మేయర్‌ స్థానానికి 29 నామినేషన్లు | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ స్థానానికి 29 నామినేషన్లు

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ రెండో సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మేయర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో మేయర్‌ స్థానానికి మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్‌ పదవికి వైఎస్సార్‌సీపీ తరఫున వరుదు కల్యాణి (రెండో సెట్‌), కూటమి అభ్యర్థులుగా ముక్కా శ్రావణి, సేనాపతి వసంత, కాంగ్రెస్‌ నుంచి దండి ప్రియాంక, ప్రజా ప్రస్థానం పార్టీ తరఫున తలుపుల శైలజ, దాసరి లక్ష్మీ సంధ్యా, జనతాదళ్‌ పార్టీ నుంచి చింతాడ పద్మినితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.

జీవీఎంసీ పరిధిలోని వార్డు కార్పొరేటర్‌ స్థానాలకు మొత్తం 1,672 నామినేషన్లు దాఖలయ్యాయి. జోన్ల వారీగా దక్షిణ జోన్‌లో 249, ఉత్తర జోన్‌లో 273, తూర్పు జోన్‌లో 164, పశ్చిమ జోన్‌లో 186, అనకాపల్లి జోన్‌లో 38, భీమిలి జోన్‌లో 48, మధురవాడ జోన్‌లో 83, అగనంపూడి జోన్‌లో 101, పెందుర్తి జోన్‌లో 123 నామినేషన్లు నమోదయ్యాయి.గాజువాక జోన్‌లో అత్యధికంగా 407 నామినేషన్లు దాఖలయ్యాయి.

నేడు నామినేషన్ల పరిశీలన

నామినేషన్ల పరిశీలన సోమవారం నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. అనంతరం అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు.

ర్యాలీగా వచ్చి శ్రావణి నామినేషన్‌

జీవీఎంసీ కూటమి మేయర్‌ అభ్యర్థి ముక్కా శ్రావణి ఆదివారం నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించారు. అంతకుముందు గాంధీ పార్కు నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్‌తో కలిసి ర్యాలీగా వెళ్లారు.

కార్పొరేటర్‌ స్థానాలకు

1,672 నామినేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement