ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్ | Prashant Kishor calls Nitish Kumar one of Bihars 10 best leaders | Sakshi
Sakshi News home page

ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్

Oct 18 2026 8:49 AM | Updated on Oct 18 2026 8:49 AM

Prashant Kishor calls Nitish Kumar one of Bihars 10 best leaders

పట్నా: జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. హాజీపూర్‌లో శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, బిహార్ చరిత్రలోనే అత్యుత్తమ పది మంది రాజకీయ నాయకుల్లో నితీష్ కుమార్ ఒకరని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన చేసిన కృషిని ఎవరూ కాదనలేరని ప్రశంసించారు.

అయితే గతంలో ఆయనపై తాను చేసిన విమర్శలను పునరుద్ఘాటిస్తూ, మానసిక ఆరోగ్యం సరిగా లేకపోయినా నితీష్ కుమార్‌ను అధికారంలో కొనసాగించారని, తెరవెనుక ఇతరులే ప్రభుత్వాన్ని నడిపించారని ఆరోపించారు. ఇదే సమయంలో మోకామా ఎమ్మెల్యే అనంత్ సింగ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఇది అధికార జేడీయూ, ప్రతిపక్ష ఆర్జేడీల మధ్య విషయమని, దీనిపై దర్యాప్తు జరిపించాలా వద్దా అనేది వారి విచక్షణకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు.

మరోవైపు, వైశాలి జిల్లాలో 13 మంది చిన్నారులు మరణించిన పడవ ప్రమాదంపై ప్రశాంత్ కిశోర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంతటి భారీ విషాదం జరిగితే ప్రభుత్వాలే కూలిపోయేవని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతం ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నియోజకవర్గ పరిధిలో ఉందన్న కారణంతోనే ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి బాధిత గ్రామాన్ని సందర్శించలేదని ఆయన ఆరోపించారు. మృతుల కుటుంబాలకు తగిన సాయం, సానుభూతి అవసరమని పేర్కొన్న ప్రశాంత్ కిశోర్, దసరా పండుగ రోజైన అక్టోబర్ 20న ఆ గ్రామాన్ని సందర్శించి, రోజంతా అక్కడే ఉండి బాధితులను పరామర్శిస్తానని ప్రకటించారు. 

ఇదీ చదవండి: తొక్కిసలాట: ‘అమ్మ నా ముందే ప్రాణాలొదిలింది’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement