వైభవ్‌ ఒక అద్భుతం.. కానీ ఓపిక పట్టాల్సిందే: శ్రేయస్‌ అయ్యర్‌ | Shreyas Iyer Gives Verdict On Vaibhav Sooryavanshis Chances Of Playing In New Zealand T20Is | Sakshi
Sakshi News home page

వైభవ్‌ ఒక అద్భుతం.. కానీ ఓపిక పట్టాల్సిందే: శ్రేయస్‌ అయ్యర్‌

Oct 18 2026 3:15 AM | Updated on Oct 18 2026 3:15 AM

Shreyas Iyer Gives Verdict On Vaibhav Sooryavanshis Chances Of Playing In New Zealand T20Is

PC: BCCI/X

భారత్‌, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. శనివారం బెంగళూరు వేదికగా జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, ఇరు జట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకున్నాయి.

ఈ సిరీస్ ముగింపు సందర్భంగా భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కడంపై శ్రేయస్ స్పష్టత ఇచ్చాడు. వైభవ్ ఒక అద్భుతమైన ఆటగాడని, కానీ తుది జట్టులో చోటు కాస్త ఓపిక పట్టాలని అయ్యర్ అన్నాడు.

కాగా వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్ మొత్తానికి వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. అంతకముందు అఫ్గానిస్తాన్ సిరీస్‌లోనూ అతడికి ఆడే అవకాశం దక్కలేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతుండడమే ఇందుకు ప్రధాన కారణం.

"వైభవ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం జట్టులో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ రూపంలో ఇద్దరు అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారు. టీ20 ప్రపంచకప్ విజయంలో వారు కీలక పాత్ర పోషించడమే కాకుండా, తర్వాతి సిరీస్‌లలోనూ నిలకడగా రాణిస్తున్నారు. 

అలాంటప్పుడు వారిని పక్కన పెట్టడం సరైన నిర్ణయం కాదు. కానీ వైభవ్‌కు కచ్చితంగా అవకాశం వస్తుంది. అతడు తన ప్రాసెస్‌పై దృష్టి పెట్టి కాస్త ఓపికగా ఉండాలి. ఇదే విషయాన్ని నేను అతడికి పదే పదే చెబుతుంటాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో వెల్లడించాడు.

కాగా అక్టోబర్ 22 నుంచి క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌-కివీస్‌ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ఈ జట్టులో చోటు దక్కింది.
చదవండి: BAN vs ZIM: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన జింబాబ్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement