Photo Credit: Twitter
భారత గడ్డపై సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకున్న వెస్టిండీస్ కల నెరవేరలేదు. విండీస్ కోచ్ డారెన్ సామీ ‘ఈసారి భారత్‌ను వారి సొంతగడ్డపై ఓడించి 24 ఏళ్ల కలను నిజం చేస్తాం’ అని సిరీస్ ప్రారంభానికి ముందు చేసిన చాలెంజ్ నిర్వీర్యంగా మారిపోయింది. అయితే గతంతో పోలిస్తే వెస్టిండీస్ జట్టు భారత్‌కు గట్టి పోటీనిచ్చింది.
కెప్టెన్ షై హోప్ సెంచరీలతో హోరెత్తించడమే గాక, వన్డే, టీ20 సిరీస్‌లు కలిపి 539 పరుగులు సాధించిన హోప్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డుతో పాటు మూడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు పట్టుకెళ్లాడు. మరో స్టార్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఐపీఎల్ పుణ్యమా అని భారత్ మైదానాలు కొట్టిన పిండిగా మారిపోయాయి. దీంతో అతడు కూడా బ్యాట్‌ను ఝలిపించాడు. 5 మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ ఆడిన రూథర్‌ఫోర్డ్ 221 పరుగులు సాధించాడు.

ఇక కీమో పాల్, రోస్టన్ చేజ్, షమర్ స్ప్రింగర్ లాంటి క్రికెటర్లు భారత్‌పై రాణించి ఐపీఎల్ నిర్వాహకుల దృష్టిలో పడ్డారు. వెస్టిండీస్ భారత గడ్డపై చివరిసారిగా 2002లో ద్వైపాక్షిక సిరీస్‌ను గెలుచుకుంది. నాడు ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4-3తో వెస్టిండీస్ కైవసం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ వెస్టిండీస్ భారత గడ్డపై సిరీస్ గెలవడంలో విఫలమవుతూనే వచ్చింది.
తాజాగా వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన విండీస్.. టీ20 సిరీస్‌లో మాత్రం ఊహకందని విధంగా రాణించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అయితే చివరి టీ20లో గెలిచి సిరీస్‌ను ఎగరేసుకుపోవాలని భావించిన వెస్టిండీస్ కలకు వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో పాపం విండీస్ ఈసారి కూడా రిక్త హస్తాలతోనే స్వదేశానికి వెళ్లిపోయింది.
ఇదీ చదవండి:


