19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి | Durga Puja Stampede BJP Dilip Ghosh Reaction | Sakshi
Sakshi News home page

19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి

Oct 18 2026 9:44 AM | Updated on Oct 18 2026 9:52 AM

Durga Puja Stampede BJP Dilip Ghosh Reaction

న్యూఢిల్లీ: కోల్‌కతాలోని చోర్‌బగాన్ దుర్గా పూజా మండపంలో శనివారం సాయంత్రం జరిగిన తొక్కిసలాట అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రమంలో రాష్ట్ర క్యాబినెట్ మంత్రి దిలీప్ ఘోష్ ప్రకటన వెలువడింది. ఈ విషాదకర సంఘటనపై ఆయన స్పందిస్తూ, ఇలాంటి భారీ సమూహాలు ఉండే వేడుకల్లో అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటాయని వ్యాఖ్యానించారు.

దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, ‘జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అయితే అప్పుడప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ భారీ ఎత్తున వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు, అమ్మవారి దర్శనం కోసం లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. కొన్నిసార్లు చిన్నపాటి పొరపాటు లేదా అజాగ్రత్త వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి, నిజానికి ఇవి ఎప్పుడూ జరగకూడదు. మన దేశంలో ఎక్కడైనా మతపరమైన ప్రదేశాల్లో లేదా భారీ సమూహాలు ఉండే ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. అందుకే నిర్వాహకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని అన్నారు.

ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ప్రభుత్వ ప్రతినిధులు, జాతీయ పార్టీ అధ్యక్షుడు, పలువురు మంత్రులు, నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన వెల్లడించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఉదంతంపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న ప్రశ్నకు దిలీప్ ఘోష్ స్పందిస్తూ, ‘రాజకీయాలు చేసేవారు చేస్తూనే ఉంటారు. ఎన్నో చోట్ల పూజలు జరుగుతున్నాయి, ప్రతిచోటా పోలీసులు ఉన్నారు. లక్షలాది మంది రోడ్లపై తిరుగుతున్నారు. ఇలా జరగకూడదు, కానీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది’ అని అన్నారు.

ఈ ప్రమాదంపై టీఎంసీ నేత కునాల్ ఘోష్ స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో ‘చోర్‌బగాన్ ఘటనలో జరిగిన మరణాలపై ముఖ్యమంత్రి ప్రకటన అసంపూర్తిగా ఉంది. బాధ్యతల నుంచి తప్పించుకునేలా, తప్పుదోవ పట్టించేలా, దృష్టి మళ్లించేలా ఉంది. కమిటీ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలి. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఓఎస్డీలను తొలగించాలి. ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ అవసరం. కమిటీలో బీజేపీ సభ్యులు ఉన్నారు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాన్ని సాకుగా చూపి పాలనా వైఫల్యాన్ని దాచిపెట్టేందుకు చూస్తున్నారు’ అని ఆరోపించారు.

ఇదీ చదవండి: చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్‌ ప్రత్యేక ఆదేశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement