కూటమి బెదిరింపులకు బెదిరేది లేదు! | - | Sakshi
Sakshi News home page

కూటమి బెదిరింపులకు బెదిరేది లేదు!

Oct 20 2026 4:49 AM | Updated on Oct 20 2026 4:49 AM

● 120 వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ పోటీ ● మేయర్‌ పీఠం కై వసం చేసుకుంటాం.. ● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

సాక్షి, విశాఖపట్నం: కూటమి నేతల బెదిరింపులకు వైఎస్సార్‌సీపీ భయపడబోదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు స్పష్టం చేశారు. సోమవారం మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికార బలంతో ప్రతిపక్ష అభ్యర్థులపై ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. పోలీసుల సహకారంతో దౌర్జన్యాలకు పాల్పడటం సిగ్గుచేటని అన్నారు. కూటమి బెదిరింపులకు వెనక్కి తగ్గేది లేదని, జీవీఎంసీలోని 120 వార్డుల్లోనూ వైఎస్సార్‌సీపీ పోటీ చేస్తుందని తెలిపారు. పార్టీ అభ్యర్థులకు నాయకత్వం, కార్యకర్తలు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో మేయర్‌ పీఠంతో పాటు మెజారిటీ వార్డులను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే అభివృద్ధి, సంక్షేమంపై ప్రజాక్షేత్రంలో చర్చించాలని కూటమి నేతలకు సవాల్‌ విసిరారు. సమావేశంలో పలువురు కార్పొరేటర్‌ అభ్యర్థులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement