Photo Credit: BCCI Twitter
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌లపై ఇరుజట్ల బ్యాటర్లు చెలరేగగా.. బౌలర్లు మాత్రం వికెట్ల కోసం శ్రమించాల్సి వచ్చింది. ఐదు టీ20లు కలిపి దాదాపు 1700 పరుగులకు పైగా (రెండు ఇన్నింగ్స్‌లు కలిపి) నమోదవ్వడం విశేషం. ఇందులో వెస్టిండీస్ ఒకసారి ఆలౌట్ కాగా, భారత్ రెండుసార్లు ఆలౌట్ అయింది.
ఈ నేపథ్యంలో రెండు జట్లు కలిపి ఐదు టీ20ల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య 105గా ఉంది. ఒక ద్వైపాక్షిక సిరీస్‌లో వందకు పైగా సిక్సర్లు రావడం ఇది నాలుగోసారి. గతంలో 2023-34లో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో 120 సిక్సర్లు నమోదయ్యాయి. 2025లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో ఇరుజట్ల బ్యాటర్లు కలిపి 117 సిక్సర్లు బాదారు.
2026లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో 116 సిక్సర్లు నమోదయ్యాయి. 2019లో టీమిండియా, విండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో 96 సిక్సర్లు రాగా.. 2021-22లో ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్‌లో 96 సిక్సర్లు నమోదయ్యాయి.
రన్‌రేట్ పరంగా ప్రపంచ రికార్డు..
ఇక భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్ రన్‌రేట్ పరంగా ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా 10.98 రన్‌రేట్‌తో పరుగులు రావడం విశేషం. గతంలో ఈ రికార్డు భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ (10.57 రన్‌రేట్) అత్యుత్తమంగా ఉండగా, తాజా రికార్డుతో ఇది రెండో స్థానానికి పడిపోయింది.
ఇక 2025లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య టీ20 సిరీస్‌లో 9.63 రన్‌రేట్‌తో పరుగులు వచ్చాయి. 2026లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో 9.36 రన్‌రేట్‌తో పరుగులు సాధించగా, 2023-24లో ఇంగ్లండ్, వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో 9.21 రన్‌రేట్‌తో పరుగులు నమోదయ్యాయి.
An entertaining series comes to an end 🤝 🎥 BCCI Hon. Treasurer Mr A. Raghuram Bhat presents the @mflone_ T20I Series trophy to #TeamIndia Captain Shreyas Iyer and West Indies Captain Shai Hope 🏆 #INDvWI https://t.co/iKA8vx68ba
— BCCI (@BCCI) October 17, 2026
ఇదీ చదవండి: పాపం వెస్టిండీస్.. రిక్త హస్తాలతోనే స్వదేశానికి!


