింహాచారి. పాతికేళ్ళు గ డిచాయి.... స్థానాధికారి నరసింహాచార్య మహాపాత్రుని నీడలో, రంగసాని శిక్షణలో, అనతికాలంలోనే సానిమున్నూరు గణానికే తలమానికంగా ఎదిగింది ముత్యాలమ్మ. భోగంవీధిలో రెండంతస్తుల మేడ, కళింగంలో నూరెకరాల మాగాణి, పరిచారికలు, మందిమార్బలం... చందనోత్సవంలో ఆమె చెంచులక్ష్మి వేషానికి గజ్జె కడితే ఆ నాట్యం చూసేందుకు కళింగన గరం, రాజమహేంద్రం వంటి నగరాల నుంచి కూడా జనం వస్తారు. వృద్ధాప్యంలో ఆమె దానం ఇచ్చిన 16 బారువుల (2300 కిలోలు) వెండితో నృత్యమండపానికి తొడుగు వేసిన పంచాణం కంసాలి ప్రతిభని ప్రశంసిస్తూ నరసింహాచార్య మహాపాత్రుడే స్వయంగా ముఖమంటపంలో దానశాసనాన్ని వేయించాడు. సాయి పాపినేని -
సింహాచలంలో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్
భూ సమస్య త్వరలో పరిష్కారం కనకమహాలక్ష్మి, అప్పన్న ఆలయాల్లో నిత్యాన్నదానం ప్రారంభోత్సవంలో మంత్రి గంటా పాతపోస్టాఫీసు/ సింహాచలం : బురుజుపేట శ్రీ కనకమహాలక్ష్మి, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాల్లో నిత్యాన్నదాన పథకాన్ని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. తొలుత కనకమహాలక్ష్మి ఆలయం లో ప్రారంభించి ప్రసంగించారు. సింహాచలం దేవస్థానంలో ఎడ్యుకేషన్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. ఇంజినీరింగ్, వైద్య, డిగ్రీ, కోస్ట్‌గార్డు కళాశాలలు ఏర్పాటు చేయాలి చూస్తున్నట్టు తెలిపారు. సింహాచలం భూముల వివాదం ఒకటి, రెండు నెలల్లో పరిష్కరించనున్నట్టు స్పష్టం చేశారు. కొండపై కాటేజీలు నిర్మాణం చేసే యోచన ఉందన్నారు. ఇవన్నీ ప్రాథమిక స్థాయిలో ఉన్నాయని, ప్రణాళికలు తయారుచేసి కార్యాచరణకు దిగుతామన్నారు. తాజ్, ఒబెరాయ్, ఫోర్‌పాయింట్స్ హోటల్స్‌కు సింహాచలం దేవస్థానానికి చెందిన కొంత స్థలాలు కేటాయించి వాటిలో షేర్ తీసుకోవడం, వుడా, జీవీఎంసీ సంయుక్త భాగస్వామ్యంతో దేవస్థానం స్థలాల్లో ఐటీ అభివృద్ధి, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి యోచిస్తున్నట్టు వివరించారు. తొలుత కనకమహాలక్ష్మి అమ్మవారికి మంత్రి పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, దేవస్థానం ఈవో డి.భ్రమరాంబ పాల్గొన్నారు. కొండపై రోజుకు 5వేల మందికి అన్నదానం సింహగిరిపై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారం భించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఇక్కడ రోజుకు ఐదు వేల మందికి అన్నదానం చేయనున్నట్టు తెలిపారు. దేవస్థానం తరఫున వైద్య సదుపాయం అందించేందుకు అడవివరం ఆరోగ్య కేందాన్ని దత్తత తీసుకోవాలా లేదా కొత్తగా వైద్యశాల నిర్మించాలా వంటి ఆలోచన చేస్తున్నా మన్నారు. తొలుత శ్రీగోకుంలో గోపూజల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకృష్ణాపురంలోని గోశాలలో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్, ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, అడవివరం మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్, 72వ వార్డు టీడీపీ అధ్యక్షుడు పి.వి.నరసింహం తదితరులు పాల్గొన్నారు. -
మూతి కరిచిన లడ్డు
అది ఓ శుభదినం. ఇంట్లో పండుగ వాతావరణం. ఉన్నమాట చెప్పాలి కదండీ! మా ఆవిడ లడ్డూలు చేస్తోంది, పక్కింటివారికి కూడా నోరూరేట్టు. ఆ రోజు లడ్డూ తయారీకి సరంజామా సిద్ధం చేసింది. సెలవు దినమైతే నేనూ ఉడత సాయం చేసేవాణ్నే. కానీ ఆ రోజు పనిదినం మూలాన ఆఫీసుకి వెళ్లిపోయాను. తిరిగొచ్చేసరికి సాయంకాలమైంది. ఇంట్లో కాళ్లు పెట్టేసరికి ఒకటే ఘుమఘుమలు దేవుడి గదిలోంచి ముక్కుని తాకుతున్నాయి. ఏ వంట చేసినా మొదట దేవుడికి నైవేద్యం పెట్టే అలవాటు మా ఆవిడది. గబగబా కాళ్లు, ముఖం కడుక్కొని నేరుగా దేవుని గదిలోకెళ్లాను. కొంచెం వెలుతురు, కొంచెం చీకటి. రాత్రి కాలేదు. కాబట్టి ఇంకా లైట్లు వెయ్యలేదు. ఆ సంధ్య చీకట్లో ఒక లడ్డూ తీసుకుని అమాంతం నోట్లో వేసుకున్నాను. టేస్టు మాట దేవుడెరుగు, నోటి నిండా చీమలు, మూతి నిండా చీమలు. ఒకటే కరవడం. పెదవులు, బుగ్గలు, మూతి ఒకటే మంట! ఈ హఠాత్పరిణామానికి ఉక్కిరిబిక్కిరై హాల్లోకి వచ్చేశాను. మా ఆవిడ, పిల్లలు అంతా నాకేమైందోనని గాబరాపడ్డారు. వెంటనే లైటు వేశాక అసలు పరిస్థితి అర్థం చేసుకొని అంతా నవ్వుకున్నారు. ఆ స్పాట్లో నాకు నవ్వు అస్సలు రాలేదు. కాని ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా ఇప్పుడు మాత్రం నవ్వొస్తుంది. - సీహెచ్ సింహాచలం శ్రీకాకుళం -
జాతీయ పురస్కారమే లక్ష్యం
ప్రముఖ సినీగీత రచయిత భాస్కరభట్ల సింహాచలం : జాతీయ పురస్కారం సాధించాలన్నదే తన లక్ష్యమని ప్రముఖ సినీగీత రచయిత భాస్కరభట్ల చెప్పారు. మంగళవారం సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆయన దర్శించుకున్నారు. స్వామి సన్నిధిలో పూజలు చేశారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో ముచ్చటించారు. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాతో గీత రచయితగా సినీరంగానికి పరిచయమైన తాను ఇప్పటివరకు సుమారు 300 చిత్రాలకు పనిచేశానని చెప్పారు. సంగీత దర్శకుడు చక్రి, తాను ఒకేసారి పరిచయమయ్యామని గుర్తు చేసుకున్నారు. తాజాగా రవితేజ ‘పవర్’, మహేష్‌బాబు ‘ఆగడు’తో పాటు దాసరి నారాయణరావు దర్శకత్వంలో వస్తున్న ఎర్రబస్సు సినిమాకు పాటలు రాశానని చెప్పారు. -
సింహాచలం కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ!
శ్రీకాకుళం: కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడిచేందుకు.. బాధితుల బతుకు బాధలు తెలుసుకునేందుకు.. అండగా నేనున్నాంటూ తమిళనాడులోని చెన్నై భవనం కూలిన ఘటనలో బాధితులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. తమిళనాడులోని చెన్నై సమీపంలో చోటు చేసుకున్న భవనం కూలిన దుర్ఘటనల్లో మృతి చెందిన జిల్లావాసుల కుటుంబాలను గురువారం వైఎస్ జగన్ పరామర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పొల్లివలసలో సింహాచలం కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట, టెక్కలి, పాలకొండ నియోజకవర్గాల పరిధిలో పొట్టకూటి కోసం వలస చెన్నై ప్రాంతానికి వెళ్లిన వారిలో 14 మంది భవనం కూలిన ఘటనలో చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. కొద్ది రోజుల వ్యవధిలోనే తిరువళ్లూరు జిల్లాలో గోడ కూలిన దుర్ఘటనలో మరో 9మంది మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. వీరి కుటుంబాలను జగన్ తన పర్యటనలో పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇవ్వనున్నారు. -
చందన స్వామిని దర్శిద్దాం రండి
రేపు అప్పన్న చందనోత్సవం తెల్లవారుజాము 4 నుంచే సాధారణ భక్తులకు దర్శనాలు రాత్రి 7 గంటల వరకే క్యూల్లోకి ప్రవేశం విస్తృత ఏర్పాట్లు చేపట్టిన ఆలయ వర్గాలు సింహాచలం, న్యూస్‌లైన్ : సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం శుక్రవారం అంగరం వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తికావచ్చాయి. వరాహ, నృసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని 12 మణుగులు (500 కిలోలు) చందనంతో ఏడాదంతా నిత్య రూపంతో దర్శనమిచ్చే స్వామి, ఏటా వైశాఖ శుద్ధ తదితయనాడు మాత్రమే నిజరూప దర్శనమిస్తారు. నాలుగు విడతలు చందనం సమర్పణ ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల (120 కిలోలు) చొప్పున చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు విడతలుగా మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. అర్ధరాత్రి నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభం పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.30 నుంచే వైదిక కార్యక్రమాలను అర్చకులు ప్రారంభిస్తారు. శుక్రవారం తెల్లవారుజాము 3.30 గంటలకు దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు తొలి దర్శనం చేస్తారు. అనంతరం 4 గంటల నుంచి సాధారణ భక్తులకు దర్శనాలు అందజే స్తారు. రాత్రి 8.30 గంటల నుంచి శ్రీ వైష్ణవస్వాములు సహస్రఘట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. సింహగిరిపై ఉన్న గంగధార వద్ద నుంచి వెయ్యి కలశాలతో నీటిని తీసుకొచ్చి స్వామి నిజరూపాన్ని అభిషేకిస్తారు. 108 వెండి కలశాలతో పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. అనంతరం స్వామికి తొలివిడత చందనాన్ని (125 కిలోలు) సమర్పించి మరల నిత్య రూపభరితుడ్ని చేస్తారు. విస్తృ ఏర్పాట్లు చందనోత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. లక్షమందికి పైగానే భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ఉచిత, రూ.200, రూ.500ల క్యూలను పక్కాగా ఏర్పాటు చేశారు. 17వేల మంది భక్తులు ఒకేసారి వేచి ఉండేలా క్యూలు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఫ్రీ పాస్‌లు జారీచేయకుండా ప్రోటోకాల్ వీఐపీలు, వీఐపీలకు కూడా రూ.1000 ప్రత్యేక టికెట్టు పెట్టారు. వీరికి కోసం ప్రత్యేక సమయాలను కూడా కేటాయించారు. ప్రోటోకాల్ వీఐపీలకు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 7 వరకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. మిగతా సమయాల్లో అనుమతించరు. ప్రోటోకాల్ వీఐపీలకు రాజగోపురం ద్వారా ప్రవేశం కల్పిస్తుండగా, వీఐపీకు ప్రత్యేకంగా రూ.1000 క్యూ ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆలయంలోంచి బయటకు వచ్చే భక్తులందరినీ దక్షిణ మార్గంలో కొత్తగా నిర్మిస్తున్న రాజగోపురంలోంచి పంపిస్తారు. 35 స్వచ్ఛంద సంస్థలు భక్తులకు మజ్జిగ, మంచినీరు అందించనున్నాయి. రెండు ఫైర్ ఇంజిన్లు, రెండు 108లు అందుబాటులో ఉంటాయి. సింహగిరిపైకి భక్తుల వాహనాలను అనుమతించరు. హనుమంతవాక మీదగా సింహాచలం వచ్చే భక్తులు అడవివరం కూడలి, నగరంలోంచి గోపాలపట్నం మీదగా వచ్చే భక్తులు గోశాల కూడలి వద్ద వాహనాలను నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. గోశాల, అడవివరం జంక్షన్ల నుంచి సింహగిరికి భక్తులను చేరవేసేందుకు దేవస్థానం 40 బస్సులను ఉచితంగా నడుపుతోంది. ఈ ప్రాంతాల నుంచి భక్తులు ఈ బస్సుల్లోనే సింహగిరికి చేరుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు. 3న ఉదయం 10 నుంచి దర్శనాలు స్వామి దర్శనాలు శనివారం ఉదయం 10 గంటల నుంచి లభిస్తాయని దేవస్థానం ప్రధాన పురోహితులు సీతారామాచార్యులు తెలిపారు. శుక్రవారం చందనోత్సవం సందర్భంగా ఆ రోజు రాత్రి సహస్ర ఘటాభిషేకం నిర్వహణ, మూడో తేదీ ఉదయం తొలివిడత చందనం సమర్పణ జరుగుతుండటంతో ఉదయం 10 గంటల నుంచి దర్శనాలు లభిస్తాయన్నారు. అంతకుముందు దర్శనాలు లభించవని పేర్కొన్నారు. ప్రసాదాలు సిద్ధం భక్తుల కోసం లక్షా 25 వేల లడ్డూలను విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. దర్శనానంతరం ఆలయ దక్షిణ మార్గం నుంచి బయటకి వచ్చే దారిలో ప్రసాదాల విక్రయశాల ఉంది. 50వేల మందికి దేవస్థానం పులిహోర, దద్ధోజనం ప్రసాదం అందజేసేందుక ఏర్పాట్లు చేసింది. టికెట్ల విక్రయ కేంద్రాలు నగరంలోని పలు స్టేట్ బ్యాంకు బ్రాంచిలు, ఆంధ్రా బ్యాంకులు, గ్రామీణ వికాస బ్యాంకుల్లో రూ.200, రూ.500 టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. గోపాలపట్నంలోని దేవస్థానం పెట్రోల్ బంక్, సింహగిరిపై విచారణ కార్యాలయంలో కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. చందనోత్సవం రోజు సింహగిరిపై క్యూల ప్రవేశ ద్వారాల వద్ద కూడా టికెట్ల విక్రయాలు జరుగుతాయి. క్యూలైన్లు ఏర్పాటు రాత్రి ఏడు గంటల వరకే క్యూలలోకి భక్తులకు ప్రవేశం కల్పిస్తారు. అనంతరం క్యూల ప్రవేశ ద్వారాలు మూసివేసి అప్పటి వరకు క్యూలలో ఉన్నవారికి మాత్రం దర్శనం కల్పిస్తారు. రాత్రి 8.30 గంటలకు సహస్ర ఘటాభిషేకం ప్రారంభమైనా 7 గంటలలోపు క్యూలలోకి ప్రవేశించేవారికి మాత్రం దర్శనం లభిస్తుంది. ఒకవైపు సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు, అదే సమయంలో క్యూలలో ఉన్న భక్తులకు దర్శనం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు. -
శాస్త్రోక్తంగా చందనం అరగదీత
సింహాచలం, న్యూస్‌లైన్ : వరా హ లక్ష్మీనృసింహస్వామి ఆల యంలో శుక్రవారం తొలి విడత చందనం అరగదీత కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైం ది. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి ఉదయం 6.30 గంటల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. వచ్చే నెల 2న చందనోత్సవాన్ని పురస్కరించుకుని స్వామికి తొలి విడతగా మూడు మణుగుల(125 కిలోలు) చందనాన్ని సమర్పిస్తారు. అందులోభాగంగా తొలుత బేడా మండపంలో తొలి చందనం చెక్కను ఉంచి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు చం దనం చెక్కను శిరస్సుపై పెట్టుకుని బేడా ప్రదక్షిణ చేశారు. అంతరాలయంలో మూలవిరాట్ సన్నిధిలో చందనం చెక్కను ఉంచి అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. నోటికి గంతలు కట్టుకుని శ్రీనివాసాచార్యులు తొలిచందనాన్ని శాస్త్రోక్తంగా అరగదీశారు. అనంతరం సిబ్బంది చందనం అరగదీతను ప్రారంభించారు. ఆలయ ప్రధాన పురోహితుడు మోర్తా సీతారామాచార్యుల ఆధ్వర్యంలో అర్చకుడు సీతారాం, గిరి, రవి, వేదపండితులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చందనం అరగదీసే సిబ్బందికి ఈవో కె.రామచంద్రమోహన్ నూతన వస్త్రాలు అందజేశారు. ఐదు రోజులపాటు ఈ అరగదీత కార్యక్రమం జరగనుంది. చందనోత్సవానికి ప్రత్యేక ప్రణాళిక శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిం చినట్టు సింహాచల దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. వచ్చే నెల 2న సింహగిరిపై జరిగే చందనోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్ష మందికి పైగా భక్తులు స్వామి నిజ రూప దర్శనానికి వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. 17 వేల మంది భక్తులు స్వామి దర్శనానికి వేచి ఉండేలా ఉచిత దర్శనం, రూ.200, రూ.500 రూపాయల టికెట్ల లైన్లు సిద్ధం చేస్తున్నామన్నారు. ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి స్వామి నిజరూప దర్శనాన్ని భక్తులకు అందజేస్తామన్నారు. భక్తులు తమ వాహనాల ను గోశాల కూడలి, అడవివరం కూడలిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో నిలిపివేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువాలు, జెం డాలతో రాకూడదని చెప్పారు. సమావేశంలో ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, ఈఈ శ్రీనివాసరాజు, డీఈ మల్లేశ్వరరా వు, ఏఈవో ఆర్.వి.ఎస్.ప్రసాద్, సూపరింటెం డెంట్ తిరుమలేశ్వరరావు పాల్గొన్నారు. -
కనులపండువగా అప్పన్న కల్యాణం
ఘనంగా రథోత్సవం పరవశించిన భక్తజనం భారీ ఏర్పాట్లు సింహాచలం, న్యూస్‌లైన్ : శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి సింహగిరిపై సందడి నెలకొంది. కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి ఉత్సవమూర్తులను అర్చకులు ఇక్కడి నృసింహ మండపంలోని కల్యాణ వేదికపై అధిష్టించారు. మాంగళ్యధారణ, తలంబ్రాలు ఘట్టాలతో కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పురోహితులు మోర్తా సీతారామాచార్యులు, స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, హవల్దార్ టి.పి.గోపాల్, అర్చకులు రమణమూర్తి, సీతారాం, గోపాలకృష్ణమాచార్యులు తది తరులు ఈ కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణం... కమనీయం సాయంత్రం 4 గంటల నుంచి ఆలయంలో కొ ట్నాల ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామి వద్ద పూజలు నిర్వహించిన పసుపు కొమ్ములను ముత్తైవులు శిరస్సుపై పెట్టుకుని బేడా ప్రదక్షిణ చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వామికి ఆరాధనను విశేషంగా చేశారు. రాత్రి 7 గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద ధ్వజారోహణాన్ని ఘనంగా నిర్వహించారు. సమస్త దేవతలకు కల్యాణోత్సవ ఆహ్వానాన్ని అందిస్తూ గరుడాళ్వార్ చిత్ర పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. రాత్రి 8 గంటల నుంచి సింహగిరి మాడ వీధు ల్లో ఎదురు సన్నాహోత్సవాన్ని నిర్విహ ంచారు. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని బంగారు పల్లకీలో, శ్రీదేవి, భూదేవిలను ముత్యాల పల్లకీలో ఊరేగించారు. గాలిగోపురం వద్ద రథంపై అధిష్టించారు. రథంలో ఉన్న స్వామిని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనందగజపతిరాజు దంపతులు తొలి దర్శనం చేసుకున్నారు. భక్తులకు ముత్యాల తలంబ్రాలు, ప్రసాదం అందజేశారు. -
సింహాచలంలో లెజెండ్ మూవీ టీమ్ సింహయాత్ర
-
ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం:బాలకృష్ణ
-
ఎన్నికల్లో పోటీపై త్వరలో నిర్ణయం:బాలకృష్ణ
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది... లేనిది త్వరలో వెల్లడిస్తానని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. మంగళవారం విశాఖపట్నం శివారులోని సింహచలంలో సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీపై త్వరలో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలిపారు. మరో రెండు రోజులలో ఇదే విషయంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో సమావేశమై చర్చిస్తానన్నారు. అనంతరం ఏ సంగతి ప్రకటిస్తాన్నారు. ఇటీవల బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో బాలకష్ణ మంగళవారం ఉదయం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. బాలకృష్ణ వెంట విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఉన్నారు. -
పండగవేళ..పెను విషాదం
సింహాచలం, న్యూస్‌లైన్: అడవివరం దగ్గర భైరవవాక వద్ద మంగళవారం జరి గిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా మరొకరు ఆస్పత్రి లో కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్రం గా గాయపడిన బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆనందపురం మండలంలోని ప్రసాదునిపాలెంకు చెందిన ప్రసాదుని అప్పలరాజు (33) కుమారుడు గణేష్ (12)తో కలసి పల్సర్ వాహనంపై సిం హాచలం శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వా మి దర్శనం చేసుకుని తిరిగి స్వగ్రామానికి వస్తున్నాడు. ఆనందపురం మండలానికే చెందిన ముచ్చర్ల గ్రామవాసి గం డ్రెడ్డి గౌరి (22)తన మేనల్లుడు యామవలస సూరి (15)తో కలిసి హీరో హోండా ప్యాషన్ వాహనంపై శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నాడు. సరిగ్గా భైరవవాక దగ్గరకు వచ్చేసరికి ఉదయం 9.30 గంటల సమయంలో వీరి ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. దీంతో వాహనాలు నడుపుతున్న అప్పలరాజు, గౌరి తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన గణేష్, సూరిలను ఆటోలో హుటాహుటిన కేజీహెచ్ తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న గోపాలపట్నం ట్రాఫిక్ ఏసీపీ అర్జున్, ఎస్ఐ వర్మ ్రపమాద స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి గణేష్ కూడా మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకు న్న అప్పలరాజు బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని, దీనికి తోడు హెల్మెట్లు ధరించకపోవడంతోనే వీరు మృతి చెందారని ఏసీపీ అర్జున్ అభిప్రాయపడ్డారు. హెల్మెట్లు ధరించాలని, వేగంగా వెళ్లకూడదని తాము ఎంత ప్రచారం చేస్తున్నా వాహనదారులు పట్టించుకోవడం లేదన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తే ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవని ఆయన అన్నారు. -
మకర వేట చూసొద్దాం రండి
సింహాచలం, న్యూస్‌లైన్ : కనుమ పండగను పురస్కరించుకుని గురువారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వా మి మకరవేట ఉత్సవం జరగనుంది. కొండదిగువ పూల తోటలో సాయంత్రం ఈ ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించేందుకు దేవస్థానం వైదిక, అధికార వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి. వరదరాజస్వామి అలంకారం లో అప్పన్న భక్తులకు దర్శనమివ్వనున్నారు. గజవాహనంపై గ్రామ తిరువీధిలో భక్తులకు ఆశీస్సులు అందజేస్తారు. ఈ వేడుకలో భాగంగా గజేంద్రమోక్షం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అనంతరం పూలతోట నుంచి స్వామిని మార్కెట్ కూడలిలో ఉన్న పుష్కరిణి సత్రంలోకి తీసుకొచ్చి విశేష ఆరాధనలు జరిపి గజవాహనంపై తిరువీధి మహోత్సవాన్ని జరుపుతారు. తిరువీధి అనంతరం స్వామిని తిరిగి కొండపైకి చేర్చుతారు. విస్తృత ఏర్పాట్లు మకరవేట ఉత్సవాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవం జరిగే పది ఎకరాల ఉద్యానవనానికి నూతన శోభను చేకూర్చారు. పెద్ద ఎత్తున విద్యుద్దీపాలంకరణ చేపట్టారు. సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జగన్ జన్మదినోత్సవం సందర్భంగా అప్పన్నకు ప్రత్యేక పూజలు
సింహాచలం, న్యూస్‌లై న్: రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ముఖ్యమంత్రి అయి రాష్ట్ర ప్రజలకు తన సేవలందించాలని కోరుతూ పార్టీ జిల్లా, నగర, నియోజకవర్గాల సమన్వయకర్తలు సింహాచలం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల ఉత్తరాంధ్ర పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం వీరంతా సింహగిరికి తరలివచ్చారు. గాలిగోపురం వద్ద బెలూన్లు ఎగురవేశారు. అమ్మవారి సన్నిధిలో 108 కొబ్బరికాయలు కొట్టారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో జగన్మోహన్రెడ్డి పేరిట అష్టోత్తర పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన చేశారు. కార్యక్రమంలో నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు, భీమి లి, ఉత్తర, పశ్చిమ, గాజువాక నియోజక వర్గాల సమన్వయకర్తలు కోరాడ రాజబాబు, జి.వి.రవిరాజు, దాడి రత్నాకర్, తిప్పల నాగిరెడ్డి మాట్లాడారు. నాయకులు సత్తి రామకృష్ణారెడ్డి, వి.భాస్కర్, వంకాయల మారుతీ ప్రసాద్, పక్కి దివాకర్, శ్రీకాంత్, గొలగాని శ్రీనివాసరావు, వినోద్, ఈశ్వరరావు, చల్ల అప్పారావు, కొయ్య నారాయణరెడ్డి, రాకేష్ మహదేవ్, కె.జయప్రకాష్‌రెడ్డి, 72వ వార్డు నాయకులు పీతల అప్పలరాజు, పీతల విష్ణుమూర్తి, కొలుసు ఈశ్వరరావు, బోర కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో... సిరిపురం : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకులు మహిళా విభాగం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో మహిళలకు అత్యంత కీలకపదవులు, గౌరవం దక్కుతాయన్నారు. అంతకుముందు సాంస్కృతిక విభాగం కన్వీనర్ కె.రాధ అద్భుత గీతాలు ఆలపించిన అభిమానులను అలరించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, సీఈసీ సభ్యురాలు పిన్నింటి వరలక్ష్మి, సమన్వయకర్తలు జి.వి.రవిరాజు, కోరాడ రాజబాబు, అధికార ప్రతినిధి నీలా ఉమారాణి, నారా అమ్మాజీ తోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చీమలాపల్లిలో రక్తదాన శిబిరం చినముషిడివాడ: జీవీఎంసీ 70వ వార్డు చీమలాపల్లిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త గండి బాబ్జీ కేక్ కట్ చేసి అభిమానులకు పం చిపెట్టారు. పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని బాబ్జి చేతుల మీదుగా ప్రారంభించా రు. ఈ సందర్భంగా బాబ్జి మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం జగన్ చేస్తున్న పోరాటం చరిత్రాత్మకమని కొనియాడారు. పార్టీ నాయకులు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ పాల్గొన్నారు. పశ్చిమ పార్టీ కార్యాలయంలో... ఎన్ఏడీ జంక్షన్: ఎన్ఏడీ కూడలిలోని పశ్చిమ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, పార్టీ నాయకులు జి.వి.రవిరాజు, కొయ్య ప్రసాదరెడ్డి, నగర బీసీ సెల్ కన్వీనర్ పక్కి దివాకర్, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్ పాల్గొన్నారు. -
భారీ వర్షాలకి పూర్తిగా నిండిన వరాహపుష్కరిణి
-
సింహాచల అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు