ఆరోగ్య నిపుణులకే సవాల్‌..ఈ101 ఏళ్ల తాతగారి లైఫ్‌స్టైల్‌! | Health Tips: 101-year-old Chinese man loves Coke Sprite and seafood | Sakshi
Sakshi News home page

ఈ 101 ఏళ్ల తాతగారి ఆహారపు అలవాట్లు తెలిస్తే షాకవ్వుతారు..! ఇప్పటికీ కోక్‌, స్ప్రైట్‌..

Oct 18 2026 4:03 PM | Updated on Oct 18 2026 4:46 PM

Health Tips: 101-year-old Chinese man loves Coke Sprite and seafood

వైద్యులు ఆరోగ్యకరమైన జీవితం కోసం ఎన్నో సూచనలు సలహాలు ఇస్తుంటారు. అందులో ప్రధానంగా వర్కౌట్లు, ఆహారపు అలావాట్లు అత్యంత కీలకం. తీసుకునే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని చెబుతుంటారు. కానీ ఈ తాతగారు ఆ మాటలన్నింటిని తలకిందులు చేసేలా 101 ఏళ్లు బతికి చూపాడు. అతడు అనుసరించే అలవాట్లు తెలిస్తే..నోటమాటరాదు. ఇదేంటిది ఇవేమి ఆహారపు అలవాట్లు అని విస్తుపోవడం ఖాయం. 

ఆ తాతగారే చైనాకు చెందిన లూ షిజెంగ్‌. జెజియాంగ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఈ తాతగారు ఆయన తీసుకునే ఆహారాలకు..దీర్ఘాయువుకి అస్సలు సంబంధం ఉండదు. సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే..చక్కెర రహిత పదార్థాలను తీసుకోవాలని సూచిస్తుంటారు. కానీ ఈ లూ తాత తనకు ఇష్టమైన శీతల పానీయాలను ఆస్వాదిస్తూనే..నచ్చినవన్నీ లాగించేస్తున్నాడు. తన పొదపులో గణనీయమైన భాగం ఆహారంపైనే ఖర్చు చేస్తుండటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో నివశించే లూ కిరాణ సామాను కోసం ప్రతి ఐదురోజులకొకసారి రిక్షాలో స్థానిక మార్కెట్‌కు వెళ్తాడట. 

అక్కడ ఎక్కువగా కొనుగోలు చేసే వాటిలో చేపలు, రొయ్యలు, పీతలు, సముద్రపు ఆహారం, తాజా కూరగాయాలే ఉంటాయి. గతేడాది వరకు ఈ తాతగారు తన సొంత ట్రై సైకిల్‌పైనే వెళ్లేవారట మార్కెట్‌కి. అయితే ఒకసారి కిందపడటంతో అతని కుటుంబం ఇలా అతడికి సౌకర్యం అందించింది. అప్పటి నుంచే కాస్త జాగ్రత్తగా ఉండటం ప్రారంభించారడు లూ. ఆయనకు కోక్‌, స్ప్రైట్‌ అంటే మహా ఇష్టమట. అవి లేకుండా రోజు గడవుదు, ముద్ద దిగదట. 

ముఖ్యంగా చల్లటి స్ప్రైట్‌లో చల్లటి వైన్‌ కలుపుకుని తాగనిదే రోజు గడవదట ఈ తాతగారికి. ఆయన ఒకే భోజనంలో అరగిన్నె భోజనం హాంఫట చేసేస్తాడట. స్వీట్స్‌ అన్నా మహా ఇష్టమట. అతని కుమారులు ఇటీవలే అతడి బాగోగులు చూసుకునేలా ఒక ఆయాను కూడా ఏర్పాటు చేశారు. అతని కుమారుల్లో ఒకరు బీజింగ్‌లో నివశిస్తుండగా, మరొకరు సమీపంలోని ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. 

అయితే లూ నిద్రవేళలు క్రమం తప్పవట. అతను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భోజనం ముగించి, సుమారు రాత్రి 8 గంటలకల్లా నిద్రపోతాడు. అతడు ఉదయం 4 గంటలకు నిద్రలేచినప్పటికీ, ఆరు అయ్యేంత వరకు బెడ్‌మీదనే విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడట. అలాగే మధ్యాహ్నం పూట ఒక కునుకు వేయాల్సిందేనట. అంతేగాదు జలుబు కూడా అత్యంత అరుదేనట. అంతేగాదు మంచి జ్ఞాపకశక్తి అతడి సొంతం. బీపీ, షుగర్‌ వంటి ఎలాంటి దీర్ఘ ‍వ్యాధులు కూడా లేవు. 

తనకు నెలవారీగా వచ్చే వృద్ధాప్య భృతితోనే కాలం వెళ్లదీస్తున్నారాయన. అక్కడ చైనా సుదీర్ఘకాలం జీవించ వృద్ధులకు నెలకు రూ. 11 వేలు చొప్పున జీవన భృతి అందిస్తుందట. అంతేగాదు ఈ లూ తాతగారి జీవనశైలి అత్యంత విరుద్ధంగా ఉన్నా..క్రమబద్ధమైన నిద్రవేళలే అతడి దీర్ఘాయువు రహస్యం కాబోలు అని అనుకుంటున్నారు పలువురు. ఈ తాతాగారి హెల్త్‌ సీక్రెట్‌ విన్నాక..ఒక నిర్థిష్టమైన జీవనశైలిపై ఆరోగ్యం ఆధారపడి ఉండదని, ప్రశాంతమైన జీవితం గడిపే వాళ్లు ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నా..సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటారని నిరూపితమైంది కదూ..!.

ఇదీ చదవండి: రేడియంట్‌ బ్యూటీ! పొరపాటున కూడా ఆ తప్పు చేయొద్దు..
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement