చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై నగరాన్ని రికార్డు స్థాయి భారీ వర్షం ముంచెత్తింది. శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉత్తర చెన్నైలో మొదలైన వాన, ఉరుములు మెరుపులతో క్రమంగా నగరం నలుమూలలా విస్తరించింది. రాత్రి 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు 8 గంటల వ్యవధిలోనే ఏకంగా 35.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. డిసెంబర్ 2023లో వచ్చిన మిచాంగ్ తుఫాను తర్వాత నగరంలో నమోదైన అత్యంత భారీ వర్షపాతం ఇదేనని వాతావరణ శాఖ వెల్లడించింది. సుమారు 25 రోజుల పొడి వాతావరణం అనంతరం ఈశాన్య రుతుపవనాల ప్రారంభంతో ఈ కుండపోత మొదలైంది.
🌧️ கனமழை முன்னெச்சரிக்கை நடவடிக்கைகள்! சென்னையில் பெய்து வரும் கனமழையைத் தொடர்ந்து, மாண்புமிகு அமைச்சர் திரு. ஆதவ் அர்ஜுனா அவர்கள் ரிப்பன் மாளிகைக்குச் சென்று, மீட்புப் பணிகளுக்காக வந்துள்ள தேசிய பேரிடர் மீட்புப் படையினரைச் சந்தித்தார். மீட்புப் பணிகள் மற்றும் முன்னெச்சரிக்கை நடவடிக்கைகள் குறித்து ஆலோசனை நடத்தி, தேவையான அறிவுரைகளையும் வழங்கினார். மக்களின் பாதுகாப்பே முதன்மை! மக்கள் நலனில் தொடர்ந்து களத்தில் TVK அரசு! 💪🌧️ #ChennaiRains #ChennaiWeather
— Vijay (@Vjaibharathi) October 18, 2026
ఈ ఆకస్మిక వర్షంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా స్తంభించింది. చెన్నై విమానాశ్రయం రన్‌వే, ప్రధాన రహదారుల్లోకి భారీగా వరద నీరు చేరింది. కోల్‌కతా నుంచి వచ్చిన ఇండిగో విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించగా, మధురై, కోయంబత్తూర్, తిరువనంతపురం, కౌలాలంపూర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన 10కి పైగా విమానాలు ల్యాండింగ్ కాక గాల్లోనే చక్కర్లు కొట్టాయి. దుబాయ్, సింగపూర్, ఢిల్లీ, ముంబై వెళ్లే విమానాలు సుమారు అరగంటకు పైగా ఆలస్యమయ్యాయి. మరోవైపు కిలాంబాక్కం బస్ టెర్మినస్, అన్నా సాలై వంటి ప్రధాన రహదారులు జలమయమై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
ముంపు ప్రాంతాలైన రాయపురం తదితర ప్రాంతాల్లో పేరుకుపోయిన నీటిని సమీప నదుల్లోకి తరలించేందుకు హై-కెపాసిటీ సక్షన్ ట్రక్కులను అధికారులు మోహరించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి సహాయక చర్యలను వేగవంతం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాలు తెరిచారు. వరద సహాయం, సమాచారం కోసం ప్రజలు '1913' హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఆదివారం ఉదయానికి వర్షం తగ్గడంతో ప్రధాన ప్రాంతాల్లో వరద నీటిని తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాగా కుండపోత వర్షం వల్ల చెన్నైలోని ప్రధాన రహదారులు, విమానాశ్రయం జలమయమై జనజీవనం స్తంభించిన వేళ, ప్రజల భద్రతకే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గంటగంటకూ పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్


