సింహాచలం ఘటన: సంచలన విషయాలు చెప్పిన కాంట్రాక్టర్‌ | Contractor Sensational Facts On Simhachalam Incident | Sakshi
Sakshi News home page

సింహాచలం ఘటన: సంచలన విషయాలు చెప్పిన కాంట్రాక్టర్‌

May 1 2025 3:45 PM | Updated on May 1 2025 4:42 PM

Contractor Sensational Facts On Simhachalam Incident

విశాఖ:  సింహాచలం పుణ్యకేత్రంలో గోడ కూలి ఏడుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అయితే వారం రోజుల వ్యవధిలో గోడ కట్టడం కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుంది.  దీనిపై గోడ కట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన విషయాలు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ఏర్పాటు చేసిన కమిటీ విచారణ చేపట్టగా కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన నిజాలు బయటకు చెప్పారు. 

చందనోత్సవానికి సమయం చాలా తక్కువ సమయం ఉందని, తాను గోడ కట్టనని చెబితే బలవంతంగా ఆ గోడను కట్టించారన్నారు. దేవస్థానం, టూరిజం అధికారులు బలవంతంగా తన చేత గోడ కట్టించారని కమిటీ విచారణ సందర్భంగా లక్ష్మణరావు వెల్లడించారు.ఆరు రోజుల వ్యవధిలో ఒక గోడ కట్టడం సాధ్యం కాదని ముందే చెప్పానని, కేవలం నాలుగు రోజుల ముందే గోడ పనులు మొదలు పెట్టాననన్నారు.  టెంపరరీ గోడ అని చెప్పడంతోనే గోడ కట్టానన్నారు లక్ష్మణరావు. 

 ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారు..?
గోడ కట్టే సమయంలో ఇంజినీర్‌ లేరని కాంట్రాక్టర్‌ లక్ష్మణరావు చెప్పగా, ఇంజినీర్‌ అక్కడే ఉన్నారని అధికారులు చెప్పారు. దాంతో కమిటీ సభ్యుల్లో అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ ఇంజినీర్‌ ఉన్నాడా.. లేడా అని నిలదీశారు. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజం అని కమిటీ ప్రశ్నించింది. 

కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్‌లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.

ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. 

Advertisement
 
Advertisement
Advertisement