కూటమి రాజకీయాలకో దండం! | - | Sakshi
Sakshi News home page

కూటమి రాజకీయాలకో దండం!

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

విశాఖ విద్య: ఉత్తర నియోజకవర్గంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలి నుంచి వార్డు కార్పొరేటర్‌గా పోటీ చేయాలని భావించిన ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు కుమార్తె శ్యామల దీపిక చివరి నిమిషంలో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో ఆమె పోటీ చేయడం లేదని స్పష్టమైంది. తొలి నుంచి పాత 14వ వార్డు, ప్రస్తుత 53వ వార్డులో పోటీ చేసేందుకు శ్యామల దీపిక సన్నాహాలు చేసుకున్నారు. తండ్రి ఆశీస్సులతో రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. అయితే టికెట్ల కేటాయింపు సమయంలో ఎంపీ నిర్ణయమే కీలకంగా మారడంతో పరిణామాలు మారినట్లు సమాచారం. ముందుగా 51వ వార్డులో బీజేపీ అభ్యర్థిని మార్చడంతో ఆ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో తాను కూడా పోటీ చేయకూడదని దీపిక నిర్ణయించుకున్నారు. మరోవైపు 53వ వార్డును కూడా టీడీపీకి కేటాయించాలని ఎంపీ పట్టుబట్టడంతో ఆమె వెనక్కి తగ్గారనే చర్చ సాగుతోంది. తన సొంత నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఎమ్మెల్యేకు స్వేచ్ఛ లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. ఎమ్మెల్యే కుమార్తెగానే కాకుండా ఓ మహిళగా, విద్యావంతురాలిగా తనకు అవకాశం దక్కలేదా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలపై కుటుంబ సభ్యుల వద్ద కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

తాటిచెట్లపాలెం: రైల్వేస్టేషన్‌ కేరేజ్‌ అండ్‌ వేగన్‌ విభాగం ఆధ్వర్యంలో రోలింగ్‌ షెడ్‌లో ఆదివారం దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోహ్ర, సీనియర్‌ డీఎంఈ ఆనంద్‌కుమార్‌, కోచింగ్‌ డిపో ఆఫీసర్‌ కేతన్‌ ఆర్‌ పటిల్‌ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో విజేతలైన మహిళలకు అమ్మవారి చీరలు పంపిణీ చేశారు. సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ ఎన్‌.వి. ప్రసన్నకుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement